Umar Khalid
-
ఢిల్లీ అల్లర్ల కేసులో నిర్దోషిగా ఉమర్ ఖలిద్!
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో 2020లో జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించిన రాళ్ల దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జేఎన్‌యూ స్టూడెంట్స్ యూనియన్ మాజీ లీడర్ ఉమర్ ఖలిద్‌ను నిర్దోషిగా తేల్చింది ఢిల్లీ కోర్టు. అతడితో పాటు మరో విద్యార్థి నాయకుడు ఖలిద్ సైఫీపై ఉన్న అభియోగాలను కొట్టివేసింది కర్కార్దూమా కోర్టు. అయితే, చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ) కేసులో బెయిల్ రానందున వారు జుడీషియల్ కస్టడీలోనే కొనసాగనున్నారు. ఈశాన్య ఢిల్లీలో 2020లో జరిగిన అల్లర్లపై ఉమర్ ఖలిద్పై ఖాజురి ఖాస్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఛాంద్బాగ్ ప్రాంతంలో అల్లరి మూకలు చేరిన సమయంలో అక్కడే ఉన్న కానిస్టేబుల్ వాంగ్మూలం మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. ఆ సమయంలో తనను తాను రక్షించుకునేందుకు ఓ షెల్టర్‌లో తలదాచుకున్నట్లు తెలిపాడు కానిస్టేబుల్. స్థానికులపై దాడి చేయటం, వాహనాలకు నిప్పుపెట్టడం వంటి హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారని పేర్కొన్నాడు. ఈ క్రమంలో 2020, సెప్టెంబర్‌లో ఉమర్ ఖలిద్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుపై విచారణ జరిపిన అదనపు సెషన్స్ కోర్టు జడ్జీ పులస్త్యా ప్రమాచల్.. ఈ మేరకు నిర్దోషిగా తేలుస్తూ తీర్పు చెప్పారు. అల్లర్లు జరిగినప్పుడు వారు అందులో పాల్గొన్నట్లు సరైన ఆధారాలు లేనందున వారిపై కేసును కొట్టివేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ వివరాలను ఖలిద్ సైఫీ తరఫు న్యాయవాది రెబ్బెకా జాన్ వెల్లడించారు. కోర్టు తీర్పు పూర్తి స్థాయి ఆదేశాలు అందాల్సి ఉందన్నారు. ఇదీ చదవండి: బెంగాల్లో ముందస్తు ఎన్నికలు.. హింట్ ఇచ్చిన బీజేపీ! -
అక్టోబరు 22 వరకు జ్యుడిషియల్ కస్టడీ
న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీ అల్లర్ల కేసులో అరెస్టైన జేఎన్‌యూ విద్యార్థి నాయకుడు ఉమర్ ఖలీద్‌కు వచ్చే నెల 22 వరకు కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద అరెస్టై పోలీసుల అదుపులో ఉన్న ఉమర్.. గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ఎదుట హాజరయ్యాడు. ఈ క్రమంలో అదనపు సెషన్స్ జడ్జి అమితాబ్ రావత్ ఈమేరకు ఆదేశాలు జారీ చేశారు. కాగా పౌరసత్వ సవరణ చట్టం, ఎన్సార్సీలకు వ్యతిరేకంగా ఢిల్లీలో చెలరేగిన అల్లర్ల కేసులో ఉమర్ ఖలీద్ పేరును చార్జిషీట్లో చేర్చిన పోలీసులు, సెప్టెంబరు 13న అతడిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కుట్రపూరితంగా వ్యవహరించి, రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి హింసాత్మక ఘర్షణలకు కారణమయ్యాడని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. (చదవండి: ఢిల్లీ అల్లర్లు: చార్జిషీట్లో సల్మాన్ ఖుర్షీద్ పేరు!) ఈ క్రమంలో ఉగ్రవాద నిరోధక చట్టం, ఉపాతో పాటు రాజద్రోహం, హత్యానేరం, హత్యాయత్నం, రెండు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించడం తదితర తీవ్రమైన నేరాల కింద అతడిపై అభియోగాలు నమోదు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు వచ్చిన నేపథ్యంలో మైనార్టీల పట్ల ప్రభుత్వ తీరుపై నిరసన తెలియజేసి, అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించేందుకు ప్రజలను రెచ్చగొట్టాడని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. రెండు వేర్వేరు ప్రదేశాల్లో విద్వేష ప్రసంగాలు పౌరులు రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేపట్టేలా ప్రేరేపించాడని పేర్కొన్నారు. నిరసనలు హింసాత్మక రూపం దాల్చేలా పెట్రోల్ బాంబులు, ఆసిడ్ బాటిళ్లు, రాళ్లతో దాడి చేసేందుకు కుట్ర పన్నాడని, ఇలాంటి ఎన్నో వస్తువులను సమీప ఇళ్లల్లో నుంచి స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. (టైమ్ మ్యాగజీన్: ప్రధాని మోదీతో పాటు ఈ ‘దాదీ’ కూడా..) ఇక ఈ కేసులో ఉమర్ ఖలీద్‌తో పాటు సహ నిందితుడిగా ఉన్న దానిష్‌కు ప్రజలను పోగు చేయడం, వాళ్లు కొట్టుకునేలా ప్రేరేపించడం వంటి బాధ్యతలు అప్పగించారని పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. ఈ క్రమంలో మహిళలు, చిన్నారులతో రోడ్లను దిగ్భంధనం చేయించి, ఫిబ్రవరి 23న జఫ్రాబాద్ మెట్రో స్టేషన్లో ఉద్రిక్త పరిస్థితులు సృష్టించారని పేర్కొన్నారు. కాగా దేశ వ్యాప్తంగా ప్రకంనపనలు సృష్టించిన ఢిల్లీ అల్లర్లలో 53 మంది ప్రాణాలు కోల్పోగా, దాదాపు 200 మంది గాయపడిన విషయం తెలిసిందే. ఇక ఈ కేసులో పలువురు ప్రముఖ కార్యకర్తలు, రాజకీయ నాయకులతో పాటు సోషల్ ఆక్టివిస్టుల పేర్లను చేరుస్తూ ఢిల్లీ పోలీసులు చార్జిషీట్ నమోదు చేసిన విషయం విదితమే. -
‘ఉమర్ ఖలీద్‌ను ఉరి తీయడం ఖాయం’
సాక్షి,న్యూఢిల్లీ: వివాదాస్పద బీజేపీ నేత కపిల్ మిశ్రా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసులో జేఎన్‌యూ విద్యార్థి నేత, ఉమర్ ఖలీద్‌ను పోలీసులు అరెస్ట్ చేయడంపై ఢిల్లీ పోలీసులను అభినందిస్తూ సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాదు ఉమర్, తాహిర్ హుస్సేన్ వంటి నేరస్థులను ఉరితీయడం ఖాయమని తాను పూర్తిగా నమ్ముతున్నానంటూ వ్యాఖ్యానించారు. ఈ మేరకు కపిల్ మిశ్రా వీడియో మెసేజ్ సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. (ఢిల్లీ అల్లర్లు : అరెస్టుల ప్రక్రియ షూరూ) ఫిబ్రవరి 2020 లో ఢిల్లీలో జరిగిన హింస ముంబై 26/11ఉగ్రవాద దాడికి సమానమని మిశ్రా పేర్కొన్నారు. ఢిల్లీలో ఒక పథకం ప్రకారం జరిగిన పెద్ద కుట్ర అని, హింసాత్మకు అల్లర్లకు, దాడులకు ఉమర్, తాహిర్, తదితరులు ప్రయత్నించారనీ, దుకాణాలను తగుల బెట్టి, ప్రజలను మట్టుపెట్టేందుకు చూశారని ఆరోపించారు. ఇలాంటి ఉగ్రవాదులను జీవిత ఖైదు చేసి, ఉరితీస్తారన్నారు. ఢిల్లీ పౌరులు న్యాయం కోసం ఎదురుచూస్తున్నారని వ్యాఖ్యానించారు. కాగా పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా నిరసనోద్యమం సందర్భంగా చోటుచేసుకున్న అల్లర్ల కేసులో ఉమర్ ఖలీద్‌ను ఉపా చట్టం కింద ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇతనిపై గతంలోనే ఎఫ్ఐఆర్ నమోదైంది. (ఢిల్లీ అల్లర్లు : చార్జిషీట్లో పలువురు ప్రముఖులు) #JUSTIN: BJP leader Kapil Mishra’s reaction on the arrest of former JNU student leader #UmarKhalid. @IndianExpress, @ieDelhi pic.twitter.com/EYomJaER6t — Mahender Singh Manral (@mahendermanral) September 14, 2020 -
ఢిల్లీ అల్లర్లు : అరెస్టుల ప్రక్రియ షూరూ
సాక్షి, న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా పెను ప్రకంపనలు రేపిన ఈశాన్య ఢిల్లీ అలర్ల కేసు విచారణను ఢిల్లీ పోలీసులు మరింత వేగవంతం చేశారు. సీఏఏ-ఎన్ఆర్సీ చట్టాలకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమం హింసాత్మకంగా మారడంతో 53 మంది పౌరులు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే రెచ్చగొట్టే ప్రసంగాలతో, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అల్లర్లకు ప్రేరేపించారని ఆరోపిస్తూ ఢిల్లీ పోలీసులు కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. దీనిలో భాగంగానే ప్రధాన ఆరోపనలు ఎదుర్కొంటున్న జవహర్లాల్ యూనివర్సిటీ (జేఎన్‌యూ) విద్యార్థిసంఘం మాజీ నాయకుడు. యునైటెడ్ ఎగైనెస్ట్ హేట్ కార్యకర్త ఉమర్ ఖలీద్‌ను ఆదివారం అర్థరాత్రి అరెస్ట్ చేశారు. తన కుమారుడిని అక్రమ చట్టం కింద పోలీసులు అరెస్ట్ చేశారని ఖలీద్ తండ్రి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. మరోవైపు ఆయన అరెస్ట్‌ను నిర్ధారిస్తూ ఢిల్లీ పోలీస్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన హింసకు బాధ్యులుగా భావిస్తూ చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. (చార్జిషీట్లో పలువురు ప్రముఖులు) మరోవైపు ఈ అల్లర్లలో పలువురు భాగస్వామ్యూలను చేస్తూ ఢిల్లీ పోలీసులు ఇటీవల ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దానిలో సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో పాటు ప్రఖ్యాత ఆర్థికవేత్త జయతి ఘోష్, ఢిల్లీ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ అపూర్వానంద్, స్వరాజ్ అభియాన్ నాయకుడు యోగేంద్ర యాదవ్, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ రాహుల్ రాయ్ కూడా ఉన్నారు. వీరితోపాటు భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్, యునైటెడ్ ఎగైనెస్ట్ హేట్ కార్యకర్త ఉమర్ ఖలీద్ ముస్లిం సమాజానికి చెందిన మాజీ ఎమ్మెల్యే మతీన్ అహ్మద్, ఎమ్మెల్యే అమన్నతుల్లా ఖాన్ వంటి కొందరు నాయకుల పేర్లను కూడా ప్రస్తావించినట్లు చార్జిషీట్ పేర్కొంది. జేఎన్‌యు విద్యార్థులు దేవంగన కాలిత, నటాషా నార్వాల్, జామియా మిలియా ఇస్లామియాకు చెందిన గుల్ ఫిషా ఫాతిమా వాంగ్మూలం ఆధారంగా వీరిని నిందితులుగా చేర్చినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. (ఢిల్లీ అల్లర్లు: జామియా విద్యార్థినికి బెయిల్) అయితే దేశ వ్యతిరేక కుట్ర పేరుతో ఏచూరిని కూడా ఆజాబితాలో చేర్చడంపై దేశ వ్యాప్తంగా వామపక్ష పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్పందించిన పోలీసులు ఛార్జ్‌షీట్‌లో ఆయన పేరులేదని తెలిపినట్లు సమాచారం. అయితే మిగతా వారిని కూడా విచారణ నిమిత్తం ముందుగానే నోటీసులు జారీచేసి అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. కాగా ఈ ఏడాది ఫిబ్రవరి 23-26 మధ్య ఈశాన్య ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సందర్భంగా జరిగిన హింసలో 53 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ఓవైపు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న తరుణంలో అరెస్ట్‌ల ప్రక్రియను ప్రారంభించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. -
కలకలం: నవీన్ దలాల్‌కు ఎమ్మెల్యే టికెట్
