సాక్షి, న్యూఢిల్లీ : జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జెఎన్‌యూ) విద్యార్థి ఉమర్ ఖలీద్‌పై సోమవారం దేశ రాజధానిలో కాల్పులు జరిగాయి. హై సెక్యూరిటీ ఉండే సెంట్రల్ ఢిల్లీలో సోమవారం పట్టపగలు ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ కాల్పుల నుంచి ఉమర్ ఖలీద్ సురక్షితంగా తప్పించుకున్నారు. సెంట్రల్ ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జరుగుతున్న ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉమర్ ఖలీద్ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన లక్ష్యంగా ఓ గుర్తుతెలియని దుండగుడు కాల్పులు జరిపాడు. కాల్పులతో అప్రమత్తమైన ఖలీద్ త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
‘ఓ కార్యక్రమం కోసం మేం వచ్చాం. మాతోపాటు ఉమర్ ఖలీద్ కూడా ఉన్నారు. మేం టీ స్టాల్ వద్ద ఉన్న సమయంలో తెల్లచొక్కా ధరించిన వ్యక్తి మా వద్దకు వచ్చాడు. మమల్ని తోసేస్తూ ఖలీద్ లక్ష్యంగా ఒక్కసారిగా కాల్పులు జరిపాడు. ఈ గందరగోళంలో అదుపుతప్పి కిందపడిపోయిన ఖలీద్.. బుల్లెట్ల నుంచి తప్పించుకున్నారు. మేం కాల్పులు జరిపిన దుండగుడిని పట్టుకునేందుకు ప్రయత్నించాం. కానీ అతడు గాలిలో కాల్పులు జరుపుతూ పారిపోయాడు. ఈ క్రమంలో అతని చేతిలోంచి పిస్టోల్ జారిపడిపోయింది. అతను పారిపోయాడు’ అని ఓ ప్రత్యక్ష సాక్షి ఏఎన్‌ఐ వార్తాసంస్థకు తెలిపారు.
Delhi: An unidentified man opened fire at JNU student Umar Khalid outside Constitution Club of India. He is unhurt. More details awaited. pic.twitter.com/ubNh4g4D80
— ANI (@ANI) 13 August 2018
Comments
Please login to add a commentAdd a comment