Sitaram Yechuri
-
కామ్రేడ్.. రెడ్ సెల్యూట్
సాక్షి, న్యూఢిల్లీ: ‘జోహార్ కామ్రేడ్ ఏచూరి, వుయ్ సెల్యూట్, ఉద్యమాల రహదారి ఏచూరి, మీ మరణంతో మా గుండెలు ఆగాయి, రెడ్ సెల్యూట్ కామ్రే డ్, కామ్రేడ్ ఏచూరి మమ్మల్ని విడిచి వెళ్లావా, తూ ర్పున ఎర్రని సూర్యుడా.. మా సీతారాం ఏచూరి..’అంటూ విద్యార్థులు చేసిన నినాదాలతో ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) దద్దరిల్లింది. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పారి్థవ దేహాన్ని శుక్రవారం సాయంత్రం విద్యార్థుల సందర్శనార్థం జేఏన్యూకి తరలించా రు. ఏచూరి భౌతిక కాయాన్ని చూసిన విద్యార్థులు తీవ్ర భావోద్వేగంతో నినాదాలు చేస్తూ ఘన నివాళులరి్పంచారు. అనంతరం 6 గంటల సమయంలో జోరువానలో జేఎన్‌యూ నుంచి వసంత్‌కుంజ్‌లోని ఆయన నివాసానికి భౌతిక కాయాన్ని తరలించారు. ఇక్కడ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, తదితర ప్రముఖులు నివాళులరి్పంచారు. భార్య సీమ ఛిస్తీ, కుమార్తె అఖిల, కుమారుడు డాని‹Ùలను ఓదార్చారు. బీజీపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఏపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇన్చార్జి (ఎన్ఎస్యూఐ) కన్హయ్య కుమార్ తదితరులు ఘన నివాళులర్పించారు. నేటి మధ్యాహ్నం ఎయిమ్స్‌కు పారి్థవ దేహం శనివారం ఉదయం 8 గంటలకు వసంత్‌కుంజ్‌లోని ఇంటి నుంచి సీపీఎం కేంద్ర కార్యాలయానికి ఏచూరి భౌతిక కాయాన్ని తరలించనున్నారు. 10 గంటల వరకు పార్టీ కార్యకర్తలు, అభిమానుల సందర్శనార్థం, అనంతరం ఓ గంట పాటు విదేశాల నుంచి వచి్చన కమ్యూనిస్టు నేతలు, దేశంలోని ప్రముఖలు నివాళులరి్పంచేందుకు వీలుగా అక్కడ ఉంచనున్నారు. అనంతరం మధ్యాహ్న సమయంలో ఏచూరి భౌతిక కాయాన్ని ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించనున్నారు. ముందే ప్రకటించిన విధంగా విద్యార్థుల వైద్య పరిశోధనల నిమిత్తం అప్పగించనున్నారు. -
సీతారాం ఏచూరి నివాసానికి పార్థివ దేహం
-
సీతారాం ఏచూరి కన్నుమూత
న్యూఢిల్లీ: ప్రముఖ రాజకీయ వేత్త సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూశారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. కాగా 72 ఏళ్ల ఏచూరి.. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్తో ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన సంగతి తెలిసిందే. కొద్ది వారాలుగా ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్య పరిస్థితి పలుమార్లు విషమించింది. నేడు ఏచూరి ఆరోగ్యం మరింత క్షీణించి ప్రాణాలు విడిచారు. 1952 ఆగష్టు 12న చెన్నైలో తెలుగు కుటుంబంలో జన్మించిన ఏచూరి.. బాల్యం మొత్తం హైదరాబాద్‌లో గడిపారు. హైదరాబాద్‌లోని ఆల్ సెయింట్స్ హైస్కూల్లో ప్రాథమిక విద్యను అభ్యసించారు. తండ్రి సర్వేశ్వర సోమయాజి ఏపీఎస్ ఆర్టీసీలో ఇంజినీర్ ఉద్యోగం, తల్లి కల్పకం ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేశారు. 1969 నాటి తెలంగాణ ఉద్యమంతో ఢిల్లీకి చేరిన ఏచూరి.. ఢిల్లీలోని ప్రెసిడెంట్స్ ఎస్టేట్ స్కూల్లో 12వ తరగతి పూర్తి చేశారు.ప్రఖ్యాత సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో ఆర్థికశాస్త్రంలో బీఏ ఆనర్స్ చేశారు. జవహార్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఎమ్ఏ ఎకనామిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించారు. 1974లో స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో(ఎస్ఎఫ్ఐ) చేరారు. 1975 ఎమర్జెన్సీ సమయంలో అరెస్ట్ కావడంతో చదవుకు ఫుల్‌స్టాఫ్ పెట్టారు.1975లో సీపీఎం ప్రాథమిక సభ్యత్వం తీసుకున్న ఏచూరిఎమర్జెన్సీ సమయంలో అండర్ గ్రౌండ్‌కు వెళ్లిన సీతారాంఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత మూడుసార్లు జేఎన్య నాయకుడిగా ఎన్నిక1992లో సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడిగా నమోదుఉమ్మడి ఏపీ సీఎస్ మోహన్ కందాకు ఏచూరి మేనల్లుడు1984లో సీపీఎం కేంద్ర కమిటీలోకి వెళ్లిన ఏచూరి1985లో పార్టీ రాజ్యాంగ సవరణలో కీలక పాత్రంఇంద్రాణి మజుందార్‌తో ఏచూరికి వివాహంకూతురు అఖిలా ఏచూరి, కొడుకు ఆశిష్ ఏచూరిజర్నలిస్టు సీమా చిశ్తీని రెండో వివాహం చేసుకున్న ఏచూరి1992లో జరిగిన 14వ కాంగ్రెస్‌లో పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ప్రమోషన్1996 యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో కీలకపాత్ర2005 నుంచి 2017 వరకు పశ్చిమ బెంగాల్ నుంచి రాజ్యసభ ఎంపీగా ప్రాతినిథ్యంరచయితగా హిందూస్థాన్ టైమ్స్‌లో లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ కాలమ్20 ఏళ్లుగా పార్టీ పత్రిక పీపుల్స్ డెమోక్రసీ ఎడిటోరియల్ బోర్డు మెంబర్2004లో యూపీఏ సంకీర్ణ ప్రభుత్వ నిర్మాణంలోనూ ముఖ్య పాత్ర2005 నుంచి 2015 వరకు వరుసగా మూడుసార్లు ప్రధాన కార్యదర్శి2015, 2018, 2022లో సీపీఎం జనరల్ సెక్రటరీగా ఎన్నిక‘క్యాస్ట్ అండ్ క్లాస్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ టుడే’, ‘సోషలిజం ఇన్ ఛేంజింగ్ వరల్డ్’, ‘మోదీ గవర్నమెంట్: న్యూ సర్జ్ ఆఫ్ కమ్యూనలిజం’, ‘కమ్యూనలిజం వర్సెస్ సెక్యులరిజం’ వంటి పుస్తకాలు రాశారు.అనారోగ్యంతో ఆగష్టు 19న ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన ఏచూరిచికిత్స పొందుతూ సెప్టెంబర్ 12న కన్నుమూతజీవితంతం లెఫ్ట్ బావజాలంతో గడిపిన ఏచూరి -
మీ పేరులోనే ‘సీతారాం’ ఉందని పిలుస్తారేమో కామ్రేడ్!
మీ పేరులోనే ‘సీతారాం’ ఉందని పిలుస్తారేమో కామ్రేడ్! -
2017 పరువు నష్టం కేసులో బాంబే హైకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ
ముంబై: ప్రముఖ సామాజికవేత్త, సీనియర్ పాత్రికేయురాలు గౌరీ లంకేశ్ హత్యకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సంస్థకు(ఆర్ఎస్ఎస్కు) సంబంధం ఉందంటూ చేసిన వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బాంబే హైకోర్టు తలుపు తట్టారు. గౌరీ లంకేశ్ హత్య నేపథ్యంలో 2017లో తనపై దాఖలైన పరువు నష్టం కేసును కొట్టివేయాలని కోరుతూ పిటిషన్ వేశారు. ఈ మేరకు 2019లో బోరివరి మేజిస్ట్రేట్ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. సీపీఐ కార్యదర్శి సీతారాం ఏచూరితోపాటు తనను తప్పుగా ఈ కేసులో నిందితుడిగా చేర్చారని తన పిటిషన్లో పేర్కొన్నారు. కాగా గౌరీ లంకేష్ హత్య తర్వాత సీతారాం ఏచూరి వేరే చోట, వేరే సమయంలో ప్రకటన చేశారనే విషయాన్ని ప్రస్తావించారు. కాగా, గౌరీ లంకేష్ 2017 సెప్టెంబర్ 5న బెంగళూరులోని తన ఇంటి ముందే దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. మతపరమైన విమర్శలు చేస్తున్నారనే భావనతో గౌరీ లంకేష్‌ను హిందూ అతివాద భావజాలం ఉన్న కొందరు కాల్చి చంపారు. ఈ హత్యలు జరిగిన 24 గంటల్లోనే రాహుల్ పార్లమెంట్ వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ, సిద్ధాంతాలకు వ్యతిరేకంగా, ఆర్ఎస్ఎస్ భావజాలానికి వ్యతిరేకంగా మాట్లాడే వారెవరిపై ఒత్తిడి చేస్తారని, దాడులు జరిపి చంపేస్తారని ఆరోపించారు. మరోవైపు ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వ్యక్తులే జర్నలిస్టును హత్య చేశారని ఏచూరి ఆరోపించారు. గౌరీ లంకేష్ హత్యను బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాలంతో ముడిపెట్టారని ఆరోపిస్తూ ఆర్ఎస్ఎస్ కార్యకర్త, న్యాయవాది ధృతిమాన్ జోషి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, సీతారాం ఏచూరిపై ఐపీసీ సెక్షన్ 499, 500 ప్రకారం ఫిర్యాదు చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి ప్రకటనలు చేయడం ద్వారా ప్రజల దృష్టిలో ఆర్ఎస్ఎస్ పరువును తగ్గించడమే అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా 2019 ఫిబ్రవరి 18న మజ్గావ్ జిల్లా కోర్టు గాంధీతోపాటు ఏచూరికి సమన్లు జారీ చేసింది. వీరిద్దరూ 2019 జూలై 4న కోర్టుకు హాజరై బెయిల్ కోసం ప్రయత్నించారు. మరుసటి రోజే సీతారాం ఏచూరి వేర్వేరు ప్రదేశాలు, సమయాల్లో చేసిన వ్యాఖ్యలని చెబుతూ, దీనిపైఉమ్మడి విచారణ జరగడం సరికాదని అన్నారు. తనపై నమోదైన ఫిర్యాదును కొట్టివేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే నవంబర్ 23, 2019న మేజిస్ట్రేట్ రాహుల్, ఏచూరీ పిటిషన్లను తోసిపుచ్చింది. వ్యక్తులు వేరైనా చేసిన ప్రకటనలు ఒకటేనని, నిందితుల ఉద్ధేశం ఆర్ఎస్ఎస్ను కించపరడమేనని కోర్టు పేర్కొంది. ఈ తీర్పును సవాల్ చేస్తూనే నేడు కాంగ్రెస్ నేత బాంబే హైకోర్టును ఆశ్రయించారు. -
ఏచూరి సీతారాం ఇంట్లో విషాదం
-
భయాందోళనలు సృష్టించేందుకే ఎన్నార్సీ
కోల్‌కతా: దేశ లౌకిక విలువల్ని ధ్వంసం చేసి, ప్రజల్లో భయాందోళనలను సృష్టించేందుకే కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం ఎన్నార్సీ, పౌరసత్వ చట్టాన్ని అమలు చేస్తోందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. భారత జాతీయతా భావం స్థానంలో హిందూ జాతీయతా భావాన్ని చొప్పించేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. సీపీఐ 100వ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘విద్వేషాలను రెచ్చగొట్టేందుకు మత శక్తులు పనిచేస్తున్నాయి. ఇందులో భాగంగానే బీజేపీ ప్రభుత్వం జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్నార్సీ), పౌరసత్వ (సవరణ)బిల్లును తీసుకువచ్చింది. కొన్ని వర్గాల ప్రజలను లక్ష్యంగా చేసుకుని విభజనలు సృష్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది’అని ఆరోపించారు. భారత్‌ను హిందూ దేశంగా మార్చేందుకు చేస్తున్న ఈ కుట్ర రాజ్యాంగ విలువలకు పూర్తిగా విరుద్ధమని పేర్కొన్నారు. కాగా, ఒకప్పటి యూఎస్ఎస్ఆర్లో భాగంగా ఉన్న ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్లో 1920 అక్టోబర్ 17వ తేదీన భారతీయ నాయకుల నేతృత్వంలో ఇండియన్ కమ్యూనిస్టు పార్టీ(ఐసీపీ)అవతరించింది. -
బలహీనతలు అధిగమించండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పార్టీ సంస్థాగతంగా ఎదుర్కొంటున్న బలహీనతలు, లోటుపాట్లను అధిగమించేందుకు వెంటనే అవసరమైన కార్యాచరణను చేపట్టాలని రాష్ట్ర నాయకత్వాన్ని సీపీఎం జాతీయ నాయకత్వం ఆదేశించింది. కిందిస్థాయి నుంచి పార్టీ బలపడేందుకు, సొంత బలం పెంచుకునేందుకు రాబోయే మూడునెలల పాటు వివిధ రూపాల్లో కార్యక్రమాలను నిర్వహించాలని సూచించింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పేదలు, వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేసి, వాటిపై ఆందోళనలు, ఉద్యమాలు రూపొందించుకోవాలని దిశానిర్దేశం చేసింది. పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టి, సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు, వివిధ స్థాయిల్లోని నాయకులు, కార్యకర్తలకు మారిన పరిస్థితుల్లో సైద్ధాంతిక అంశాలు, పార్టీ భావజలాన్ని అర్థమయ్యేలా వివరించాలని సూచించింది. శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన రాష్ట్ర పార్టీ ప్లీనం సమావేశానికి పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్‌బ్యూరో సభ్యుడు ప్రకాశ్ కారత్ హాజరై రాష్ట్ర పార్టీ ముఖ్యనేతలకు పలు సూచనలు చేసినట్టు సమాచారం. యువతకు దగ్గర కావ డంతోపాటు పార్టీ భావజాల వ్యాప్తికి సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకోవడంలో వైఫల్యాలను అధిగమించాలని సూచించింది. ఎలాంటి కార్యాచరణను చేపట్టాలనే దానిపై పూర్తిస్థాయిలో అధ్య యనం నిర్వహించాలని ఆదేశించింది. రాష్ట్ర అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఏమాత్రం ప్రభావం చూపకపోవడం, సంప్రదాయ ఓటర్లుగా, మద్దతునిస్తూ పార్టీకి సహకరిస్తున్న వివిధ వర్గాలు దూరం కావడం, బడుగు వర్గాలుసైతం పార్టీపై అనాసక్తి కనబర్చడంపై లోతైన ఆత్మపరిశీలన చేసుకుని ఆ మేరకు రాజకీయ వ్యూహాలు మార్చుకోవాలని రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించినట్టు తెలుస్తోంది. ఎన్నికల ఫలితా ల సమీక్షకు సంబంధించిన నివేదికలను రాష్ట్రనాయకులకు అందజేసినట్టు సమాచారం. ఏళ్లుగా పార్టీకి సంప్రదాయ ఓటుబ్యాంక్, మద్దతుదారులుగా ఉన్న రైతులు, వ్యవసాయ కార్మికులు, కార్మికవర్గం ఇతర వర్గాలు ఎందుకు దూరమవుతున్నారనే అంశంపై లోతైన విశ్లేషణ చేయాలని సూచించింది. -
‘కేరళలో రాహుల్ పోటీపై వివరణ ఇవ్వాలి’
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ అమేధితో పాటు కేరళలోని వయనాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేస్తారని ప్రకటించడంపై సీపీఎం స్పందించింది. వయనాద్‌లో ఎల్డీఎఫ్కు వ్యతిరేకంగా రాహుల్ పోటీ చేయాలని తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఎల్డీఎఫ్ అభ్యర్థిపై రాహుల్ పోటీచేయాలన్న నిర్ణయంతో ఎలాంటి సంకేతాలు పంపదలుచుకున్నారో చెప్పాలని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కోరారు. కేరళకు వచ్చి ఎల్డీఎఫ్పై పోటీకి దిగుతూ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారని నిలదీశారు. ఏ స్ధానం నుంచి ఏ అభ్యర్ధి పోటీ చేయాలనేది ఆయా పార్టీలు నిర్ణయించుకుంటాయని, అయితే రాహుల్ నిర్ణయంతో ఏం సంకేతాలు పంపాలనుకుంటున్నారో ప్రజలకు వెల్లడించాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ సారధ్యంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదింపాలనే లక్ష్యంతో తమ పార్టీ పనిచేస్తోందని, కీలకమైన ఈ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ అభ్యర్ధితో తలపడాలన్న రాహుల్ నిర్ణయాన్ని ఆయన తప్పుపట్టారు. -
కమ్యూనిస్ట్ (కలం) యోధుడు
సాక్షి వెబ్ ప్రత్యేకం : సీతారాం ఏచూరి... కమ్యూనిస్టు యోధుడు, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) జాతీయ ప్రధాన కార్యదర్శి. పేరుకు సీతారాముడైనా మతతత్వంపై పరశురాముడిలా విరుచుకుపడుతుంటారు. బెంగాలీ, మలయాళం, తమిళం, పంజాబీ, ఉర్దూ, హిందీ, ఆంగ్లాలను అనర్గళంగా మాట్లాడే పదహారణాల తెలుగువాడు. పార్లమెంటు దృష్టికి ఎన్నో ముఖ్యమైన సమస్యలను తీసుకురావటంతోపాటు వాటిపై ప్రశ్నలు సంధించిన సభ్యునిగా రాజ్యసభలో గుర్తింపు పొందారు. కమ్యూనిస్టు అయినప్పటికీ తన ప్రసంగాల్లో భగవద్గీత, ఉపనిషత్తులు ప్రస్తావిస్తూ ఉంటారు. విద్యార్థి నాయకుడి నుంచి అంచెలంచెలుగా ఎదిగి సీపీఎం ప్రధాన కార్యదర్శి స్థాయికి చేరుకున్న నాయకుడు సీతారం ఏచూరి. ప్రస్తుతం సీపీఎం పార్టీ దేశంలో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుండటం, త్రిపురలోనూ అధికారాన్ని కోల్పోయిన నేపథ్యంలో ఏచూరికి ఈ పదవీ బాధ్యతలు పెద్ద సవాల్‌గానే ఉన్నాయి. అంతేకాకుండా.. కరత్, ఏచూరి మధ్య ఏర్పడిన భేదాభ్రిపాయాలు ఇటీవల తీవ్ర స్థాయికి చేరుకున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. ఇలాంటి సమయాల్లో విద్యావంతుడైన ఏచూరి పార్టీని ఏ విధంగా బలోపేతం చేస్తారో వేచిచూడాల్సిందే.. డాక్టరేట్ పూర్తి చేయలేక 1952 లో మద్రాసులో స్థిరపడిన తెలుగు కుటుంబంలో జన్మించారు. తండ్రి సర్వేశ్వర సోమయాజి, తల్లి ఏచూరి కల్పకం. సోమయాజీ ఆర్టీసీలో డివిజినల్ మేనేజర్‌గా పని చేసేవారు. సీతారం ఏచూరి విద్యాభ్యాసమంతా ఢిల్లీలోనే సాగింది. ఢిల్లీ ఎస్టేట్ స్కూల్లో పాఠశాల విద్యను అభ్యసించారు. సీబీఎస్ఈ పరీక్షలో జాతీయస్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు. సెయింట్ స్టీఫెన్ కళాశాలలో బీఏ (ఆనర్స్) ఆర్థికశాస్త్రం, జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఎంఏ ఆర్థికశాస్త్రంలో పట్టా పొందారు. డిగ్రీ, పీజీ రెండింటిలోనూ ప్రథమ శ్రేణిలోనే ఉత్తీర్ణులయ్యారు. 1975 లో దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన సమయంలో అరెస్టయ్యారు. ఫలితంగా జేఎన్‌యూలో పీహెచ్‌డీలో చేరినా, డాక్టరేటు పూర్తి చేయలేకపోయారు. సీమా చిస్తీని అనే మహిళను రెండో వివాహం చేసుకున్నారు. గతంలో ఆమె బీబీసీ హిందీకి ఢిల్లీ ఎడిటర్‌గా పనిచేశారు. వీరికి ముగ్గురు సంతానం. విద్యార్థి లీడర్ నుంచి సీపీఎం ప్రధాన కార్యదర్శిగా 1974 లో స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) లో సభ్యుడిగా ఏచూరి రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. ఆ మరుసటి ఏడాదే భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) సభ్యునిగా చేరారు. అత్యవసర పరిస్థితికి కొంతకాలం ముందు ఆయన ఆజ్ఞాతంలోకి వెళ్లారు. దేశంలో అత్యవసర పరిస్థితి ఎత్తివేసిన తర్వాత జేఎన్‌యూ విద్యార్థి నాయకునిగా సీతారాం ఏచూరి మూడుసార్లు ఎన్నికయ్యారు. 1978 లో అఖిల భారత ఎస్ఎఫ్ఐ సంయుక్త కార్యదర్శిగా, ఆ తర్వాత అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి, సీపీఎం ప్రధాన కార్యదర్శి అయ్యారు. 1985 లో భారత కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీలో, 1988 లో కేంద్ర కార్యవర్గంలో, 1999 లో పొలిట్ బ్యూరోలో ఏచూరికి చోటు దక్కింది. 2005 లో బెంగాల్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2015 లో విశాఖపట్నంలో జరిగిన 21 వ మహాసభలో మొదటిసారిగా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైయ్యారు. 2018లో హైదరాబాద్‌లో జరిగిన 22 వ మహాసభలో రెండో సారి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. రాజ్యసభ చరిత్రలోనే.. పార్లమెంటు దృష్టికి ఎన్నో ముఖ్యమైన సమస్యలను తీసుకురావటంతోపాటు వాటిపై ప్రశ్నలు సంధించిన సభ్యునిగా రాజ్యసభలో ఏచూరి గుర్తింపు పొందారు. సమస్యలను సభ దృష్టికి తేవడానికి పార్లమెంటును అడ్డుకోవడాన్ని ఏచూరి సమర్థిస్తారు. ప్రజాస్వామ్యబద్ధ పాలనలో చట్టబద్ధమైన అంశమని పేర్కొంటారు. 2015 మార్చి 3 న బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేసిన ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానానికి రాజ్యసభలో ఏచూరి సవరణలు ప్రతిపాదించారు. దీనిపై జరిగిన ఓటింగ్‌లో ఆయన సవరణ ప్రతిపాదన నెగ్గింది. రాజ్యసభ చరిత్రలోనే ఇలా జరగటం నాలుగోసారి. ఇష్టాయిష్టాలు ఎక్కువగా పుస్తకాలు చదువుతుంటారు. భగవద్గీతను, మహాభారతం లాంటి ఇతిహాసాలను చదివారు. టెన్నిస్ ఆట అంటే ఇష్టం. విద్యార్థి దశలో టెన్నిస్ ఆడేవారు.1968లో నిజాం కాలేజీ ఛాంపియన్‌ను కూడా. ప్రముఖ ఆంగ్ల దినపత్రిక హిందూస్థాన్ టైమ్స్‌లో కాలమ్స్ రాస్తుంటారు. - ఆంజనేయులు శెట్టె -
ఏచూరీని కలిసిన వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై అధికార టీడీపీ వర్గాలు స్పందించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. డీజీపీ ఆర్పీ ఠాకూర్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన సిట్ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందనే నమ్మకం లేకపోవడంతో థర్డ్ పార్టీ విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్‌పై జరిగిన దాడి, అనంతరం చోటుచేసుకున్న పరిణామాలు కేంద్రంలోని పెద్దలకు వివరించేందుకు పార్టీ నేతలు ఢిల్లీ వెళ్లారు. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసిన వైఎస్సార్సీపీ నాయకులు.. బుధవారం సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరినీ కలిసి వైఎస్ జగన్‌పై హత్యాయత్నం ఘటన వివరాలను ఆయనకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును, కేసును పక్కదారి పట్టిస్తున్న వైనాన్ని ఏచూరికి తెలిపారు. కాగా, ఈ కేసు కేంద్రం పరిధిలో ఉందని చంద్రబాబు చెప్పడంతో.. కేంద్రం ఏం చేయగలదో అది చేస్తామని రాజ్‌నాథ్ హామీ ఇచ్చారనీ, తమ విజ్ఞప్తికి రాజ్‌నాథ్ సానుకూలంగా స్పందించారని పార్టీ నేతలు వెల్లడించారు. ఏచూరీని కలిసిన వైఎస్సార్సీపీ బృందంలో బొత్స సత్యనారాయణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వరప్రసాద్, సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. -
‘ఆయన దోపిడీ ప్రభుత్వానికి నాయకుడు’
సాక్షి, న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ ప్రభుత్వంపై భారత కమ్యూనిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరి, సెంట్రల్ పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకారత్ విరుచుకు పడ్డారు. నూతన అభివృద్ధి భారతాన్ని చూపుతామన్న మోదీ.. ఈ నాలుగేళ్లలో అసత్యాలు, దోపిడీల ప్రభుత్వాన్ని చూపిస్తున్నారని విమర్శల వర్షం గుప్పించారు. సీపీఐ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. మంచి రోజులు తెస్తామన్న మోదీ పాలనలో ప్రజల జీవితాలు దుర్భరంగా మారాయని ఏచూరి ఆరోపించారు. వ్యవసాయంలో సంక్షోభం నెలకొనడంతో రైతు ఆత్మహత్యలు పెరిగాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోదీ యువతను మోసం చేశారని ధ్వజమెత్తారు. కేవలం 2.05 లక్షల ఉద్యోగాలిచ్చి చేతులు దులుపుకున్నారని ఆయన మండిపడ్డారు. నోట్లరద్దు, జీఎస్టీతో అసంఘటిత రంగం కుదేలయిందని, ఈ సంస్కరణల వల్ల జీడీపీలో సగ భాగమైన చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మూతపడ్డాయని అన్నారు. నిత్యావసర వస్తువులు, ముఖ్యంగా పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగాయనీ.. ప్రపంచంలో పెట్రోల్‌కు ఎక్కడా లేనంత అధిక ధర భారత దేశంలో ఉందన్నారు. మోదీ పాలనపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని.. అందుకే ఉప ఎన్నికల్లో బీజేపీకి ఓట్ల శాతం తగ్గిందని అభిప్రాయపడ్డారు. దాడులు పెరిగాయి.. దళితులు, ఆదివాసీల అభివృద్ధికి పాటుపడతామని గొప్పలు చెప్పిన దేశ ప్రధాని చేసింది శూన్యమని బృందా కారత్ అన్నారు. ఎన్డీయే నాలుగేళ్ల పాలనలో వారిపై దాడులు పెరిగాయని ఆమె తెలిపారు. రిజర్వేషన్లను నీరుగార్చడంతో ఉన్నత విద్యాసంస్థల్లో దళిత, ఆదివాసీలు ఉద్యోగాలు పొందలేకపోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతాలలో వనరుల దోపిడీకి కార్పొరేట్లకు అన్ని అనుమతులు ఇస్తున్నారని బృందా కారత్ ఆరోపించారు. -
బీజేపీ ఓటమే మా ప్రధాన ధ్యేయం..
సాక్షి, హైదరాబాద్ : సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా మరోసారి తనను ఎన్నుకున్నందుకు సీతారాం ఏచూరి ధన్యవాదాలు తెలిపారు. తనపై ఉంచిన బాధ్యతలను నెరవేర్చేందుకు శక్తివంచన లేకుండా పని చేస్తానని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. పార్టీ ఐక్యతను మహాసభలు మరోసారి రుజువు చేశాయని అన్నారు. శ్రామిక కార్మిక పాలన తీసుకురావడమే మన ముందున్న లక్ష్యమని అన్నారు. దేశ సమైక్యతను, రాజ్యాంగాన్ని కాపాడుకోవడం మన కర్తవ్యమన్నారు. బీజేపీ, ఆరెస్సెస్ ఓటమే మన ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. సీపీఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి (65) మరోదఫా ఎన్నికైన సంగతి తెలిసిందే. 22వ జాతీయ మహాసభల్లో భాగంగా చివరిరోజు(ఆదివారం) జరిగిన పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం ఈ నిర్ణయం తీసుకుంది. అనంతరం సీతారాం ఏచూరి మహాసభల్లో మాట్లాడారు. దోపిడీలేని సమాజం కోసం సమరశీల పోరాటాలు చేద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పెను సవాళ్లకు, దాడులకు ఎదురొడ్డి దేశ సమగ్రతను కాపాడుకుందామన్నారు. దేశ ప్రజల విముక్తే మన ముందున్న లక్ష్యమని స్పష్టం చేశారు. లక్ష సాధనకు పునరంకితం అవుదామని అన్నారు. -
కేసీఆర్ ఫ్రంట్.. మూసి నది!
సాక్షి, హైదరాబాద్: సీపీఎం మహాసభల్లో రాజకీయ తీర్మానం గురించి చర్చించినట్టు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు. భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) 22వ జాతీయ మహాసభలు నగరంలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీతారాం ఏచూరి గురువారం విలేకరులతో మాట్లాడారు. రెండు నెలల కిందటే రాజకీయ తీర్మానాన్ని ప్రతిపాదించామని, కాంగ్రెస్ పార్టీతో పొత్తు విషయంలో పార్టీలో భిన్నాభిప్రాయాలు వచ్చాయని ఏచూరి తెలిపారు. రాజకీయ తీర్మానంపై అందరి అభిప్రాయాలను స్వీకరించామని తెలిపారు. పార్టీ సభ్యుడు ఎవరైనా తమ ప్రతిపాదన ఇవ్వవచ్చునని, ప్రతిపాదనలపై చర్చలు జరుగుతాయని తెలిపారు. గతంలో పార్టీ పరంగా జరిగిన లోపాలను సరిదిద్దుకుంటామని చెప్పారు. జస్టిస్ లోయ మృతిపై సుప్రీంకోర్టు తీర్పు దురదృష్టకరమని చెప్పారు. ఈ కేసును ఉన్నత ధర్మాసనం సమీక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. పార్టీలో సీక్రేట్ బ్యాలెట్‌కు ఆస్కారం లేదని, ఎన్నికల్లో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీతో అవగాహన ఒప్పందం ఉండబోదని ఆయన తెలిపారు. బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే అంశంపై కూడా మహాసభల్లో చర్చ జరుగుతోందని తెలిపారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విభజన అంశాలు, ప్రత్యేక హోదా విషయంలో పార్టీ సమావేశాల్లో కచ్చితంగా తీర్మానం ఉంటుందని తెలిపారు. జాతీయ ప్రత్యామ్యాయ ఫ్రంట్లలో చేరే ఆలోచన లేదని పేర్కొంటూ.. కేసీఆర్ ఫ్రంట్‌ను ఏచూరి మూసీ నదితో పోల్చారు. -
దీక్షలో ఎంపీలతో కలిసి కూర్చున్న ఏచూరి
సాక్షి, న్యూఢిల్లీ : ఐదుకోట్ల మంది ఆంధ్రులకు అపర సంజీవని వంటి ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అలుపెరుగని పోరాటం కొనసాగుతూనే ఉంది. హోదా కోసం గర్జిస్తూ.. వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఢిల్లీలోని ఏపీ భవన్లో అంబేద్కర్ విగ్రహం సాక్షిగా చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష రెండోరోజుకు చేరుకుంది. విభజన హామీల విషయంలో కేంద్రంలోని ఎన్డీయే సర్కారు తీరును ఎండగడుతూ ఐదుగురు ఎంపీలు చేపట్టిన దీక్ష హస్తినలో హాట్‌టాపిక్‌గా మారింది. ఏపీ హక్కుల సాధన కోసం ఎంపీల చేపట్టిన ఈ దీక్షకు విశేష స్పందన లభిస్తోంది. వైఎస్ఆర్సీపీ ఎంపీలు చేపట్టిన దీక్షకు సీపీఎం మద్దతు పలికింది. ఎంపీల దీక్షాశిబిరాన్ని సందర్శించి సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంఘీభావం తెలిపారు. వైఎస్ఆర్సీపీ ఎంపీలతోపాటు దీక్షలో కూర్చొని.. వారికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనతో సమస్యలు వస్తాయని ముందే చెప్పామని తెలిపారు. ఆనాడు ఏపీకి ఐదేళ్లు కాదు పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని వెంకయ్యనాయుడు చెప్పారని, కానీ బీజేపీ సర్కారు ఆ హామీలను నెరవేర్చలేదని ఆయన తెలిపారు. -
‘చంద్రబాబు ఘనకార్యం ఏంటో అర్థమైంది’
సాక్షి, న్యూఢిల్లీ : ‘ఉత్తరాంధ్ర చర్చా వేదిక’ డిమాండ్లు న్యాయ సమ్మతమైనవని, తమ పూర్తి మద్దతు ఉంటుందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ఉత్తరాంధ్ర చర్చా వేదిక సభ్యులు శనివారం సీపీఎం నేతలను కలిశారు. ఈ సందర్భంగా సీతారాం ఏచూరి మాట్లాడుతూ..‘ బీజేపీతో పొత్తు పెట్టుకున్నందుకు 10 ఏళ్లు అధికారానికి దూరం అయ్యావు. మళ్లీ బీజేపీతో పొత్తు ఎందుకు పెట్టుకుంటున్నావని చంద్రబాబు అడిగాను. మేమిద్దరం కలిసి ఘనకార్యం చేస్తామని చంద్రబాబు అన్నారు. ఆ ఘనకార్యం ఏమిటో ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. ఏపీకి ‘ప్రత్యేక హోదా’ కు ప్రత్యామ్నాయంగా ‘ప్రత్యేక ప్యాకేజీ’ అన్నారు. అదీ లేదు. రాష్ట్రానికి ‘హోదా’ ప్రత్యేక పరిస్థితుల్లో ఇవ్వడం జరిగింది. దీన్ని వేరే రాష్ట్రాలతో ముడిపెట్టి చూడకూడదు. రాష్ట్రంలో వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి జరగకపోగా, మరింత వెనుకబడిపోయాయి.’అని అన్నారు. చేతులు దులుపుకోవాలంటే కుదరదు.. సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు మాట్లాడుతూ... నరేంద్ర మోదీ, చంద్రబాబు ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని ముంచారు. చంద్రబాబుకు ఎప్పుడూ మాట మార్చడం అలవాటే. ఇవాళ ఆగ్రహం, రేపు సంతోషం. రాష్ట్రం పట్ల బీజేపీ సవతి తల్లి ప్రేమను టీడీపీ ఇన్నాళ్లు కప్పిపెడుతూ, సంరక్షిస్తూ వచ్చింది. రాష్ట్రాన్ని అన్నిరకాలుగా మోసం చేసిన తర్వాత, తనదాకా వచ్చిన తర్వాత, ఎన్నికల ముందు చంద్రబాబు కోపాన్ని నటిస్తున్నారు. మొత్తం తప్పునంతటినీ కేంద్ర ప్రభుత్వంపై నెట్టి, చంద్రబాబు చేతులు దులుపుకోవాలంటే కుదరదు. ప్రత్యేక ప్యాకేజీ అని ఇన్నాళ్లు ఊరించారు. అది ఇప్పుడు ఉత్తదే అని తేలింది. దీనికి చంద్రబాబు బాధ్యత వహించాల్సిందే. కేంద్రంతో పోరాడితేనే రాష్ట్రానికి ప్రయోజనాలు కలుగుతాయి. ఈ విషయాన్ని గత అనుభవాలే చెప్పాయి. చంద్రబాబుకు రాష్ట్ర ప్రయోజనాల కంటే సొంత ప్రయోజనాలే ఎక్కువ.’ అని ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్ర చర్చా వేదిక కన్వీనర్ కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ.. విశాఖ రైల్వేజోన్ ఏర్పాటుతో సహా, తమ డిమాండ్లన్నింటినీ అమలు చేసేందుకు వెంటనే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. -
నాడు వెయ్యి నోటుతో.. నేడు రెండువేల నోటుతో
సాక్షి, హైదరాబాద్ : నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల దేశంలోని అన్ని రంగాలు కుదేలయ్యాయని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. దేశంలో ఆర్థిక రంగం తీవ్రమైన సంక్షోభంలో ఉందని ఆయన పేర్కొన్నారు. బాగ్‌లింగపల్లి ఆర్టీసీ కళ్యాణమంటపంలో గురువారం సీపీఎం 22వ జాతీయ మహా సభల ఆహ్వాన సంఘం సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఆయన పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. ఉద్యోగాలు వస్తాయని ఆశ పెట్టారు, కానీ బీజేపీ అధికారంలోకి వచ్చాక చాలామంది ఉపాధి కోల్పోయారని విమర్శించారు. విదేశీ పెట్టుబడులు పెరగడానికి, రైల్వేను ప్రైవేటీకరించడానికి మాత్రమే కేంద్రం చర్యలు తీసుకుంటోందని విమర్శించారు. ఇలాంటి విధానాలకు ప్రత్యామ్నాయం అవసరమని, వచ్చే ఏడాది ఏప్రిల్‌లో తెలంగాణలో జరిగే సీపీఎం జాతీయ మహాసభలు దశ, దిశ చూపించాలన్నారు. నోట్లరద్దు వల్ల బ్లాక్ మనీ మొత్తం వైట్ మనీ అయ్యిందని, వెయ్యి నోటుతో జరిగే అవినీతి ఇప్పుడు రెండువేల నోటుతో జరుగుతోందన్నారు. బీజేపీ అధికారం అడ్డుపెట్టుకొని ఎలక్షన్ కమిషన్, సీబీఐని దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నేతలు బీవీ రాఘవులు, తమ్మినేని వీరభద్రం, పి. మధు, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యనేతలు పాల్గొన్నారు -
ఏచూరికి విజయన్ షాక్!
ఆయనను మరోసారి రాజ్యసభకు పంపే ప్రసక్తే లేదు తేల్చిచెప్పిన కేరళ సీఎం సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని మూడోదఫా రాజ్యసభకు పంపించే విషయమై ఆ పార్టీ అత్యున్నత నిర్ణాయక విభాగం కేంద్ర కమిటీ చర్చిస్తున్న సమయంలోనే కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఏచూరిని రాజ్యసభకు ఎన్నుకునే ప్రసక్తే లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. 'కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పార్టీ ప్రధాన కార్యదర్శిని రాజ్యసభకు పంపడం మా రాజకీయ వైఖరిరి విరుద్ధం' అని ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న వ్యక్తి పార్లమెంటేరియన్ బాధ్యతలకు న్యాయం చేకూర్చలేరని, పార్టీ బాధ్యతల్లో భాగంగా ఆయన దేశవ్యాప్తంగా పర్యటించాల్సి ఉంటుందని చెప్పారు. సీపీఎంలో రాజ్యసభ సభ్యత్వం అంశం రెండు గ్రూపుల మధ్య దూరాన్ని పెంచుతున్న సంగతి తెలిసిందే. రెండుసార్లు రాజ్యసభకు ఎన్నికైన పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మూడోసారీ పెద్దలసభలో అడుగుపెట్టాలని ప్రయత్నిస్తున్నారు. పశ్చిమబెంగాల్ నుంచి రాజ్యసభకు వెళ్లేందుకు ఆయన ప్రణాళికలు వేశారు. పార్టీలో మరో సీనియర్ నేత ప్రకాశ్ కారత్ వర్గం దీనిపై విముఖత వ్యక్తం చేస్తోంది. ఆగస్టు 8న జరగనున్న రాజ్యసభ ఎన్నికల నామినేషన్‌కు తుదిగడువు (జూలై 28) సమీపిస్తుండటంతో ఈ సమావేశాల్లోనే ఎవరు పోటీ చేస్తారనే దానిపై కేంద్ర కమిటీ స్పష్టతనివ్వాల్సి ఉంది. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఏచూరి, మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్‌ల మధ్య రాజ్యసభ విషయంలో తీవ్రమైన విభేదాలున్నాయనేది బహిరంగ రహస్యమే. గత నెలలో జరిగిన పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలోనే సీతారాం ఏచూరికి మూడోసారి రాజ్యసభ ఇవ్వటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. నేతలెవరైనా గరిష్టంగా రెండుసార్లు మాత్రమే రాజ్యసభకు వెళ్లే అవకాశం ఇవ్వాలని కేంద్ర కమిటీలో చర్చ జరిగింది. అయితే, పశ్చిమబెంగాల్, త్రిపుర సీపీఎం యూనిట్లు ఏచూరీని మరోసారి రాజ్యసభకు పంపాలని డిమాండ్ చేస్తున్నాయి. పార్లమెటులో వామపక్ష వాణిని బలంగా వినిపిస్తున్నారని ఏచూరికి మద్దతుగా నిలిచాయి. మిగిలిన రాష్ట్రాల యూనిట్లలో ఏచూరిపై భిన్నాభిప్రాయాలున్నాయి. -
ఏచూరి వర్సెస్ కారత్
♦ రాజ్యసభ అభ్యర్థిత్వంపై సీపీఎంలో ముదురుతున్న వివాదం ♦ మూడోసారి ఏచూరికే అవకాశం ఇవ్వాలంటున్న ఓ వర్గం ♦ నిబంధనలు చూపుతూ తిరస్కరిస్తున్న ప్రకాశ్ కారత్ బృందం జీకేఎం రావు, సాక్షి ప్రత్యేక ప్రతినిధి సీపీఎంలో రాజ్యసభ సభ్యత్వం రెండు గ్రూపుల మధ్య దూరాన్ని పెంచుతోంది. రెండుసార్లు రాజ్యసభకు ఎన్నికైన పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మూడోసారీ పెద్దలసభలో అడుగుపెట్టాలని ప్రయత్నిస్తున్నారు. పశ్చిమబెంగాల్ నుంచి రాజ్యసభకు వెళ్లేందుకు ప్రణాళికలు వేశారు.పార్టీలో మరో సీనియర్ నేత ప్రకాశ్ కారత్ వర్గం దీనిపై విముఖత వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం సీపీఎం పొలిట్ బ్యూరో, సెంట్రల్ కమిటీ సమావేశాలు ఢిల్లీలో ప్రారంభంకానున్నాయి. ఆగస్టు 8న జరగనున్న రాజ్యసభ ఎన్నికల నామినేషన్‌కు తుదిగడువు (జూలై 28) సమీపిస్తుండటంతో ఈ సమావేశాల్లోనే ఎవరు పోటీ చేస్తారనే దానిపై కేంద్ర కమిటీ స్పష్టతనివ్వనుంది. ఇద్దరి మధ్య ఉప్పు–నిప్పు ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఏచూరి, మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్‌ల మధ్య రాజ్యసభ విషయంలో తీవ్రమైన విభేదాలున్నాయనేది బహిరంగ రహస్యమే. గత నెలలో జరిగిన పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలోనే సీతారాం ఏచూరికి మూడోసారి రాజ్యసభ ఇవ్వటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. నేతలెవరైనా గరిష్టంగా రెండుసార్లు మాత్రమే రాజ్యసభకు వెళ్లే అవకాశం ఇవ్వాలని కేంద్ర కమిటీలో చర్చ జరిగింది. అయితే, పశ్చిమబెంగాల్, త్రిపుర సీపీఎం యూనిట్లు ఏచూరీని మరోసారి రాజ్యసభకు పంపాలని డిమాండ్ చేస్తున్నాయి. పార్లమెటులో వామపక్ష వాణిని బలంగా వినిపిస్తున్నారని ఏచూరికి మద్దతుగా నిలిచాయి. మిగిలిన రాష్ట్రాల యూనిట్లలో ఏచూరిపై భిన్నాభిప్రాయాలున్నాయి. ఆదివారం పొలిట్ బ్యూరో సమావేశం, తర్వాతి మూడ్రోజుల పాటు కేంద్ర కమిటీ భేటీ జరగనుంది. ప్రకాశ్ కారత్‌పై ఒత్తిడి పెంచే క్రమంలో గత మే నెలలోనే పశ్చిమబెంగాల్ పార్టీ నాయకత్వం.. తమ రాష్ట్రం నుంచి ఏచూరికి మూడోసారి అవకాశం ఇవ్వాలని ప్రతిపాదించింది. దీన్ని కారత్ వర్గం (బీవీ రాఘవులు కూడా ఇదే వర్గం) తిరస్కరించింది. ప్రధాన కార్యదర్శిగా ఉన్న వ్యక్తి ఎంపీ కాకూడదని.. వ్యవస్థాగత అంశాలు, పార్టీ నిర్మాణంపై దృష్టిపెట్టాలనేది కారత్ వర్గం వాదన. ఏచూరి వర్గం మాత్రం.. పార్లమెంటులో వివిధ పార్టీల ముఖ్యనాయకులతో కలిసి రాజకీయ మేథమథనం జరుగుతున్న సమయంలో తమ పార్టీ సిద్ధాంతాన్ని ఏచూరీయే బలంగా వెల్లడిస్తారంటోంది. ‘రెండుసార్లే’ నిబంధనపై.. పార్టీ నుంచి రాజ్యసభ సభ్యులకు రెండుసార్లే అవకాశం ఇవ్వాలన్న నిబంధనను కారత్ వర్గం గుర్తుచేస్తోంది. అయితే గతంలోనే ఈ నిబంధనకు మినహాయింపు నిచ్చారని.. ఏచూరిని ఏకగ్రీవంగా ఎన్నుకోని పక్షంలో వామపక్ష కూటమిలోని ఫార్వర్డ్ బ్లాక్ వంటి పలు పార్టీలు తమ అభ్యర్థిత్వాన్ని ప్రకటించుకునే అవకాశం ఉందని ఏచూరి వర్గమంటోంది. పశ్చిమబెంగాల్ నుంచి ఏచూరిని గెలిపించుకునేందుకు వామపక్షాలకు 37 మంది కాంగ్రెస్ సభ్యుల మద్దతు తప్పనిసరి. అయితే పార్లమెంటులో బీజేపీ, ఇతర మతతత్వ గ్రూపులపై పోరాడే వాక్చాతుర్యమున్న ఏచూరికి తమ మద్దతుంటుందని కాంగ్రెస్ అధిష్టానం ఇదివరకే ప్రకటించింది. కాంగ్రెస్ సాయంతో పార్టీ ప్రధాన కార్యదర్శి రాజ్యసభకు ఎన్నికైతే కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాడాలనుకున్న పార్టీ సిద్ధాంతాన్ని విస్మరించినట్లే అనేది కారత్ బృందం వాదన. పొలిట్ బ్యూరోలోని మెజారిటీ సభ్యులు సైతం కేరళలో లెఫ్ట్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రధాన శత్రువనే విషయాన్ని గుర్తుచేస్తున్నారు. రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఏచూరికి అడ్డుకట్ట వేసేందుకు పొలిట్ బ్యూరోలో ఓటింగ్ నిర్వహించేలా కారత్ వర్గం ప్రయత్నిస్తోందని సమాచారం. దాదాపు 80 మంది సభ్యులున్న పార్టీ కేంద్ర కమిటీలో 8 మంది తెలుగురాష్ట్రాలకు చెందిన వారే (బీవీ రాఘవులు, పి. మధు, ఎంఏ గఫూర్, పాతూరి రామయ్య, ఎస్ పుణ్యవతి, తమ్మినేని వీరభద్రం, ఎస్ వీరయ్య, సీహెచ్ సీతారాములు, శాశ్వత ఆహ్వానితురాలు మల్లు స్వరాజ్యం) ఉన్నారు. -
‘ప్రత్యేక హోదాపై ఆయనే చెప్పాలి’
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఎందుకు ఇవ్వడం లేదో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడే చెప్పాలని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఐదేళ్లు ఇవ్వమని తాము అడిగితే వెంకయ్య పదేళ్లు కావాలని అడిగిన విషయాన్ని ఏచూరి గుర్తు చేశారు. అఖిలపక్ష సమావేశం ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ... అసెంబ్లీ సీట్ల పెంపు మీద ఈ పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు లేదని తెలిపారున ఇప్పటికే రాజ్యసభలో 10, లోక్‌సభలో 8 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. రైతులకు మద్దతు ధర దొరికితే ఆత్మహత్యలు ఆగుతాయని అభిప్రాయపడ్డారు. జీఎస్టీ అమలు, ఇబ్బందులపై పార్లమెంట్ సమావేశాల్లో చర్చించాలని నిర్ణయించినట్టు కేంద్ర మంత్రి సుజనా చౌదరి తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజనపై కొన్ని అంశాలు చర్చించాల్సివుందని అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల తర్వాత నియోజకవర్గాల పెంపుపై చర్చిస్తామని చెప్పారు. -
స్మృతి, ఏచూరి సహా.. పది మంది రిటైర్!
గుజరాత్, పశ్చిమ బెంగాల్, గోవా రాష్ట్రాల అసెంబ్లీల నుంచి రాజ్యసభకు ఎన్నికైన పది మంది సభ్యుల పదవీ కాలం త్వరలో ముగియనుంది. ఈ స్థానాల కోసం ఎలక్షన్ కమిషన్ ఎన్నికల షెడ్యూలును విడుదల చేసింది. గోవా నుంచి ఒకరు, గుజరాత్ నుంచి ముగ్గురు, పశ్చిమ బెంగాల్ నుంచి ఆరుగురు రాజ్యసభ సభ్యుల పదవీ కాలం పూర్తికావచ్చింది. ఈ మూడు రాష్ట్రాల నుంచి పదవీ కాలం ముగుస్తున్న పదిమంది రాజ్యసభ సభ్యుల స్థానాల కోసం వచ్చే జూన్ 8 న ఎన్నికలు జరగనున్నాయి. పదవీ కాలం ముగుస్తున్న పదిమంది ఎంపీలలో ప్రస్తుత కేంద్ర జౌళిశాఖ మంత్రి స్మృతి ఇరానీతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత అహమ్మద్ పటేల్, సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి, తృణమూల్ కాంగ్రెస్ నేత డెరెక్ ఒబ్రెయిన్ కూడా ఉన్నారు. స్మృతి ఇరానీ (బీజేపీ), అహమ్మద్ పటేల్ (కాంగ్రెస్), దిలీప్ భాయ్ శివశంకర్ భాయి పాండ్యా (బీజేపీ) లు గుజరాత్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. శాంతారాం నాయక్ (కాంగ్రెస్) గోవా నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండగా, డెరెక్ ఒబ్రెయిన్ (టీఎంసీ), దేబబ్రత బందోపాధ్యాయ (టీఎంసీ), ప్రదీప్ భట్టాచార్య (కాంగ్రెస్), సీతారాం ఏచూరి (సీపీఎం), సుఖేందుశేఖర్ రాయ్ (టీఎంసీ), దోలా సేన్ (టీఎంసీ) లు పశ్చిమ బెంగాల్ నుంచి ఎన్నికయ్యారు. వీరిలో శివశంకర్ భాయి జూలై ఆఖరునాటికి పదవీ విరమణ చేస్తుండగా, మిగతా సభ్యుల పదవీ కాలం ఆగస్టు 18తో ముగుస్తుంది. ఈ ఖాళీలను భర్తీ చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూలు ప్రకారం మే 22 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. జూన్ 8న ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎన్నికల సంఘం మంగళవారం విడుదల చేసిన షెడ్యూలులో పేర్కొంది. -