బహదూర్‌ఘర్: గత ఏడాది జేఎన్‌యూ విద్యార్థి నాయకుడు ఉమర్ ఖలీద్‌పై దాడిచేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటోన్న నవీన్ దలాల్ హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన టిక్కెట్టుపై బహదూర్‌ఘర్ స్థానం నుంచి పోటీకి దిగుతున్నారు. తనను తాను గోసంరక్షకుడినని చెప్పుకునే నవీన్ దలాల్.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలే ఆవుపేరుతో రాజకీయాలు నెరపుతున్నారనీ వ్యాఖ్యానించారు. గతేడాది ఆగస్టు 13న ఢిల్లీలో మరొకరితో కలిసి ఉమర్ ఖలీద్‌పై తుపాకీతో కాల్పులు జరిపేందుకు నవీన్ యత్నించి పోలీసులకు పట్టుబడ్డారు. బెయిల్‌పై బయటికి వచ్చిన నవీన్ ఈ ఘటనపై మాట్లాడేందుకు నిరాకరించారు. తానిప్పుడు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నానని వ్యాఖ్యానించారు. ఢిల్లీ కేసుతో పాటు మరో రెండు కేసులు తనపై ఉన్నట్టు ఎన్నికల అఫిడవిట్లో ఆయన పేర్కొనడం గమనార్హం. 29 ఏళ్ల నవీన్ దలాల్ ఆరు నెలల క్రితం శివసేన పార్టీలో చేరారు. మిగతా పార్టీల కంటే శివసేన విధానాలు స్పష్టంగా ఉండటం వల్లే ఈ పార్టీలో చేరినట్టు వెల్లడించారు. గత పదేళ్లుగా గోసంరక్షణ సహా పలు అంశాలపై తాను పోరాటం చేసినట్టు వెల్లడించారు. తన నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన ప్రోత్సాహంతోనే రాజకీయాల్లోకి వచ్చానని, వారంతా తనకు అండగా ఉంటారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. బహదూర్‌ఘర్‌లో సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యే నరేశ్ కౌశిక్, కాంగ్రెస్ అభ్యర్థి రాజిందర్ సింగ్ జూన్, ఐఎన్ఎల్డీ అభ్యర్థి నఫె సింగ్ రాథీ, మరో 20 మంది ఈసారి పోటీ చేస్తున్నారు. శివసేన నుంచి బరిలోకి దిగుతున్న నవీన్ దలాల్ ఏమేరకు పోటీ ఇస్తారో వేచిచూడాలి. -
సోషల్ మీడియా
బుల్లెట్స్ ‘‘జాతిపిత మహాత్మాగాంధీ నుంచి కర్ణాటకకు చెందిన జర్నలిస్టు గౌరీ లంకేష్ వరకూ హంతకుల బుల్లెట్లు క్రూర త్వాన్నే ప్రదర్శించాయి. అయినా వ్యవస్థపై మా ప్రతిఘటన ధైర్యంగా కొనసాగింది. వారి బుల్లెట్లు హతమార్చడాన్ని, విడదీయడాన్నీ లక్ష్యంగా చేసుకున్నాయి. అసమ్మతినీ, వైవిధ్యాన్నీ, ప్రజాస్వామ్యాన్ని నిలుపుకోవడం కోసమే మా ఈ పోరాటం’’ – ఉమర్ ఖలీద్ విద్యార్థి నాయకుడు అనుసరణ ‘‘కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీ ఒకరినొకరు అనుసరిస్తున్నారా? పడిపోయిన కెమెరామన్‌కు రాహుల్ సహాయం చేసిన మరుసటి రోజే, సూరత్‌లో స్పృహ కోల్పోయిన వ్యక్తిని మోదీ కూడా అలాగే ఆదుకోవడం విడ్డూరం’’ – సునేత్ర చౌదరి ఎన్ డీటీవీ పొలిటికల్ ఎడిటర్ ప్రశ్న ‘‘రాహుల్ గాంధీ ప్రకటించిన కనీస వేతన హామీ పథకంపై డబ్బులు ఎలా వస్తాయి, తీరుతెన్ను లేమిటంటూ అనేక మంది ప్రశ్నలు లేవనెత్తడం ఆరోగ్యకరం, ఆనందకరం. అయితే, ప్రధాని నరేంద్ర మోదీ ఇస్తున్న హామీల గురించి కూడా ఇలాగే ప్రశ్నించాలని ఎవరైనా, ఎప్పుడైనా అనుకున్నారా?’’ – అజయ్ కామత్, నేత్ర వైద్యుడు దొంగలు ‘‘ఢిల్లీలోని ఖాన్ మార్కెట్లో చిల్లర దొంగతనాల గురించి చాలాసార్లు విన్నాను. అక్కడి పోలీస్ స్టేషన్ ఎదుట జర్నలిస్ట్ నిధి తండ్రి మొబైల్‌ఫోన్ అపహరణకు గురైనా పట్టించుకునే నాథుడే లేడు. ఓ ఏడాది క్రితం అదే ప్రాంతంలో జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ నాయకురాలు షెహ్లా రషీద్‌కు కూడా ఇదే పరిస్థితి ఎదురయ్యింది. అక్కడ సుమారు పది సీసీటీవీ కెమెరాలు ఉన్నా... ఢిల్లీ పోలీసులు ఈ దుశ్చర్యలను ఎందుకు నిలువరించలేకపోతున్నారు? దొంగలను ఎందుకు పట్టుకోలేకపోతున్నారో నాకు అర్థం కావటం లేదు?’’ – తహ్సీన్ పూణావాలా కాలమిస్ట్ పండుగ ‘‘గాంధీజీపై దాడిని హిందూ మహాసభ సెలబ్రేట్ చేసుకుంది. ఉగ్ర వాద దాడులను ముస్లింలు సెలబ్రేట్ చేసుకోగా నేనెప్పుడూ చూడలేదు. భారతదేశంపట్ల విశ్వసనీయత గురించి ముస్లింలనే ఎందుకు ప్రశ్నిస్తారు? – ప్రశాంత్ కనోజియా, ద వైర్ జర్నలిస్ట్ -
జేఎన్‌యూ విద్యార్థి నేత ఉమర్ ఖలీద్‌పై దాడి
న్యూఢిల్లీ: ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ) విద్యార్థి సంఘం నేత ఉమర్ ఖలీద్‌పై సోమవారం ఢిల్లీలో హత్యాయత్నం జరిగింది. కాన్స్టిట్యూషన్ క్లబ్లో సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఖలీద్‌పై గుర్తుతెలియని దుండగుడు తుపాకీతో కాల్పులు జరిపాడు. తర్వాత అక్కడ్నుంచి పరారయ్యాడు. ఈ దాడిలో ఖలీద్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. యునైటెడ్ అగినెస్ట్ హేట్ సంస్థ సోమవారం మూకహత్యలకు వ్యతిరేకంగా ఖౌఫ్ సే ఆజాదీ(భయం నుంచి విముక్తి)పేరుతో నిర్వహించిన కార్యక్రమానికి సుప్రీంకోర్టు లాయర్ ప్రశాంత్ భూషణ్, ప్రొఫెసర్ అపూర్వానంద్, రోహిత్ వేముల తల్లి రాధిక, ఖలీద్ హాజరయ్యారు. కాల్పుల ఘటనపై ఖలీద్ స్పందిస్తూ.. ‘మధ్యాహ్నం 2.30 గంటలకు బయట టీ తాగి సమావేశం దగ్గరకు తిరిగివస్తున్నాను. ఇంతలో వెనుక నుంచి బలంగా తోసేశారు. నేను కిందపడగానే తుపాకీ తీసి కాల్చేందుకు ప్రయత్నించాడు. దీంతో నేను అక్కడ్నుంచి పరిగెత్తా. చివరికి అతను ఘటనాస్థలం నుంచి పరారయ్యాడు’ అని తెలిపారు. -
ఉమర్ ఖలీద్‌పై కాల్పులు..!
సాక్షి, న్యూఢిల్లీ : జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జెఎన్యూ) విద్యార్థి ఉమర్ ఖలీద్‌పై సోమవారం దేశ రాజధానిలో కాల్పులు జరిగాయి. హై సెక్యూరిటీ ఉండే సెంట్రల్ ఢిల్లీలో సోమవారం పట్టపగలు ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ కాల్పుల నుంచి ఉమర్ ఖలీద్ సురక్షితంగా తప్పించుకున్నారు. సెంట్రల్ ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జరుగుతున్న ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉమర్ ఖలీద్ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన లక్ష్యంగా ఓ గుర్తుతెలియని దుండగుడు కాల్పులు జరిపాడు. కాల్పులతో అప్రమత్తమైన ఖలీద్ త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ‘ఓ కార్యక్రమం కోసం మేం వచ్చాం. మాతోపాటు ఉమర్ ఖలీద్ కూడా ఉన్నారు. మేం టీ స్టాల్ వద్ద ఉన్న సమయంలో తెల్లచొక్కా ధరించిన వ్యక్తి మా వద్దకు వచ్చాడు. మమల్ని తోసేస్తూ ఖలీద్ లక్ష్యంగా ఒక్కసారిగా కాల్పులు జరిపాడు. ఈ గందరగోళంలో అదుపుతప్పి కిందపడిపోయిన ఖలీద్.. బుల్లెట్ల నుంచి తప్పించుకున్నారు. మేం కాల్పులు జరిపిన దుండగుడిని పట్టుకునేందుకు ప్రయత్నించాం. కానీ అతడు గాలిలో కాల్పులు జరుపుతూ పారిపోయాడు. ఈ క్రమంలో అతని చేతిలోంచి పిస్టోల్ జారిపడిపోయింది. అతను పారిపోయాడు’ అని ఓ ప్రత్యక్ష సాక్షి ఏఎన్ఐ వార్తాసంస్థకు తెలిపారు. Delhi: An unidentified man opened fire at JNU student Umar Khalid outside Constitution Club of India. He is unhurt. More details awaited. pic.twitter.com/ubNh4g4D80 — ANI (@ANI) 13 August 2018 -
జేఎన్‌యూ తీరు చట్టవిరుద్ధం : సుప్రీం
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) విద్యార్థి సంఘం నేత కన్నయ కుమార్‌కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. జేఎన్‌యూ అతనిపై విధించిన జరిమానా అక్రమం, అహేతకమైనదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ మేరకు అతనిపై విధించిన జరిమానాను కొట్టివేస్తూ హైకోర్టు శుక్రవారం తీర్పును వెలువరించింది.. దేశ సమగ్రతను దెబ్బతినే విధంగా నినాదాలు చేశారన్న ఆరోపణలతో కన్నయ కుమార్‌పై పది వేలు ఫైన్‌తో పాటు, క్రమశిక్షణ ఉల్లంఘనపై జేఎన్‌యూ 2016లో చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. యూనివర్సిటీ విచారణ కమిటీ తనపై చేసిన ఆరోపణలను సవాలు చేస్తూ కన్నయ్య ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి జస్టిస్ సిద్ధార్ధ ముద్రుల్.. విచారణ సంఘం సమర్పించిన నివేదికను తప్పపడుతూ తీర్పును వెలువరించారు. అతనితో పాటు జేఎన్‌యూ విద్యార్థులు ఉమర్ ఖలీద్, బట్టాచార్యలపై జేఎన్‌యూ చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. -
కన్నయ్య కుమార్ పిటిషన్ విచారణ
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో దేశ వ్యతిరేక నినాదాలు చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు కన్నయ్య కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టనుంది. తమపై ఆరోపణలు చేస్తూ యూనివర్సిటీ ఉన్నత స్థాయి కమిటీ చేసిన సిఫారసులను, తమకు విధించిన జరిమానాను రద్దు చేయాలని కోరుతూ కన్నయ్య కుమార్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సిద్ధార్ధ ముద్రుల్ విచారించనున్నారు. సీపీఐ విద్యార్థి విభాగానికి చెందిన కన్నయ్య కుమార్, యూనివర్సిటీ విద్యార్థులు ఉమర్ ఖలీద్, బట్టాచార్యలు 2016లో దేశ సమగ్రత దెబ్బతినే విధంగా నినాదాలు చేశారన్న ఆరోపణలపై యూనివర్సిటీ క్రమశిక్షణ ఉల్లంఘనపై వారికి జరిమానా విధించిన విషయం తెలిసిందే. దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని ఆరోపణలతో వారిని పోలీసులు అరెస్ట్ చేయగా.. బెయిల్‌పై బయట వచ్చారు. 1860లో రూపొందించిన చట్టాలతో యూనివర్సిటీ విద్యార్థులను వేధింపులకు గురి చేయడం సరికాదని, విద్యార్థి సంఘాల నేతలు కన్నయ్య కుమార్‌కు మద్దతు ప్రకటించారు. -
లౌకిక విలువలకు భంగం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: అభివృద్ధి ముసుగు తగిలించుకున్న ప్రధాని నరేంద్రమోదీ దేశాన్ని మతతత్వం వైపు నడిపిస్తూ లౌకిక విలువలకు భంగం కలిగిస్తున్నారని ఢిల్లీ జేఎన్‌యూ బీఏఎస్‌వో నేత ఉమర్ ఖలీద్ అన్నారు. ప్రగతిశీల యువజన సంఘం(పీవైఎల్) రాష్ట్ర 7వ మహాసభల సందర్భంగా వేలాది మంది యువకుల తో బుధవారం నగరంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కళాశాల నుంచి పెవిలియన్ గ్రౌండ్ వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం పీవైఎల్ రాష్ట్ర అధ్యక్షుడు హన్మేష్ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. మహిళలపై, చిన్నారులపై జరుగుతు న్న దాడులను సమర్థిస్తూ బీజేపీ నేతలు ర్యాలీ లు తీయడం దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు. యూపీలో యోగి ప్రభుత్వ పాలనలో 11ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగిందని, దేశ వ్యాప్తంగా నేరస్తులను శిక్షించాలని ఆందోళన చేసిన తర్వాత అక్కడి ప్రభుత్వం నేరస్తులను అరెస్ట్ చేసినట్లు చేసి వదిలేసిందని అన్నారు. అమిత్‌షాకు వ్యతిరేకంగా తీర్పు చెప్పినందుకే న్యాయమూర్తి లోయాను హత్య చేశారని ఆరోపించారు. బంగారు తెలంగాణ అని జపం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడుతూ నిరంకుశంగా పాలిస్తున్న కేసీఆర్, మోదీ ప్రభుత్వాలను గద్దె దించే వరకు పోరాటాలు సాగుతాయని పేర్కొన్నారు. -
’రాంజాస్’ ఘర్షణలపై కమిటీ ఏర్పాటు
న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన రాంజాస్ కళాశాలలో జరిగిన ఘర్షణలపై విచారణకు కమిటీ ఏర్పాటు అయింది. ఈ కమిటీ విద్యార్థుల పాత్రపై విచారణ చేపట్టనుంది. ఈ సందర్భంగా రాంజాస్ కళాశాల ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులందరూ సంయమనం పాటించాలని సూచించారు. సమస్యలు ఏమైనా ఉంటే శాంతియుతంగా పరిష్కరించుకుందామని ఆయన పిలుపునిచ్చారు. విద్యార్థుల భద్రతకు ఎలాంటి ఇబ్బంది లేదని రాజేంద్రప్రసాద్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన విద్యార్థులకు లేఖ రాశారు. కాగా రాంజాస్ కాలేజీ బుధవారం విద్యార్థుల ఆందోళనలతో అట్టుడిన విషయం తెలిసిందే. విద్యార్థులు పోలీసులతో ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో 20మందికిపైగా విద్యార్థులు గాయపడ్డారు. పలువురు జర్నలిస్టులకు కూడా గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే....దేశద్రోహం కేసు ఎదుర్కొంటున్న జేఎన్‌యూ విద్యార్థి ఉమర్ ఖలిద్‌ను రాజాంస్ కాలేజీలో ఓ సాహిత్య కార్యక్రమంలో ఉపన్యసించేందుకు ఆహ్వానించడంతో వివాదం రాజుకుంది. ఉమర్ ఖలీద్ రాకను వ్యతిరేకిస్తూ మంగళవారం ఏబీవీపీ విద్యార్థులు కాలేజీ ఎదుట ఆందోళన దిగారు. దేశద్రోహులకు ఆహ్వానాలు అందిస్తున్నారని ఆరోపిస్తూ కాలేజీపై దాడి చేశారు. దీంతో ఉమర్ ఖలీద్, షెహ్లా రషీద్ ఆహ్వానాలను కాలేజీ రద్దు చేసుకుంది. అయితే, ఏబీవీపీ ఉద్దేశపూరితంగా ఈ కార్యక్రమాలను రద్దు చేయించిందని, కాలేజీపై దాడి చేసిన ఏబీవీపీపై చర్యలు తీసుకోవాలని రాంజాస్, డీయూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఏఐఎస్ఏ నేతృత్వంలో మౌలిస్‌నగర్ పోలీసు స్టేషన్ వరకు ర్యాలీగా బయలుదేరారు. విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. అప్పటి నుంచి రాంజాస్ కళాశాలలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కళాశాలలో జరిగిన ఘర్షణలపై కమిటీ ఏర్పాటు అయింది. -
ఏబీవీపీకి భయపడను: జవాన్ కూతురు
ఢిల్లీ: బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీకి వ్యతిరేకంగా ఫేస్బుక్లో చేసిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. ఇటీవల రాంజాస్ కాలేజిలో విద్యార్థులపై జరిగిన దాడిని ఖండిస్తూ.. ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజీ విద్యార్థిని గుర్‌మెహార్ కౌర్ ఈ పోస్టు చేసింది. 'నేను ఢిల్లీ యూనివర్సిటి విద్యార్థినిని. ఏబీవీపీకి భయపడను. నేను ఒంటిరిదాన్నికాను. నాకు దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థుల మద్దతు ఉంది' అని రాసిన ప్లకార్డు చేతపట్టుకుని కౌర్ దిగిన ఫోటోను అప్లోడ్ చేసింది. జేఎన్యూకు చెందిన ఉమర్ ఖలీద్ రాంజాస్ కాలేజికి రావడానికి వ్యతిరేకిస్తూ ఏబీవీపీ కార్యకర్తలు చేసిన దాడిలో 20 మంది విద్యార్థులు గాయపడ్డారు. దీనికి నిరసనగా గుర్‌మెహార్ స్పందించింది. కార్గిల్ యుద్దంలో వీరమరణం పొందిన కెప్టెన్ మన్దీప్ సింగ్ కూతురు ఆమె. ఏబీవీపీ దాడి అమాయక విద్యార్థులకు అవాంతరం కలిగించిందని పోస్టులో పేర్కొంది. ఇది నిరసనకారులపై దాడి కాదని, ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని అభిప్రాయపడింది. స్వేచ్చ, ఆదర్శాలు, విలువలు, పౌరుడి హక్కులపై దాడి జరిగినట్లు అభివర్ణించింది. ఈ చర్యతో ప్రతి భారత పౌరుడు బాధపడ్డాడని చెప్పింది. -
హాకీ స్టిక్స్‌తో కొట్టుకున్న విద్యార్థులు
న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ప్రఖ్యాత రాంజాస్ కాలేజ్ బుధవారం రెండు విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణలతో రణరంగంగా మారింది. కాలేజీలో నిర్వహిస్తున్న ‘కల్చర్ ఆఫ్ ప్రొటెస్టెస్’ సెమినార్లో పాల్గొనేందుకు జేఎన్‌యూ విద్యార్థులు ఉమర్ ఖలీద్(దేశద్రోహం కేసును ఎదుర్కొంటున్న విద్యార్థి), షెహ్లా రషీద్‌లను అహ్వానించడానికి సంబంధించి వామపక్ష అనుబంధ విద్యార్థి విభాగం ఐఏఎస్ఏ, ఆరెస్సెస్ మద్ధతున్న ఏబీవీపీ విద్యార్థుల మధ్య ఈ ఘర్షణ చోటు చేసుకుంది. విద్యార్థులు హాకీ స్టిక్స్‌తో కొట్టుకోవడంతో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. అలాగే, కొందరు ఉపాధ్యాయులు, పోలీసులు, జర్నలిస్టులు కూడా గాయాలపాలయ్యారు. అనంతరం కాలేజీలోకి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. -
రాంజాస్ కాలేజీలో రణరంగం!
పోలీసులతో విద్యార్థుల ఘర్షణ ఉమర్ ఖలీద్‌కు ఆహ్వానంపై రగడ న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన రాంజాస్ కాలేజీ బుధవారం విద్యార్థుల ఆందోళనలతో అట్టుడికింది. విద్యార్థులు పోలీసులతో ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో 20మందికిపైగా విద్యార్థులు గాయపడ్డారు. పలువరు జర్నలిస్టులకు కూడా గాయాలయ్యాయి. దేశద్రోహం కేసు ఎదుర్కొంటున్న జేఎన్‌యూ విద్యార్థి ఉమర్ ఖలిద్‌ను రాజాంస్ కాలేజీలో ఓ సాహిత్య కార్యక్రమంలో ఉపన్యసించేందుకు ఆహ్వానించడంతో గొడవ ప్రారంభమైంది. ఉమర్ ఖలీద్ రాకను వ్యతిరేకిస్తూ మంగళవారం ఏబీవీపీ విద్యార్థులు కాలేజీ ఎదుట ఆందోళన దిగారు. దేశద్రోహులకు ఆహ్వానాలు అందిస్తున్నారని ఆరోపిస్తూ కాలేజీపై దాడి చేశారు. దీంతో ఉమర్ ఖలీద్, షెహ్లా రషీద్ ఆహ్వానాలను కాలేజీ రద్దు చేసుకుంది. అయితే, ఏబీవీపీ ఉద్దేశపూరితంగా ఈ కార్యక్రమాలను రద్దు చేయించిందని, కాలేజీపై దాడి చేసిన ఏబీవీపీపై చర్యలు తీసుకోవాలని రాంజాస్, డీయూ విద్యార్థులు బుధవారం ఆందోళనకు దిగారు. ఏఐఎస్ఏ నేతృత్వంలో మౌలిస్‌నగర్ పోలీసు స్టేషన్ వరకు ర్యాలీగా బయలుదేరారు. విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. -
కన్హయ్య కుమార్, ఉమర్ ఖలీద్ కు భద్రత పెంపు
న్యూఢిల్లీ : నాగపూర్‌లో దాడి నేపథ్యంలో జేఎన్‌యూ విద్యార్థి నాయకుడు కన్హయ్య కుమార్, ఉమర్ ఖలీద్లకు ప్రభుత్వం భద్రతను పెంచింది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా మహారాష్ట్రలోని నాగపూర్‌లో కన్హయ్య కుమార్, ఉమర్ ఖలీద్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్రసంగిస్తున్న వారిపై చెప్పులు, బూట్లతో ప్రజలు దాడిచేశారు. అంతేకాకుండా కన్హయ్య కుమార్‌కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అలాగే బజరంగ్ దళ్ కార్యకర్తలు కన్హయ్య కుమార్ కారును నాగపూర్ నగరంలో ప్రవేశించకుండా అడ్డుకున్నారు. దాంతో పలువురు బజరంగ్ దళ్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కన్హయ్య, ఉమర్ ఖలీద్లకు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. -
'అనుక్షణం భయపడుతూనే ఉన్నాం'
న్యూఢిల్లీ: దేశ వ్యతిరేక నినాదాలు చేశారన్న ఆరోపణలపై రాజద్రోహం కేసులో జైలు నుంచి విడుదల అయినప్పటి నుంచి తాము ఎంతో భయభ్రాంతులకు గురవుతున్నట్లు జేఎన్‌యూ విద్యార్థి ఉమర్ ఖలీద్ వెల్లడించాడు. తనతో పాటు ఈ కేసులో అరెస్టయిన తన సహచరులు అనిర్బన్ భట్టాచార్య, కన్హయ్య కుమార్ లకు కూడా ఇదే పరిస్థితిలో ఉన్నారని శనివారం న్యూఢిల్లీలో మీడియాతో చెప్పాడు. హిందుత్వ గ్రూపులు, సంస్థలు తమపై దాడులు చేసేందుకు పథకాలు పన్నాయని, ఏ సమయంలో ఏం జరగుతుందోనని ఇప్పటికీ తాము ఆందోళన చెందుతున్నామని పేర్కొన్నాడు. అప్పటినుంచి స్వేచ్ఛను కోల్పోతున్నట్లు అనిపిస్తుందన్నాడు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆరెస్సెస్) ఈ విషయంలో కొత్త జిత్తులు వేయాలని చూస్తోందని, కానీ తీరు మాత్రం 'కొత్త సీసాలో పాతసారా' అనే విధంగా ఉందని ఎద్దేవా చేశాడు. జాతీయవాదం అంటే దేశంలో ప్రస్తుతం జరగుతున్నది కాదని, గతంలో ఇలాంటి పేర్లతోనే ప్రపంచ దేశాలలో ఎన్నో దుష్ప్రరిణామాలు జరిగాయని అన్నాడు. భారత్, పాకిస్తాన్ ల మధ్య కశ్మీర్ సమస్య ఎప్పటినుంచో ఉందని అయితే ఈ రెండు దేశాలు ఎప్పుడూ శాంతియుతంగా సమస్యను పరిస్కరించుకోవని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఉమర్ ఖలీద్, భట్టాచార్య లకు ఢిల్లీ అదనపు సెషన్స్ న్యాయస్థానం ఆరు నెలల మధ్యంతర బెయిలును మంజూరు చేసిన విషయం తెలిసిందే. -
పోరుకు సిద్ధమంటున్న ఉమర్ సోదరి
న్యూఢిల్లీ: గిలానీ, నక్సల్స్లతో సంబంధాల కేసులో అరెస్టయిన ప్రొఫెసర్ సాయిబాబా విడుదలయ్యేంత వరకు తమ పోరాటం ఆగదని రాజద్రోహంలో కేసులో నిందితుడైన జేఎన్‌యూ విద్యార్థి ఉమర్ ఖలీద్ సోదరి 11 ఏళ్ల సారా ఫాతిమా తెలిపింది. బెయిల్‌పై విడుదలైన తన సోదరుడు ఉమర్, అనిర్బన్లకు శనివారం జేఎన్ యూ వర్సిటీలో మిగతా విద్యార్థులతో కలిసి ఆమె స్వాగతం పలికింది. ఈ సందర్భంగా సారా ఫాతిమా మాట్లాడుతూ తన సోదరుడు విడుదల కావటం శుభపరిణామం అంటూ, అన్యాయంపై పోరాడతాం... ‘లాల్ సలామ్’, ‘ఆజాదీ‘ అంటూ నినాదాలు చేసింది. ఆమె ప్రసంగం వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మరోవైపు రాజద్రోహం కేసులో అరెస్ట్ అయిన మాజీ ప్రొఫెసర్ ఎస్ఏఆర్ గిలానీ కి కూడా ఢిల్లీ కోర్టు ఇవాళ బెయిల్ మంజూరు చేసింది. కాగా దేశ వ్యతిరేక నినాదాలు చేశారన్న ఆరోపణలపై రాజద్రోహం అభియోగాలు ఎదుర్కొంటున్న ఇద్దరు జేఎన్‌యూ విద్యార్థులు ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్యలు శుక్రవారం రాత్రి మధ్యంతర బెయిలుపై విడుదలయిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 9న జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో దేశ వ్యతిరేక నినాదాలు చేశారన్న ఆరోపణలపై అరెస్టయిన ఈ ఇద్దరు విద్యార్థులకు ఢిల్లీ అదనపు సెషన్స్ న్యాయస్థానం ఆరు నెలల మధ్యంతర బెయిలును మంజూరు చేసింది. -
ఉమర్, అనిర్బన్ విడుదల
జేఎన్‌యూ విద్యార్థులకు 6 నెలల బెయిల్ ♦ ఢిల్లీ విడిచి వెళ్లరాదని షరతు న్యూఢిల్లీ: దేశ వ్యతిరేక నినాదాలు చేశారన్న ఆరోపణలపై రాజద్రోహం అభియోగాలు ఎదుర్కొంటున్న ఇద్దరు జేఎన్‌యూ విద్యార్థులు ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్యలు శుక్రవారం రాత్రి మధ్యంతర బెయిలుపై విడుదలయ్యారు. ఫిబ్రవరి 9న జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో దేశ వ్యతిరేక నినాదాలు చేశారన్న ఆరోపణలపై అరెస్టయిన ఈ ఇద్దరు విద్యార్థులకు ఢిల్లీ అదనపు సెషన్స్ న్యాయస్థానం ఆరు నెలల మధ్యంతర బెయిలును మంజూరు చేసింది. రూ. 25 వేల చొప్పున వ్యక్తిగత బాండు, అంతే మొత్తానికి ష్యూరిటీ సమర్పించి బెయిల్ పొందాలని 12 పేజీల ఉత్తర్వుల్లో పేర్కొంది. సెప్టెంబర్ 19 వరకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని తెలిపింది. తమ అనుమతి లేనిదే ఢిల్లీ విడిచి వెళ్లరాదని, కేసు దర్యాప్తు అధికారి పిలిచినప్పుడల్లా హాజరుకావాలని షరతు విధించింది. కోర్టు ఆదేశాల మేరకు ఉమర్, అనిర్బన్లకు జేఎన్‌యూలోని సెంటర్ ఫర్ హిస్టారికల్ స్టడీస్ అధ్యాపకులు సంగీతాదాస్ గుప్తా, రజత్ దత్తాలు ష్యూరిటీలు సమర్పించారు. ‘నిందితులపై మోపిన అభియోగాలు తీవ్రమైనవే. వారు దేశ వ్యతిరేక నినాదాలు చేసినట్లు పోలీసులు సమర్పించిన వీడియో ఫుటేజీ ప్రస్తుతం ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ పరిశీలనలో ఉంది. నిందితులు పారిపోయే అవకాశం ఉందనేందుకు పోలీసులు ఎటువంటి కారణాలు చూపలేదు. ఇదే తరహా అభియోగాలు ఎదుర్కొంటున్న జేఎన్‌యూ విద్యార్థి విభాగం నేత కన్హయ్య కుమార్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ పరిణామాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని నిందితులకు 6 నెలలు బెయిల్ మంజూరు చేయడం సరైనదేనని భావిస్తున్నా’ అని జడ్జి రీతేష్‌సింగ్ పేర్కొన్నారు. అంతకుముందు .. నిందితులకు బెయిల్ మంజూరును పోలీసులు వ్యతిరేకించారు. పోలీసుల వాదనలతో కోర్టు విభేదించింది. అయితే ఒకవేళ ఈ కేసులో వారు దోషులుగా తేలితే గరిష్టంగా జీవితఖైదు సహా 3 రకాల శిక్షలు విధించే అవకాశం ఉందని న్యాయస్థానం తెలిపింది. మరోవైపు ఇద్దరు విద్యార్థులకు బెయిలు రావడంతో జేఎన్‌యూ విద్యార్థులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.‘ఆజాదీ’(స్వాతంత్య్రం) కావాలంటూ నినాదాలు చేశారు. కాగా దేశం గురించి చెడుగా మాట్లాడిన వ్యక్తి బెయిలుపై వచ్చినందుకు ఎలా వేడుకలు చేసుకుంటారని, అతడు ఒలింపిక్ పతకం ఏమైనా తీసుకొచ్చాడా అని కన్హయ్యను ఉద్దేశించి నటుడు అనుపమ్ ఖేర్ అన్నారు. ఆయన చిత్రం ‘బుద్ధ ఇన్ ఎ ట్రాఫిక్ జామ్’ ముందస్తుగా శుక్రవారం వర్సిటీలో ప్రదర్శించగా లెఫ్ట్ విద్యార్థులు నిరసన తెలిపారు. నామమాత్రపు జవాబు.. ఫిబ్రవరి 9నాటి ఘటనపై షోకాజ్ నోటీసులు అందుకున్న విద్యార్థులు వరిసటీ క్రమశిక్షణ కమిటీకి నామమాత్రపు జవాబులు పంపించారు. నేరమేమిటో తెలియకుండా సంజాయిషీ ఏమని ఇస్తామని వారు పేర్నొన్నారు. -
జేఎన్‌యూ విద్యార్థులకు బెయిల్
రాజద్రోహం కేసులో అరెస్టయిన జేఎన్‌యూ విద్యార్థులు ఉమర్ ఖలీద్, అనిర్భన్ భట్టాచార్య లకు ఢిల్లీ హైకోర్టు శుక్రవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆరునెలల మధ్యంత బెయిల్ మంజూరు చేసిన కోర్టు రూ.25,000 వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. జేఎన్‌యూ వివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు విద్యార్థులు ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్య ఫిబ్రవరి 24న పోలీసులకు లొంగిపోయిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ కన్హయ్య కుమార్ తో పాటు జాతి వ్యతిరేక నినాదాలు చేశారని, అఫ్జల్ గురు సంస్మరణ సభ నిర్వహించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కాగా కన్హయ్య కుమార్ బెయిల్ పై బయటికి వచ్చిన రెండు వారాలకు వీరిద్దరికి బెయిల్ మంజూరైంది. మరో వైపు ఇదే కేసులో నిందితులుగా ఉన్న మరో ముగ్గురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేయలేదు. -
రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదైంది. జేఎన్‌యూ వివాదానికి సంబంధించి రాజద్రోహం ఆరోపణలతో సైబారాబాద్ పరిధిలోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో పోలీసులు ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు. రాహుల్ తోపాటు కాంగ్రెస్ పార్టీ నేత ఆనంద్ శర్మ, కేసీ త్యాగి, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, జేఎన్ యూ విద్యార్థి నేతలు కన్హయ్య కుమార్, ఉమర్ ఖలీద్, వామపక్ష నేతలు డీ రాజా, సీతారం ఏచూరిపై కూడా కేసు నమోదు చేశారు. వీరిపై ఐపీసీ సెక్షన్లు 124(ఏ) 156 (3) కింద ఆరోపణలు నమోదు చేశారు. -
కన్హయ్యపై సరూర్‌నగర్‌లో పీఎస్‌లో కేసు నమోదు
దేశ వ్యతిరేక నినాదాలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న జేఎన్‌యూ విద్యార్థులపై నగరంలోని సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రు యూనివర్సిటీ విద్యార్థి కన్హయ్య, ఉమర్‌ఖలీద్ సహా తొమ్మిది మంది విద్యార్థులపై సరూర్‌నగర్ పోలీసులు 124, 124ఏ, 156, 3సీఆర్పీసీ కింద ఆదివారం కేసు నమోదు చేశారు. ఎల్బీనగర్ కోర్టులో జనార్ధన్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటీషన్ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
ఇద్దరు విద్యార్థుల లొంగుబాటు
అర్ధరాత్రి లొంగిపోయిన ‘జేఎన్‌యూ’ ఉమర్, అనిర్బన్ ♦ అంతకుముందు లొంగిపోవటానికి సిద్ధమని హైకోర్టులో పిటిషన్ ♦ భద్రత లేకనే అజ్ఞాతంలోకి.. పోలీసు విచారణకు సిద్ధం: విద్యార్థులు న్యూఢిల్లీ: కన్హయ్యకుమార్‌తో పాటు దేశద్రోహం అభియోగాలు ఎదుర్కొంటున్న విద్యార్థుల్లో ఇద్దరు విద్యార్థులు ఉమర్‌ఖలీద్, అనిర్బన్భట్టాచార్య.. మంగళవారం రోజంతా వేగంగా సాగిన పరిణామాల అనంతరం అర్థరాత్రి సమయంలో పోలీసులకు లొంగిపోయారు. అంతకుముందు తాము పోలీసులకు లొంగిపోతామని, కానీ తమ ప్రాణాలకు ముప్పు ఉందని, లొంగిపోయేటపుడు పోలీసు భద్రత కల్పించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో వారిద్దరూ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించిన కోర్టు.. పిటిషనర్లు తాము లొంగిపోవాలనుకుంటున్న తేదీ, సమయం, ప్రాంతాలను రహస్యంగా కోర్టుకు అందించాలని వారి తరఫు న్యాయవాది కామినిజైశ్వాల్కు సూచించింది. అయితే.. వారు లొంగిపోవటానికి ప్రతిపాదించిన ప్రాంతం పోలీసులకు అందుబాటులో లేదని డీసీపీ (దక్షిణం) ప్రేమ్‌నాథ్ నిరాకరించారు. దీంతో పిటిషనర్ల తరఫు న్యాయవాది, డీసీపీతో న్యాయమూర్తి పది నిమిషాల పాటు తన చాంబర్లో ఆంతరంగికంగా చర్చించారు. అనంతరం ఈ అంశాన్ని బుధవారానికి వాయిదా వేశారు. అయితే.. అనూహ్యంగా మంగళవారం అర్థరాత్రి సమయంలో ఉమర్‌ఖలీద్, అనిర్బన్లు.. రహస్య ప్రాంతంలో పోలీసులకు లొంగిపోయారు. వెంటనే పోలీసులు వారిని గుర్తుతెలియని ప్రాంతానికి తరలించారు. ఇద్దరినీ బుధవారం ఉదయం ఢిల్లీ మెజిస్ట్రేట్ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. పోలీసు విచారణకు సిద్ధం: విద్యార్థులు దేశద్రోహం కేసులో కన్హయ్యకుమార్‌తో పాటు నిందితులుగా పేర్లు నమోదు చేసిన జేఎన్‌యూ విద్యార్థుల్లో ఉమర్‌ఖలీద్, అన్బిరన్ భట్టాచార్య, అశుతోశ్కుమార్, రామనాగ, అనంత్‌ప్రకాశ్ నారాయణ్‌లు.. ఈ నెల 12వ తేదీ రాత్రి కన్హయ్య అరెస్ట్ తరువాత కనిపించకుండా పోవటం తెలిసిందే. వారు ఆదివారం రాత్రి వర్సిటీ క్యాంపస్‌కు తిరిగి రావటం.. సమాచారం అందుకుని వారిని అరెస్ట్ చేయటం కోసం పోలీసులు వర్సిటీ వద్దకు రావటం.. లోనికి ప్రవేశించేందుకు వీసీ అనుమతి కోరుతూ నిరీక్షిస్తుండటం విదితమే. వారిలో ఇద్దరు విద్యార్థులు లొంగిపోవటానికి ముందు జేఎన్ఎస్యూ ప్రధాన కార్యదర్శి రామానాగా వర్సిటీలో మీడియాతో మాట్లాడారు. తాము దాచిపెట్టటానికి ఏమీ లేదని, పోలీసుల విచారణకు సిద్ధమని స్పష్టంచేశారు. తాము కేవలం భద్రతా కారణాల రీత్యానే కనిపించకుండా వెళ్లామని.. కన్హయ్యపై జరిగిన రీతిలోనే తమపైనా దాడి జరుగుతుందని ఆందోళన చెందామని చెప్పారు. వర్సిటీలో సాధారణ పరిస్థితి నెలకొన్న నేపధ్యంలో తిరిగివచ్చామన్నారు. వర్సిటీ యాజమాన్యంపై విశ్వాసం లేదని, వర్సిటీ విచారణ కమిటీ ఎదుట హాజరుకాబోమని చెప్పారు. -
అనుమతిపై తేల్చని జేఎన్‌యూ
విద్యార్థుల అరెస్టుకు పోలీసుల ఎదురుచూపులు వర్సిటీలో ఉమర్ ప్రత్యక్షం న్యూఢిల్లీ: జేఎన్‌యూ క్యాంపస్‌లోకి పోలీసుల్ని అనుతించాలా లేక విద్యార్థుల్ని లొంగిపోమనాలా అనేదానిపై తేల్చకుండానే జేఎన్‌యూ పాలకమండలి భేటీ ముగిసింది. రాజద్రోహం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు విద్యార్థులు ఉమర్ ఖాలిద్, అనిర్బన్ భట్టాచార్య, రామ నాగ, అశుతోష్ కుమార్, అనంత్ ప్రకాష్‌లు ఆదివారం వర్సిటీలో ప్రత్యక్షమయ్యారు. వార్త తెలియగానే పోలీసు బృందం వర్సిటీకి చేరుకుని వీసి అనుమతి కోసం ఆదివారం రాత్రి నుంచి ఎదురుచూసింది. దీంతో వర్సిటీ వద్ద సోమవారం హైడ్రామా నడిచింది. పోలీసుల్ని అనుమతించవద్దంటూ 300 మంది అధ్యాపకుల బృందం వీసీని కోరింది. రాజద్రోహం కేసులు ఉపసంహరించుకునేలా పోలీసుల్ని కోరాలంటూ విద్యార్థులు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పోలీస్ కమిషనర్ బస్సీ...లెఫ్టినెంట్ గవర్నర్ జంగ్‌ను కలిసి వివాదంపై వివరించారు. ► వివాదంపై ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి విచారణ కమిటీకి.. సాక్ష్యాల పరిశీలన కోసం వర్సిటీ మరో 7 రోజుల గడువునిచ్చింది. ► ఫిబ్రవరి 15న పటియాలా కోర్టు దాడి కేసులో ఇతర అంశాల పరిశీలనకు అంగీకరింబోమని సుప్రీంకోర్టు తెలిపింది. దాడిపై సుప్రీంకోర్టుకు పోలీసులు, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ నివేదిక సమర్పించారు. సుప్రీం నియమిత కమిటీ నివేదికకు విరుద్ధంగా ఈ రెండు ఉన్నట్లు సమాచారం. ► తిహార్ జైల్లో ఉన్న జేఎన్‌యూఎస్‌యూ నేత కన్హయ్యను ఆయన కుటుంబ సభ్యులు కలిశారు. కన్హయ్య తన నిర్దోషిత్వ నిరూపణకు సంజాయిషీ ఇవ్వనవసరం లేదని తల్లి ఇచ్చిన సందేశాన్ని సోదరుడు అందించారు. నాకే తెలియనివి తెలిశాయి: ఉమర్ ‘నేనేమిటో నాకే తెలియని విషయాలు గత వారంలో నాకు బాగా తెలిసొచ్చాయి. నా పేరు ఉమర్ ఖాలిదే కానీ, నేను ఉగ్రవాదిని కాను’ అనిస్కాలర్ ఉమర్ ఖాలిద్ చెప్పారు. వర్సిటీలో ప్రశాంత వాతావరణం ఉంటుందన్న హామీమేరకు ఆయన ఆదివారం వర్సిటీకి చేరుకున్నారు. సోమవారం ఉదయం ఖాలిద్ 500 మంది విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ‘నాకు పోస్‌పోర్టు లేకున్నా రెండుసార్లు పాక్‌లో ఉన్నాను’ అని వ్యంగ్యంగా అన్నారు. -
గేటు ముందు పోలీసులు.. గేటు లోపల విద్యార్థులు
న్యూఢిల్లీ: జేఎన్‌యూ వివాదం సందర్భంగా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే దేశ ద్రోహం పేరిట ఏఐఎస్ఎఫ్ విద్యార్థి నాయకుడు కన్హయ్య కుమార్ ను అరెస్టు చేసిన పోలీసులు ఇదే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉమర్ ఖలీద్‌తో సహా ఐదుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. కన్హయ్యతోపాటే వీరిని అరెస్టు చేయాల్సి ఉన్నప్పటికీ వారు ఆ సమయంలో తప్పించుకున్నారు. తాజాగా వారంతా క్యాంపస్‌లోనే ఉన్నట్లు తెలిసింది. అయితే, ఇటీవల తలెత్తిన పరిణామాల కారణంగా యూనివర్సిటీలోకి పోలీసులకు అనుమతి లేదు. దీంతో పోలీసులు ఆ విద్యార్థుల అరెస్టు కోసం గేటు బయటే పడిగాపులు కాస్తుండగా విద్యార్థులు మాత్రం గేటు అవతల క్యాంపస్‌లో ఉన్నారు. దీంతో ఆ ఐదుగురు విద్యార్థుల విషయం ఏం చేద్దామని జేఎన్‌యూ అధికారులు ప్రస్తుతం సమావేశమై చర్చిస్తున్నారు. కాగా, ఈ సమావేశం పూర్తయిన తర్వాత వర్సిటీ వీసీతో మాట్లాడి ఆ విద్యార్థులను తమకు సరెండర్ అవ్వాల్సిందిగా పోలీసులు కోరనున్నట్లు తెలిసింది. ఇక వర్సిటీ రిజిస్ట్రార్ భూపేందర్ జూషి మాట్లాడుతూ ఆ విద్యార్థులు క్యాంపస్ లోనే ఉన్నట్లు తనకు కూడా ఇప్పుడే తెలిసిందని అన్నారు. దానిపై స్పష్టత మాత్రం లేదని, మీడియా ద్వారానే తనకు ఆ సమాచారం తెలిసిందన్నారు. ఆ విద్యార్థులతో మాట్లాడుతారా? పోలీసులతో మాట్లాడతారా? విద్యార్థుల అరెస్టు కోసం పోలీసులను క్యాంపస్ లోకి అనుమతిస్తారా అనే విషయం మాత్రం సమాధానం దాట వేశారు.తమ సమావేశం పూర్తయ్యాక ఎలాంటి పరిణామాలు ఉంటాయో చెప్తానని అన్నారు.