మునావర్ ఫరూకీ కామెడీ షోకి గ్రీన్‌సిగ్నల్‌.. రాజాసింగ్‌ వార్నింగ్‌ ఇదే.. | Police permission For Munawar Faruqui Comedy Show | Sakshi
Sakshi News home page

మునావర్ ఫరూకీ కామెడీ షోకి గ్రీన్‌సిగ్నల్‌.. రాజాసింగ్‌ వార్నింగ్‌ ఇదే..

Published Fri, Aug 19 2022 12:15 PM | Last Updated on Fri, Aug 19 2022 1:50 PM

Police permission For Munawar Faruqui Comedy Show - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో మరోసారి పాలిటిక్స్‌ హీటెక్కాయి. మునావర్ ఫరూకీ కామెడీ షో కి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో, రేపు(శనివారం) హైటెక్స్ కామెడీ షోను నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఈ కామెడీ షో వివాదం మరోసారి రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. 

మునావర్‌ కామెడీ షోకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని గోషా మహల్‌ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ తప్పుబట్టారు. మునావర్‌ షో నిర్వహిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించారు. రేపు జరగబోయే షోను అడ్డుకుంటామని అన్నారు. అంతకు ముందు కూడా ఎక్కడ షో నిర్వహిస్తారో ఆ హాల్‌ను దగ్దం చేస్తామని కూడా రాజాసింగ్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. 

ఇది కూడా చదవండి: దూకుడు పెంచిన కాంగ్రెస్‌.. మునుగోడులో రేవంత్‌ ప్లాన్‌ ఫలిస్తుందా..?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement