Dinosaur fossils
-
భారత్‌లో బయటపడ్డ అరుదైన డైనోసార్ల గుడ్లు!
భోపాల్: డైనోసార్లు(రాక్షస బల్లులు).. వీటి రూపం ఎలా ఉంటుందో సినిమాల ద్వారా అందరికీ పరిచయమే. భౌతికంగా ఈ జాతులు మిలియన్ల సంవత్సరాల కిందటే అంతరించినా.. ఈ భూమ్మీద వీటి అవశేషాలు శిలాజాల రూపంలో బయల్పడుతూనే ఉన్నాయి. తాజాగా భారత్‌లో అరుదైన రాక్షస బల్లుల గుడ్లను వెలికితీశారు పరిశోధకులు. ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు పరిశోధకులు మధ్యప్రదేశ్ లోని ధార్ జిల్లాలోని డైనోసార్ ఫోసిల్ నేషనల్ పార్క్ లో తవ్వకాలు చేపట్టారు. ఈ సందర్భంగా పది డైనోసార్ గుడ్ల అవశేషాలను వెలికితీశారు. ఇప్పటివరకు లభ్యమైన గుడ్లతో పోల్చితే ఇవి ఎంతో భిన్నంగా ఉండడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అవన్నీ అసాధారణరీతిలో ఉన్నట్టు గమనించారు. సారోపోడ్ వర్గానికి చెందిన టిటానోసారస్ డైనోసార్లకు చెందినవిగా నిర్ధారించారు. ఓవమ్ ఇన్ ఓవో.. ఒక గుడ్డులోనే మరొక గుడ్డు ఏర్పడి ఉండడంతో రీసెర్చర్లు ఆశ్చర్యపోయారు. శాస్త్ర పరిభాషలో ఈ స్థితిని ‘ఓవమ్ ఇన్ ఓవో’ అంటారు. సాధారణంగా.. గుడ్డులోనే గుడ్డు ఉండడం అనే స్థితి పక్షుల్లో అధికంగా కనిపిస్తుందని. సో.. టిటానోసారస్ డైనోసార్లకు పక్షులకు మధ్య దగ్గరి సంబంధం ఉండొచ్చని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.ధార్ జిల్లాలోని నేషనల్ పార్క్ ప్రాంతంలో ఇప్పటికే 52 టిటానోసారస్ సారోపోడ్స్ డైనోసార్ గూడులను(పక్షుల మాదిరి) వెలికితీశారు. లక్షల సంవత్సరాల క్రితం భూమిపై సంచరించి, ప్రతికూల వాతావరణం కారణంతోనే డైనోసార్లు అంతరించి పోయాయన్నది అందరికీ తెలిసిందే. -
పిరికి డైనోసార్లు.. ఎలా బతికేవో తెలుసా?
Patagonian fossils show Jurassic dinosaur had herd mentality: డైనోసార్ల ఉనికి.. మనుగడ కాలంపై నిర్ధారణ కోసం పరిశోధనలు ఎన్నో ఏళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. అర్జెంటీనా దక్షిణ భాగంలోని పటగోనియా రీజియన్‌లో దొరికిన వివిధ జాతుల డైనోసార్ల శిలాజాల్ని.. ఈ భూమ్మీద అత్యంత ప్రాచీన సాక్ష్యాలుగా పరిగణిస్తుంటారు. అయితే వీటి ఆధారంగా డైనోసార్లు బతికిన విధానంపై సైంటిస్టులు ఇప్పుడొక అంచనాకి వచ్చారు. గురువారం ఈ మేరకు సైంటిస్టుల పరిశోధనకు సంబంధించిన కథనం.. సైంటిఫిక్ రిపోర్ట్స్ అనే జర్నల్‌లో పబ్లిష్ అయ్యింది. వందకి పైగా గుడ్లు, 20కిపైగా భారీ డైనోసార్లు, 80 పిల్ల డైనోసార్ల అవశేషాల ఆధారంగా.. డైనోసార్లు గుంపులుగా కలిసి బతికేవని అంచనాకి వచ్చారు. సుమారు 193 మిలియన్ సంవత్సరాల కిందట వీటి మనుగడ కొనసాగి ఉంటుందని భావిస్తున్నారు. ముస్సావురస్(సావ్రోపోడోమార్ఫ్ జాతి) డైనోసార్లు 20 అడుగుల ఎత్తు, టన్నున్నర బరువు పెరుగుతాయి. ఈ డైనోసార్ జాతి ఇక్కడి సముహంలో బతికినట్లు భావిస్తున్నారు. వీటికి పొడవైన మెడ.. తోక, స్తంభాల్లాంటి కాళ్లు ఉంటాయి వీటికి. ఇవి పూర్తి శాఖాహారులు. గుత్తగంపగా ఇవి అన్నీ కలిసి గుడ్లు పెట్టడం విశేషం. కందకాల్లో పొరలు పొరలుగా ఆడ డైనోసార్లు పెట్టిన గుడ్ల(పిండం అభివృద్ధి చెందిన దశలో)ను పరిశోధకులు సేకరించారు. ఇక భారీ డైనోసార్ల శిలాజాలు విడి విడిగా లభించగా.. పిల్ల డైనోసార్ల శిలాజాలు మాత్రం గుంపుగా ఒకే దగ్గర దొరికాయి. మట్టి దిబ్బల నుంచి ఈ డైనోసార్ల అవశేషాలను సేకరించారు. కరువు వల్లే ఇవన్నీ సామూహికంగా అంతం అయ్యి ఉంటాయని, ఆపై ఇసుక తుపాన్లు వీటి కళేబరాలను ముంచెత్తి ఉంటాయని భావిస్తున్నారు. అయితే ముస్సావురస్ చాలా పిరికివని, దాడి చేసే సత్తా కూడా ఉండేవి కావేమోనని, శత్రువుల(రాకాసి డైనోసార్ల) నుంచి తమను తాము కాపాడుకునేందుకే గుంపులుగా తిరిగేవని, పిల్ల డైనోసార్లనూ మధ్యలో ఉంచుకుని గుంపులుగా రక్షించుకునేవని నిర్ధారణకు వచ్చారు. హై రెజల్యూషన్ ఎక్స్‌రే.. (కంప్యూటెడ్ టోమోగ్రఫీ) ఆధారంగా వీటిని స్కాన్ చేసి ముస్సావురస్ డైనోసార్ల జీవన విధానంపై ఒక నిర్ధారణకు వచ్చారు. అయితే పటాగోనియాలోనే Argentinosaurus ఆర్జెంటినోసారస్ను భూమ్మీద అత్యంత భారీ డైనోసార్‌గా(ఈ భూమ్మీద అత్యంత పెద్ద ప్రాణిగా) భావిస్తుంటారు. 118 ఫీట్ల ఎత్తు, 70 టన్నుల బరువు ఉండేదని వాటి శిలాజాల ఆధారంగా నిర్దారించుకున్నారు. ఇవి మాత్రం పక్కా మాంసాహారులని సదరు జర్నల్‌లో కథనం ఉంది. చదవండి: మనుషుల్ని గోళ్లతో చీల్చి చంపేసే భయంకరమైన పక్షి గురించి తెలుసా? -
రాకాసిబల్లి వేటలో జీఎస్ఐ
సాక్షి, హైదరాబాద్: రాక్షస బల్లుల శిలాజాల జాడ కనుక్కునేందుకు చాలాకాలం తర్వాత జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) మళ్లీ నడుం బిగించింది. మంచిర్యాల జిల్లా యామన్‌పల్లి పరిసరాల్లో ఆ విభాగం శాస్త్రవేత్తల బృందం మూడు రోజులపాటు పర్యటించి శిలాజాల ఆధారాలను కనుగొంది. రాకాసిబల్లితోపాటు కొన్ని ఇతర జంతువుల శిలాజాలుగా భావిస్తున్న రాళ్లపై ప్రాథమిక పరిశోధనలు చేసి వాటిల్లో శిలాజాలుగా గుర్తించిన వాటిల్లో కొన్నింటిని, మిగతావాటి నమూనాలను సేకరించారు. ‘రాళ్లలో రాక్షసబల్లి’శీర్షికతో మే 22న ‘సాక్షి’ప్రచురించిన కథనానికి ఆ విభాగం స్పందించింది. స్థానిక యామన్‌పల్లి సమీపంలో నిర్మించిన వంతెన రివిట్మెంట్ రాళ్లలో శిలాజాలను పోలిన రాళ్లున్న విషయంతోపాటు, ఇతర ప్రాంతాల్లో కనిపిస్తున్న కొన్ని జాడల వివరాలు, స్థానికులు కొందరు శిలాజాలను బేరం పెట్టిన తీరును ఆ కథనం వెలుగులోకి తెచ్చింది. 1970లలో ఇక్కడే డైనోసార్ అస్థిపంజరం లభించింది. మూడు రాక్షస బల్లులకు సంబంధించిన ఎముకలను సేకరించిన అప్పటి జీఎస్ఐ పరిశోధకులు వాటిని ఓ ప్రత్యేక పద్ధతిలో కూర్చి డైనోసార్ ఆకృతిని రూపొందించారు. ప్రస్తుతం హైదరాబాద్ బీఎం బిర్లా సైన్స్ మ్యూజియంలోని డైనోసోరియంలో ప్రదర్శనలో ఉన్న ఆకృతి అదే. కోల్‌కతా మ్యూజియం తర్వాత రాక్షసబల్లి రెండో అస్థిపంజరం మనదేశంలో ఇదే కావటం విశేషం. అప్పట్లో జీఎస్ఐ పరిశోధకులు యాదగిరి ఈ ప్రాంతంలో విస్తృతంగా పరిశోధనలు జరిపి వాటి ఆధారాలను గుర్తించారు. ఆయన మృతి చెందిన తర్వాత దాదాపు 2 దశాబ్దాలుగా జీఎస్ఐ ఇటువైపు చూడలేదు. దీంతో అప్పటినుంచి ఆయా ప్రాంతాల్లో అడపాదడపా శిలాజాలు వెలుగు చూస్తున్నా... వాటిపై స్థానికుల్లో అవగాహన లేకుండా పోయింది. దీంతో శిలాజాలను సాధారణ రాళ్లుగానే భావిస్తూ పనులకు వాడుకుంటున్నారు. ఇదేక్రమంలో ఇటీవల వంతెన రివిట్మెంట్లో కూడా వాడేశారు. అందులోని కొన్ని రాళ్లు శిలాజాలను పోలినట్టు ఉండటంతో ఔత్సాహిక చరిత్ర పరిశోధకులు శ్రీరామోజు హరగోపాల్, సముద్రాల సునీల్, పులిపాక సాయి తదితరులు వాటిచిత్రాలు సేకరించారు. వాటిని పుణెలోని డెక్కన్ కళాశాలలో పనిచేస్తున్న శిలాజాల నిపుణులు ప్రొఫెసర్ బాదామ్ దృష్టికి ‘సాక్షి’తీసుకెళ్లగా.. అందులో కొన్ని శిలాజాలేనని ధ్రువీకరించారు. ఈ మొత్తం వ్యవహారాన్ని సచిత్రంగా వివరిస్తూ ‘సాక్షి’కథనం వెలువరించటంతో రెండు దశాబ్దాల తర్వాత జీఎస్ఐ మళ్లీ పరిశోధనలకు శ్రీకారం చుట్టింది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా హైదరాబాద్ విభాగం సంచాలకులు మంజూషా మహాజన్ ఆదేశంతో శాస్త్రవేత్తల బృందం మూడు రోజులపాటు మంచిర్యాల జిల్లా యామన్పల్లితోపాటు సమీపంలోని పలు గ్రామాల శివార్లలో పర్యటించింది. వంతెన రివిట్మెంట్ రాళ్లను పరిశీలించి వాటిల్లో శిలాజాలున్నట్టు ప్రాథమికంగా గుర్తించింది. వెంట తెచ్చుకున్న రసాయనాలు, మైక్రోస్కోప్ ఆధారంగా ప్రాథమికంగా గుర్తించిన వాటిలో కొన్ని రాళ్లను వాళ్లు సమీకరించారు. కొన్నింటిని నమూనాలను సేకరించి తదుపరి పరిశీలనకు ల్యాబ్‌కు పంపారు. వాటి పూర్తి వివరాలు అందిన తర్వాత ఆయా ప్రాంతాల్లో తవ్వకాలు జరపాలని నిర్ణయించినట్టు తెలిసింది. శిలాజాల జాడలను అన్వేషిస్తున్నాం ‘సాక్షిలో ప్రచురితమైన కథనం ఆధారంగా ఆ ప్రాంతంలో పర్యటించాం. కొన్ని రాళ్లను ప్రాథమికంగా పరిశీలించినప్పుడు