ఏచూరికి జేఎన్‌యూ విద్యార్థుల ఘన నివాళి
నినాదాలు చేస్తూ భావోద్వేగం
నేటి ఉదయం సీపీఎం కేంద్ర కార్యాలయానికి పార్థివ దేహం
సాక్షి, న్యూఢిల్లీ: ‘జోహార్ కామ్రేడ్ ఏచూరి, వుయ్ సెల్యూట్, ఉద్యమాల రహదారి ఏచూరి, మీ మరణంతో మా గుండెలు ఆగాయి, రెడ్ సెల్యూట్ కామ్రే డ్, కామ్రేడ్ ఏచూరి మమ్మల్ని విడిచి వెళ్లావా, తూ ర్పున ఎర్రని సూర్యుడా.. మా సీతారాం ఏచూరి..’అంటూ విద్యార్థులు చేసిన నినాదాలతో ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) దద్దరిల్లింది. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పారి్థవ దేహాన్ని శుక్రవారం సాయంత్రం విద్యార్థుల సందర్శనార్థం జేఏన్‌యూకి తరలించా రు. ఏచూరి భౌతిక కాయాన్ని చూసిన విద్యార్థులు తీవ్ర భావోద్వేగంతో నినాదాలు చేస్తూ ఘన నివాళులరి్పంచారు. అనంతరం 6 గంటల సమయంలో జోరువానలో జేఎన్‌యూ నుంచి వసంత్‌కుంజ్‌లోని ఆయన నివాసానికి భౌతిక కాయాన్ని తరలించారు. ఇక్కడ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, తదితర ప్రముఖులు నివాళులరి్పంచారు.
భార్య సీమ ఛిస్తీ, కుమార్తె అఖిల, కుమారుడు డాని‹Ùలను ఓదార్చారు. బీజీపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఏపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇన్‌చార్జి (ఎన్‌ఎస్‌యూఐ) కన్హయ్య కుమార్ తదితరులు ఘన నివాళులర్పించారు.
నేటి మధ్యాహ్నం ఎయిమ్స్‌కు పారి్థవ దేహం
శనివారం ఉదయం 8 గంటలకు వసంత్‌కుంజ్‌లోని ఇంటి నుంచి సీపీఎం కేంద్ర కార్యాలయానికి ఏచూరి భౌతిక కాయాన్ని తరలించనున్నారు. 10 గంటల వరకు పార్టీ కార్యకర్తలు, అభిమానుల సందర్శనార్థం, అనంతరం ఓ గంట పాటు విదేశాల నుంచి వచి్చన కమ్యూనిస్టు నేతలు, దేశంలోని ప్రముఖలు నివాళులరి్పంచేందుకు వీలుగా అక్కడ ఉంచనున్నారు. అనంతరం మధ్యాహ్న సమయంలో ఏచూరి భౌతిక కాయాన్ని ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించనున్నారు. ముందే ప్రకటించిన విధంగా విద్యార్థుల వైద్య పరిశోధనల నిమిత్తం అప్పగించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment