హాకీ స్టిక్స్‌తో కొట్టుకున్న విద్యార్థులు
న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ప్రఖ్యాత రాంజాస్ కాలేజ్ బుధవారం రెండు విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణలతో రణరంగంగా మారింది. కాలేజీలో నిర్వహిస్తున్న ‘కల్చర్ ఆఫ్ ప్రొటెస్టెస్’ సెమినార్‌లో పాల్గొనేందుకు జేఎన్‌యూ విద్యార్థులు ఉమర్ ఖలీద్(దేశద్రోహం కేసును ఎదుర్కొంటున్న విద్యార్థి), షెహ్లా రషీద్‌లను అహ్వానించడానికి సంబంధించి వామపక్ష అనుబంధ విద్యార్థి విభాగం ఐఏఎస్‌ఏ, ఆరెస్సెస్ మద్ధతున్న ఏబీవీపీ విద్యార్థుల మధ్య ఈ ఘర్షణ చోటు చేసుకుంది.
విద్యార్థులు హాకీ స్టిక్స్‌తో కొట్టుకోవడంతో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. అలాగే, కొందరు ఉపాధ్యాయులు, పోలీసులు, జర్నలిస్టులు కూడా గాయాలపాలయ్యారు. అనంతరం కాలేజీలోకి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.