శిలాజాలనే తేలింది. పూర్తిస్థాయి పరిశీలన జరగాల్సి ఉంది. పక్షం రోజుల తర్వాత వాటికి సంబంధించిన నివేదిక వస్తుంది. ఆ తర్వాత చర్యలు తీసుకుంటాం. శిలాజాలపై ప్రజల్లో అవగాహన రావాల్సిన అవసరం ఉంది. వాటిని ధ్వంసం చేయొద్దు. వాటి ఆధారం గానే తదుపరి పరిశోధనలు జరుగుతాయి’అని జీఎస్ఐ హైదరాబాద్ సంచాలకులు మంజూషా మహాజన్ మంగళవారం ‘సాక్షి’కి వెల్లడించారు. వెంటనే చర్యలు చేపట్టాలి: హరగోపాల్ కోట్ల సంవత్సరాల క్రితం తిరగాడిన రాకాసి బల్లులు, నాటి ఇతర జంతువులు, పక్షులకు సంబంధించిన ఆసక్తికర విషయాలు ఇప్పటికీ వెలుగుచూసే అవకాశం ఉందని, అందుకు వాటి శిలాజాలు మాత్రమే ఏకైక ఆధారాలని ఔత్సాహిక పరిశోధకులు శ్రీరామోజు హరగోపాల్ పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా యామన్‌పల్లి పరిసరాల్లో గుర్తించినవి శిలాజాలేనని, అలాంటివి ఇంకా చాలా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. జీఎస్ఐ వెంటనే తవ్వకాలు జరిపితే కోట్ల ఏళ్ల నాటి జంతువులు, పక్షులు, మొక్కల శిలాజాలు వెలుగు చూస్తాయని పేర్కొన్నారు. మరోవైపు వాటిని ధ్వంసం చేయకుండా సామాన్య జనంలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. -
బుట్టాయిగూడెం అడవుల్లో డైనోసార్ శిలాజాలు
♦ గోదావరి పరీవాహక ప్రాంతాల్లో వృక్ష శిలాజాలు ♦ చరిత్ర పరిశోధకుడు రత్నాకర్‌రెడ్డి వెల్లడి ఏటూరునాగారం: వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలంలోని బుట్టాయిగూడెం అటవీ ప్రాంతంలోని లక్షల సంవత్సరాల కిందటి వృక్ష శిలాజాలు, డైనోసార్ శిలాజాలు ఉన్నట్లు ఆనవాళ్లు లభించాయి. ఆది మానవుల కాలం నాటి చరిత్రను మూడేళ్లుగా వెలుగులోకి తెస్తున్న అధ్యాపకుడు రెడ్డి రత్నాకర్‌రెడ్డి పరిశోధనలో ఇవి బయటపడ్డాయి. బుట్టాయిగూడెంలోని చెలకల్లో అడుగడుగునా శిలాజాలున్నాయి. రెండు మీటర్ల పొడువైన వృక్ష శిలాజంతోపాటు అనేక ప్రాంతాల్లో డైనోసార్ ఎముకలు కనిపిస్తున్నాయి. స్థానికులు వీటిని రాకాసి బొక్కలు అని పిలుస్తుంటారు. ఈ గ్రామంలో ప్రాచీన శిలా యుగానికి చెందిన అనేక రాతి పనిముట్లును రత్నాకర్ సేకరించారు. ఒక సూక్ష్మరాతి పనిముట్టు కూడా లభించిందని వెల్లడించారు. బుట్టాయిగూడెం నుంచి అడవుల్లోకి వెళ్లినట్లైతే మరిన్నీ పొడవైన శిలాజాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు. అడవిలో పరిశోధనలు జరిపితే డైనోసార్ల శిలాజాలు వెలుగులోకి వస్తాయని రత్నకర్ తెలిపారు. జంతు శిలాజపు మూడు అంగుళాల ఎముక దొరికిందన్నారు. పరిశోధనలో పకిడె అరవింద్, స్థానికులు గోగు కల్యాణ్, రేసు మణికంఠ పాల్గొన్నారు.