Residency
-
కేటీఆర్ ఇంటివద్ద అర్ధరాత్రి హై టెన్షన్
-
డైనోసర్ ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే.. ఇక్కడికి వెళ్లండి చాలు!
సాక్షి, సిటీబ్యూరో: నగర ప్రజలకు సరికొత్త అనుభూతులు అందించడానికి నెక్సస్ మాల్లో ‘డైనోసర్ ఎక్స్పీరియన్స్’ ఏర్పాటు చేశారు. ఈ నెల 17 నుంచి సెప్టెంబర్ 15 వరకు కొనసాగుతుంది. డైనోసార్ ప్రదర్శనలో డినో ఫాసిల్ మ్యూజియం, ఎత్తయిన డినో లింబ్, డైనోసార్ ఫుట్‌స్టెప్స్ ట్రయల్, ఆకట్టుకునే స్కెలిటన్ డిస్ప్లే ఉన్నాయి. మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 9 గంటల వరకు సందర్శకులకు అనుమతిస్తారు.బాలీవుడ్ నైట్.. 23న..సాక్షి సిటీబ్యూరో: ముంబైకి చెందిన ప్రముఖ లేడీ డీజే కర్మ.. లైవ్ దర్బూక పేరిట ప్రదర్శన ఇస్తున్నారు.నగరంలోని శ్రీనగర్‌కాలనీ రోడ్లో ఉన్న కమలాపురి కాలనీలోని విన్‌ఫ్లోరా రెసిడెన్సీ హోటల్లో శుక్రవారం రాత్రి 8.30 గంటల నుంచీ ఈ బాలీవుడ్ నైట్ ఈవెంట్ జరగనుంది. ఈ షోలో తనదైన శైలిలో విభిన్న రకాల ట్రాక్స్‌ను ఆమె కదం తొక్కించనున్నారు.డార్క్ కామెడీ షో.. 25న..సాక్షి, సిటీబ్యూరో: నగరవాసుల్ని ఇటీవల అమితంగా ఆకట్టుకుంటున్న వాటిలో కామెడీ షోలదే అగ్రస్థానం. ఈ నేపథ్యంలో మరో హాస్యభరిత కార్యక్రమం ఓన్లీ కామిక్స్ లెఫ్ట్ ఎలైవ్ పేరిట ఏ డేంజరస్ స్టాండప్ కామెడీ షో అనే ట్యాగ్ లైన్‌తో సిటీలో ఓ ఈవెంట్ నిర్వహిస్తున్నారు.జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్‌లోని ఎన్‌హ్యాన్స్ కేఫ్ అండ్ కన్ఫెక్షనరీలో ఈ నెల 25వ తేదీన రాత్రి 7గంటలకు ఈ కార్యక్రమం ఉంటుంది. -
రూ. 10 వేలు కట్టండి.. ఖర్చులు భరించండి
నోయిడా: బహుళ అంతస్తుల భవంతి లిఫ్ట్‌లో ఆరేళ్ల విద్యార్థిపై పెంపుడు శునకం దాడి ఘటనలో కుక్క యజమానిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. చిన్నారి చేతికి గాయం కావడంతో చికిత్సకయ్యే ఖర్చంతా భరించాలని, మరో రూ.10,000 పరిహారంగా చెల్లించాలని ఆయనను గ్రేటర్ నోయిడా అథారిటీ ఆదేశించింది. గ్రేటర్ నోయిడా(పశ్చిమం)లోని విలాసవంత లా రెసిడెన్షియా సొసైటీలో మంగళవారం ఈ ఘటన జరిగింది. సొసైటీలో ఉండే ఒకావిడ తన కొడుకుతో కలిసి లిఫ్ట్‌లో వెళ్తుండగా అప్పుడే ఒకతను తన కుక్కతో సహా లిఫ్ట్‌లోకి వచ్చాడు. వచ్చీరాగానే బాలుడిని కుక్క కరిచేసింది. దీంతో సీసీటీవీ ఫుటేజీ సాక్ష్యంతో ఐపీసీ సెక్షన్ 289 కింద కేసు నమోదుచేసినట్లు పోలీసులు చెప్పారు. ‘కుక్కను అదుపుచేయడంలో మీరు విఫలమయ్యారు’ అని అతడికి పంపిన నోటీసులో గ్రేటర్ నోయిడా అథారిటీ ఆరోగ్యవిభాగాధిపతి డాక్టర్ ప్రేమ్‌చంద్ పేర్కొన్నారు. రూ.10వేలు, చికిత్స ఖర్చు ఏడు రోజుల్లో చెల్లించకపోతే చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. -
రెండేళ్లకే నూరేళ్లు నిండాయి
మంచిర్యాలక్రైం: ఓ చిన్నారి బుడిబుడి అడుగులు వేసుకుంటూ వెళ్లి వరండాలోని గ్రిల్స్‌పైకి ఎక్కి జారిపడి మృత్యుఒడికి చేరింది.. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు... ‘మా విందుభోజనం’ హోటల్ యజమాని కొండబత్తుల ప్రవీణ్‌కుమార్, వాణి దంపతులు మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉన్న ఏసీసీ ప్రాంతంలోని ఎస్ఆర్ రెసిడెన్సీ నాలుగో అంతస్తులో ఉంటున్నారు. వీరికి కుమారుడు ఆయన్(5), కూతురు శాన్వి(23 నెలలు) ఉన్నారు. గురువారం ఉదయం కుటుంబసభ్యులు ఎవరి పనుల్లో వారు ఉండగా.. శాన్వి నిద్రలేచి వరండాలోకి వచ్చింది. రెసిడెన్సీ ముఖ ద్వారం వైపు వెళ్లి సిమెం టు గ్రిల్స్ పట్టుకుని కొంతదూరం పైకి ఎక్కింది. అక్కడ గ్రిల్స్ సందుల్లో నుంచి కిందికి చూస్తూ అదుపుతప్పి కింద పడిపోయింది. హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. రెండో బర్త్‌డేకు ముందే మృత్యువాత శాన్వి 2019 సెప్టెంబర్ 9న జన్మించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 9న రెండో పుట్టినరోజు జరుపుకోవాల్సి ఉంది. మరో 20 రోజుల్లో పుట్టినరోజు వేడుకలతో వెలిగిపోవాల్సిన ఆ ఇంట ఇప్పుడు చీకట్లు కమ్ముకున్నాయి. -
కంగనా ఇంటి వద్ద కాల్పుల కలకలం
న్యూఢిల్లీ: బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ఇంటి వద్ద తుపాకీ కాల్పుల శబ్దం వినిపించడం కలకలం రేకెత్తించింది. హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలీలో కంగనా తన సొంతింట్లో ఉన్నపుడు శుక్రవారం రాత్రి పదకొండున్నరకు తుపాకీ చప్పుళ్ళు వినిపించడంతో పోలీసులకు సమాచార మిచ్చారు. దీంతో వెంటనే పోలీసులు దర్యాప్తు ప్రారంభించినప్పటికీ కాల్పులకు కారణాలేమిటో తెలియరాలేదు. అయితే ఇటీవల సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య విషయంలో తాను ఇచ్చిన స్టేట్మెంట్తో, తనను భయపెట్టేందుకే ఇలా చేసి ఉంటారని కంగనా అభిప్రాయపడ్డారు. ఇటువంటి బెదిరింపులకు తాను భయపడేది లేదని స్పష్టం చేశారు. కావాలనే కాల్పులు జరిపారనీ, తన గదికి ఎదురుగా ఉన్న సరిహద్దు గోడకి ఆవల ఎవరో ఉన్నట్లు అనిపించిందని ఆమె చెప్పారు. మరోవైపు, సుశాంత్æ ఆత్మహత్యకు ప్రేరేపించారంటూ రియాచక్రవర్తిపై పట్నాలో నమోదైన కేసుని ముంబైకి బదిలీ చేయాలంటూ సుప్రీంకోర్టులో రియాచక్రవర్తి దాఖలుచేసిన పిటిషన్ ఆగస్టు 5న విచారణకు రానుంది. పట్నాలో నమోదైన కేసు విచారణ కోసం బిహార్ పోలీసు బృందం ముంబైకి చేరుకుంది. -
యోగి ఇంటి వద్ద సెల్ఫీ ట్రై చేశారా..?
సాక్షి, లక్నో: మీరు వెళుతున్న మార్గంలో ఓ ప్రత్యేకమైన వ్యక్తి ఇల్లు కనిపిస్తే ఏం చేస్తారు? సాధారణంగా లోపలికి వెళ్లేందుకు అవకాశం ఉంటుందేమో అని ఆశపడతారు.. కుదరకంటే కనీసం ఒక ఫొటో తీసుకుందామనుకుంటారు.. ఈ రోజుల్లో ప్రత్యేకంగా ఇల్లును మాత్రమే కాకుండా తమను కూడా ఆ ఇంటితో కలిపి ఫొటో తీసుకోవాలనుకుంటారు.. సరిగ్గా చెప్పాలంటే సెల్ఫీ అన్నమాట. అయితే, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇంటి ముందు మాత్రం ఇలాంటి వ్యవహారాలు అస్సలు నడవవు. ఒక వేళ కాదు కచ్చితం అని ఫొటో తీసుకున్నారో నేరుగా అక్కడి నుంచి జైలుకే వెళ్లాల్సి ఉంటుంది. అవును.. తరుచు యోగి ఇంటివద్దకు కొందరు యువకులు వస్తున్నారని, సెల్ఫీలకోసం పోలీసులతో గొడవపడుతున్నారని, ఈ తంతు ప్రతిసారి ఇబ్బంది కలిగిస్తున్న నేపథ్యంలో ఇకపై సెల్ఫీలకోసం రావొద్దని వస్తే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని పేర్కొంటూ ప్రత్యేకంగా యోగి ఇంటి ముందు బ్యానర్ కట్టారు. ఈ విషయంపై మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ స్పందిస్తూ 'కొత్త ఏడాదికి ఉత్తరప్రదేశ్ కొత్త ప్రభుత్వం సెల్ఫీలు తీసుకుంటే జైలుకు పంపిస్తామంటూ ప్రజలకు మంచి కానుకను ఇచ్చింది' అంటూ ట్వీట్ చేశారు. -
పెళ్లికెళితే ఇల్లు గుల్ల చేశారు..
అనంతపురం క్రైం : పెళ్లికని వె ళ్తే దొంగలు పడి ఇంటిని గుల్ల చేశారు. అనంతపురం నగరంలోని మొదటి రోడ్డు రాజహంస రాయల్ రెజెన్సీలో బుధవారం అమ్మినేని భక్తవత్సల చౌదరి ప్రమీల దంపతులు నివాసం ఉంటున్న 307 ఫ్లాట్‌లో చోరీకి పాల్పడ్డారు. బాధితుల కథనం మేరకు.. స్థానిక ప్రధాన తపాలా కార్యాయంలో అసిస్టెంట్ పోస్ట్‌మాస్టర్‌గా భక్తవత్సల నాయుడు పని చేస్తున్నారు. బంధువుల వివాహానికి బుధవారం ఉదయం 11 గంటలకు ఇంటికి తాళం వేసి దంపతులిరువురూ మదనపల్లికి వెళ్లారు. గురువారం ఉదయం 5 గంటలకు ఇంటికి చేరుకున్నారు. అప్పటికే మెయిన్ డోరు తాళం చిలుకు హుక్కు పగులకొట్టి ఉండటంతో పాటు తాళం కనిపించలేదు. డోరు కూడా కొద్దిగా తీసి ఉంది. వారు గాభరాగా ఇంట్లోకి వెళ్లి పరిశీలించారు. బెడ్రూం కప్బోర్డు సేప్టీలాక్ తెరిచి ఉంది. అందులో భద్రపర్చిన బంగారు చైన్, కడియం, బ్రాస్లేట్, 3 ఉంగరాలు, లేడీస్ బ్రాస్లేట్ ఒకటి, చెంప చారలు, పాపిడి బిళ్ల, 6 గాజులు, లాంగ్‌చైన్, కెంపుల చైన్, జత కమ్మలతో పాటు అరకేజీ వెండి వస్తువులు మాయమయ్యాయి. సుమారు 30 తులాలున్న బంగారు నగలు, వెండిని దొంగలు దోచుకెళ్లారని బాధితులు లబోదిబోమన్నారు. త్రీటౌన్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. ముందు రోజు మరో ఫ్లాటులో చొరబడిన దొంగలు : ఇదే అపార్టుమెంట్‌లోని ఫ్లాట్ నంబరు 206లో రైల్వే ఉద్యోగి ఉంటున్నాడు. విధుల్లో భాగంగా ఆయన గుంతకల్లుకు వెళ్లాడు. అతని భార్య ఇంటికి తాళం వేసి ఊరెళ్లింది. బుధవారం సాయంత్రం ఈ ప్లాటు వాకిలి తెరిచి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ ఇంట్లో ఎలాంటి వస్తువులు చోరీ కాలేదని పోలీసులు గుర్తించారు. అయితే ఆగంతకులు ఆ ఇంటికి వేసిన బీగం పగులకొట్టి పైఅంతస్తు(నాల్గో ఫ్లోర్)లో ఉన్న భక్తవత్సల చౌదరి ఫ్లాట్(307) సమీపంలో పడేశారు. త్రీటౌన్ పోలీసులు అక్కడికి చేరుకుని ఆ రోజు రాత్రి దాకా అపార్టుమెంట్లోనే గడిపారు. పగలే దొంగలు పడ్డారా? భక్తవత్సలనాయుడు ఇంట్లో పట్టపగలే చోరీ జరిగిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ అపార్టుమెంట్‌పై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తులే చోరీకి పాల్పడి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ అపార్టుమెంటుకు ఒకే గేటు ఉంది. ఎవరు రావాలన్నా, వెళ్లాలన్నార ఈ గేటు గుండానే వెళ్లాల్సి ఉంది. రాత్రికి గేటుకు తాళం వేసి ఉంటుంది. దీంతో రాత్రి పూట చోరీ జరిగేందుకు అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయని, ఎవరైనా అపార్టుమెంట్ లోపలికి ప్రవేశించడం ఎలా సాధ్యపడుతుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అపార్టుమెంటులో ఉన్న వారికి బాగా తెలిసిన వారి హస్తం కూడా ఈ చోరీలో ఉండొచ్చని అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. కొరవడిన పోలీసు నిఘా : ఇటీవల త్రీటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోరీలు అధికమవుతున్నాయి. పోలీసు నిఘా కొరవడిందనే ఆరోపణలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. మొన్న రెవెన్యూ కాలనీ, ఎర్రనేల కొట్టాల ప్రాంతాల్లో ఇళ్ల ముందుంచిన కార్లలో వస్తువులు ఎత్తుకెళ్లారు. నిన్న సాయిబాబా గుడిలో స్వామివారి పాదాలు చోరీ అయ్యాయి. తాజాగా రాజహంస రెజెన్సీలో ఆగంతకులు చోరీలకు పాల్పడ్డారు. వరుస చోరీలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. -
అంబటి కుమార్తె,అల్లుడ్నీ అశీర్వదించిన జగన్