వారంలో 800 ఫోన్ కాల్స్ చేశాడు! | Phone record reveals JNU student Umar Khalid made 800 calls within a week | Sakshi
Sakshi News home page

వారంలో 800 ఫోన్ కాల్స్ చేశాడు!

Published Fri, Feb 19 2016 4:53 PM | Last Updated on Sun, Sep 3 2017 5:58 PM

వారంలో 800 ఫోన్ కాల్స్ చేశాడు!

వారంలో 800 ఫోన్ కాల్స్ చేశాడు!

న్యూఢిల్లీ: రాజద్రోహం కేసు ఎదుర్కొంటున్న జేఎన్ యూ పీహెచ్ డీ విద్యార్థి ఉమర్ ఖలీద్ ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. కన్హయ్య కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేసి వెంటనే జేఎన్ యూ క్యాంపస్ నుంచి ఉమర్ అదృశ్యమయ్యాడు. దీంతో ఒక సెక్షన్ మీడియా అతడిని జైషే-ఇ-మహ్మద్ సానుభూతిపరుడిగా ప్రచారం చేసింది. తీవ్రవాదులతో అతడికి సంబంధాలున్నాయని పేర్కొన్నాయి. 'కశ్మీర్ విశ్వాసఘాతకుడి'గా ఆరోపించారు. అతడు కశ్మీర్ వాసి కాదు. ఉమర్ తల్లిదండ్రులు ఢిల్లీలోని జామియా నగర్ లో నివసిస్తున్నారు. వారి స్వస్థలం మహారాష్ట్రలోని అమరావతి. 35 ఏళ్ల క్రితం ఢిల్లీకి వలసవచ్చారు.


ఫిబ్రవరి 9న జేఎన్ యూలో అఫ్జల్ గురుకు మద్దతుగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కన్హయ్య, ఉమర్ నాయకత్వం వహించారని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. జాతివ్యతిరేక నినాదాలు చేశారని వీరిపై అభియోగాలు మోపారు. కాగా, వారం వ్యవధిలో ఉమర్ 800 ఫోన్ కాల్స్ చేసినట్టు అతడి ఫోన్ కాల్ డేటాలో వెల్లడైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement