
సాక్షి, లక్నో: మీరు వెళుతున్న మార్గంలో ఓ ప్రత్యేకమైన వ్యక్తి ఇల్లు కనిపిస్తే ఏం చేస్తారు? సాధారణంగా లోపలికి వెళ్లేందుకు అవకాశం ఉంటుందేమో అని ఆశపడతారు.. కుదరకంటే కనీసం ఒక ఫొటో తీసుకుందామనుకుంటారు.. ఈ రోజుల్లో ప్రత్యేకంగా ఇల్లును మాత్రమే కాకుండా తమను కూడా ఆ ఇంటితో కలిపి ఫొటో తీసుకోవాలనుకుంటారు.. సరిగ్గా చెప్పాలంటే సెల్ఫీ అన్నమాట. అయితే, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇంటి ముందు మాత్రం ఇలాంటి వ్యవహారాలు అస్సలు నడవవు. ఒక వేళ కాదు కచ్చితం అని ఫొటో తీసుకున్నారో నేరుగా అక్కడి నుంచి జైలుకే వెళ్లాల్సి ఉంటుంది.
అవును.. తరుచు యోగి ఇంటివద్దకు కొందరు యువకులు వస్తున్నారని, సెల్ఫీలకోసం పోలీసులతో గొడవపడుతున్నారని, ఈ తంతు ప్రతిసారి ఇబ్బంది కలిగిస్తున్న నేపథ్యంలో ఇకపై సెల్ఫీలకోసం రావొద్దని వస్తే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని పేర్కొంటూ ప్రత్యేకంగా యోగి ఇంటి ముందు బ్యానర్ కట్టారు. ఈ విషయంపై మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ స్పందిస్తూ 'కొత్త ఏడాదికి ఉత్తరప్రదేశ్ కొత్త ప్రభుత్వం సెల్ఫీలు తీసుకుంటే జైలుకు పంపిస్తామంటూ ప్రజలకు మంచి కానుకను ఇచ్చింది' అంటూ ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment