లేక్ వ్యూ అతిధి గృహం వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.
హైదరాబాద్ : లేక్ వ్యూ అతిధి గృహం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ రెండురోజుల పాటు లేక్వ్యూలో బస చేయటంతో సమైక్యవాదుల నిరసనల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. హైదరాబాద్ చేరుకున్న దిగ్విజయ్కు సమైక్యవాదుల నుంచి నిరసనలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. సీఐఎస్ఎఫ్ ఆర్ఏఎఫ్, టాస్క్ఫోర్స్ బలగాలు మోహరించాయి. అనుమతి ఉన్నవారినే పోలీసులు లోనికి అనుమతిస్తున్నారు.
కాగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొద్దిసేపటి క్రితం దిగ్విజయ్ సింగ్తో భేటీ అయ్యారు. ఈరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకూ మంత్రులు, ఎమ్మెల్యేలతో దిగ్విజయ్ భేటీ అవుతారు. సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకూ పీసీసీ కార్యవర్గంతో సమావేశం కానున్నారు. సీమాంద్ర, తెలంగాణ ప్రాంత నేతలు ఇరువురితో ఆయన భేటీ అవుతారు.