దేహం చూస్తే.. డైనోసార్. రెక్కలు చూస్తే గబ్బిలం! ‘యీ క్వీ’ అనే ఈ డైనోసార్ గబ్బిలం(డైనోబాట్) 16 కోట్ల ఏళ్ల క్రితం జురాసిక్ యుగం చివరికాలంలో చైనాలో నివసించిందట. ఇది ఇతర డైనోసార్ల కన్నా విభిన్నంగా ఉందని, బహుశా రాక్షసబల్లుల నుంచి పక్షులు పరిణామం చెందడం దీని నుంచే ప్రారంభమై ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఉత్తరచైనాలోని కింగ్‌లాంగ్ కౌంటీలో ఓ రైతు ఈ పక్షి శిలాజాన్ని గుర్తించాడు. శిలాజాన్ని అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు అప్పట్లో ‘యీక్వీ’ ఇలా ఉండేదని ఊహారూపమిచ్చేశారు!
డైనోసార్ గబ్బిలం!
Published Fri, May 1 2015 1:17 AM | Last Updated on Sun, Sep 3 2017 1:10 AM
Advertisement
Advertisement