న్యూఢిల్లీ : నాగపూర్లో దాడి నేపథ్యంలో జేఎన్యూ విద్యార్థి నాయకుడు కన్హయ్య కుమార్, ఉమర్ ఖలీద్లకు ప్రభుత్వం భద్రతను పెంచింది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా మహారాష్ట్రలోని నాగపూర్లో కన్హయ్య కుమార్, ఉమర్ ఖలీద్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్రసంగిస్తున్న వారిపై చెప్పులు, బూట్లతో ప్రజలు దాడిచేశారు. అంతేకాకుండా కన్హయ్య కుమార్కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
అలాగే బజరంగ్ దళ్ కార్యకర్తలు కన్హయ్య కుమార్ కారును నాగపూర్ నగరంలో ప్రవేశించకుండా అడ్డుకున్నారు. దాంతో పలువురు బజరంగ్ దళ్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కన్హయ్య, ఉమర్ ఖలీద్‌లకు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది.