hitechs
-
మునావర్ ఫరూకీ కామెడీ షోకి గ్రీన్‌సిగ్నల్.. రాజాసింగ్ వార్నింగ్ ఇదే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి పాలిటిక్స్ హీటెక్కాయి. మునావర్ ఫరూకీ కామెడీ షో కి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో, రేపు(శనివారం) హైటెక్స్ కామెడీ షోను నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఈ కామెడీ షో వివాదం మరోసారి రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. మునావర్ కామెడీ షోకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని గోషా మహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తప్పుబట్టారు. మునావర్ షో నిర్వహిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించారు. రేపు జరగబోయే షోను అడ్డుకుంటామని అన్నారు. అంతకు ముందు కూడా ఎక్కడ షో నిర్వహిస్తారో ఆ హాల్‌ను దగ్దం చేస్తామని కూడా రాజాసింగ్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇది కూడా చదవండి: దూకుడు పెంచిన కాంగ్రెస్.. మునుగోడులో రేవంత్ ప్లాన్ ఫలిస్తుందా..? -
హైటెక్స్‌లో ఉద్యాన, వ్యవసాయ ప్రదర్శన
హైదరాబాద్: నోరూరించే మామిడి పండ్ల రకాలు, సేంద్రీయ ఎరువులతో పండించిన కూరగాయలు, మరెన్నో పండ్లు, సాగును సులభతరం చేసి అధిక దిగుబడికి వీలు కల్పించే ఎన్నో యంత్ర పరికరాలు మాదాపూర్ హైటెక్స్‌లో కొలువుదీరాయి. అగ్రి, హార్టి అంతర్జాతీయ ఎగ్జిబిషన్ శుక్రవారం ఇక్కడ ప్రారంభమైంది. వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పార్థసారధి, సీడీ కార్పొరేషన్ ఎండీ మురళి దీన్ని ప్రారంభించారు. ఈ నెల 24వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతుంది. సుమారు 50వరకు స్టాళ్లను ఏర్పాటు చేశారు. సందర్శకులతో హైటెక్స్ ప్రాంగణం సందడిగా మారింది. -
క్యూట్ డాగ్స్