
సోనియాకు వ్యతిరేకంగా సీఎం మాట్లాడలేదు
కిరణ్ పార్టీని వదిలిపోరు: దిగ్విజయ్
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి ఎప్పుడూ మాట్లాడలేదని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ చెప్పారు. కిరణ్ పార్టీని వదిలిపోయే అవకాశం లేదన్నారు. దిగ్విజయ్ శనివారమిక్కడ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ‘‘రాష్ట్ర విభజన విషయంలో ఇరు ప్రాంతాల నేతలు తమ అభిప్రాయాలు చెప్పేందుకు పార్టీ పూర్తి స్వేచ్ఛనిచ్చింది. పారదర్శకత కోసం ఈ సున్నితమైన అంశం వరకు వారి అభిప్రాయాల వెల్లడికి అనుమతించాం..’’ అని తెలిపారు. టీ-బిల్లుపై బీజేపీ హామీని నిలబెట్టుకుంటుందని ఆశిస్తున్నామని, ఆ పార్టీతో సంప్రదింపులు జరుగుతున్నాయని దిగ్విజయ్ తెలిపారు.