హోదా వచ్చే వరకు వదిలిపెట్టం: వైఎస్ జగన్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించేందుకు కలిసికట్టుగా పోరాటం చేస్తామని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా సాధించే వరకు పోరాటం వదిలి పెట్టబోమని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీలో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని వైఎస్ జగన్, వైఎస్సార్ సీపీ ఎంపీలు కలిశారు. ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రత్యేక హోదాపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని అన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాలంటే పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. ప్రత్యేక హోదా హామీ అమలు చేయకుంటే పార్లమెంట్ విశ్వసనీయత ప్రశ్నార్థకంగా మారే ప్రమాదముందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఒకవైపు పోరాటం చేస్తూనే, మరోవైపు ఇతర పార్టీలను కలుపుకుని పార్లమెంట్ లో కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. ప్రత్యేక హోదా వచ్చే వరకు పోరాటం వదిలిపెట్టబోమని ఘంటాపదంగా చెప్పారు. వైఎస్ జగన్ తో పాటు సీతారాం ఏచూరిని కలిసిన వారిలో మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్, బుట్టా రేణుక, వైఎస్ అవినాష్ రెడ్డి, విజయసాయిరెడ్డి తదితరులున్నారు. -
బాబు అక్రమాలపై విస్తుపోయిన జాతీయ నేతలు
న్యూఢిల్లీ: అధికారంలో కొనసాగడానికి పూర్తిస్థాయి మెజారిటీ ఉన్నప్పటికీ ప్రతిపక్ష పార్టీకి చెందిన ఒక్కో ఎమ్మెల్యేకు కనీసంగా 40 కోట్ల రూపాయలు ఎరవేసి కొనుగోలు చేస్తున్న చంద్రబాబు నాయుడు తీరుపై ఆయా పార్టీలకు చెందిన జాతీయ స్థాయి నేతలు విస్మయం చెందారు. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు రకరకాలుగా ప్రలోభపెడుతూ టీడీపీలో చేర్పించుకుంటున్న వైనం, రాష్ట్రంలో విచ్చలవిడిగా పెరిగిపోయిన అవినీతి అక్రమాలపై సేవ్ డెమాక్రసీ పేరుతో జాతీయస్థాయిలో వైఎస్సార్సీపీ ఆందోళన చేపట్టింది. ఇందులో భాగంగా ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు ఇతర సీనియర్ నేతలు సోమవారం ఢిల్లీకి చేరుకున్న సంగతి తెలిసిందే. సేవ్ డెమాక్రసీ ఉద్యమ కార్యాచరణలో భాగంగా జాతీయ స్థాయిలోని అన్ని రాజకీయ పార్టీల నేతలను కలిసి రాష్ట్రంలో చంద్రబాబు అరాచక అవినీతి అక్రమాలను వివరిస్తున్నారు. అందులో భాగంగా మంగళవారం కేంద్ర మంత్రి రాజ్ నాధ్ సింగ్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఎన్సీపీ నాయకుడు శరద్ పవార్, జేడీయూ నేత శరద్ యాదవ్ తదితరులను కలిసి ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతున్న అప్రజాస్వామిక, అరాచక పరిపాలనపై సమగ్రంగా ఉదాహరణలతో సహా వివరించారు. నేతలను కలిసినప్పుడు జగన్ మోహన్ రెడ్డి ఒక్కో సంఘటనను వివరించినప్పుడు జాతీయ స్థాయి నేతలు విస్మయం వ్యక్తం చేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా ఇంతగా బరితెగింపు రాజకీయాలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న విధానాలు ఆ నేతలను ఆశ్చర్యపరిచింది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఉల్లంఘిస్తూ జరుగుతున్న వివరాలు తెలుసుకున్న ఆ నేతలు ఇలాంటి చర్యలకు వెంటనే అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని, ప్రస్తుత సమావేశాల్లో దీన్ని లేవనెత్తుతామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అక్రమాలను ప్రస్తావిస్తూ చట్టాలను మరింత కఠిన తరం చేయాల్సిన ఆవశ్యకతను కూడా పార్లమెంట్ లో లేవనెత్తుతామన్నారు. ఒక్కో ఎమ్మెల్యేను టీడీపీలోకి రప్పించుకోవడానికి 40 కోట్ల రూపాయలు ఎరవేయడమే కాకుండా, వారికి కావలసిన పనులు చేసి పెడతామని, కొందరికి మంత్రిపదవులు ఇస్తామని... ఇలా రకరకాలుగా ప్రలోభాలకు గురిచేస్తున్నారని, మరికొందరిపై బెదిరింపులకు దిగుతున్నారని ఆయా పార్టీల నేతలకు వైఎస్సార్ సీపీ ప్రతినిధి బృందం వివరించింది. ఈ సందర్భంగా రెండేళ్ల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాగించిన అవినీతి అక్రమాల వివరాలతో ముద్రించిన 'ది ఎంపరర్ ఆఫ్ కరప్షన్' పుస్తకాన్ని ఆయా నేతలకు అందించడమే కాకుండా పలు అవినీతి కుంభకోణాలపై వివరించారు. చంద్రబాబు పాల్పడిన అవినీతి అక్రమాలను వివరించినప్పుడు ఇంతటి రాజకీయ అవినీతిని తానెప్పుడూ చూడలేదని సీతారాం ఏచూరి ఒక్కసారిగా విస్మయం వ్యక్తం చేశారు. ఇలాంటి అవినీతి అక్రమాల వల్ల ఆంధ్రప్రదేశ్ పరువు మంటగలుస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి రాజకీయ పార్టీ నాయకుడు చంద్రబాబు అక్రమాలకు వ్యతిరేకంగా నినదించాల్సిన అవసరముందన్నారు. ఇలాంటి చర్యల వల్ల ప్రజాస్వామ్యమంటే ప్రజలకు నమ్మకం లేకుండాపోతోందని, అవసరమైన మేరకు చట్టాలను మరింత కఠినతరం చేసేలా పార్లమెంట్ లో ఈ విషయాలను లేవనెత్తుతానని చెప్పారు. జాతీయ స్థాయిలో అన్ని రాజకీయ పార్టీల నేతలకు ఈ వివరాలను తెలియజేస్తూనే అపాయింట్ మెంట్ ఇస్తే రాష్ట్రపతి, ప్రధానమంత్రికి కూడా కలిసి చంద్రబాబు అవినీతిని విడమరిచి చెప్పనున్నారు. -
మతతత్వ బీజేపీని పారదోలాలి!
పశ్చిమబెంగాల్లో అవినీతి టీఎంసీని గద్దె దించాలి ♦ దూరమైనవారిని తిరిగి పార్టీలోకి తీసుకురావాలి ♦ పశ్చిమబెంగాల్లో ప్రారంభమైన సీపీఎం ప్లీనం కోల్‌కతా: కేంద్రంలో మతతత్వ బీజేపీని, పశ్చిమబెంగాల్లో అవినీతి టీఎంసీని కూకటివేళ్లతో పెకిలించి వేయాలని సీపీఎం పిలుపునిచ్చింది. సీపీఎం ప్లీనం ఆదివారం కోల్‌కతాలో ఘనంగా ప్రారంభమైంది. పార్టీ పొలిట్బ్యూరొ సభ్యులు, కేంద్ర కమిటీ సభ్యులు సహా దేశం నలుమూలల నుంచి వచ్చిన 400కు పైగా నేతలు 5 రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో పాల్గొంటున్నారు. 37 ఏళ్ల విరామం అనంతరం సీపీఎం ప్లీనం నిర్వహిస్తోంది. గతంలో చివరగా 1978లో పశ్చిమబెంగాల్లో సీపీఎం ప్లీనం జరిగింది. తాజా ప్లీనంలో పార్టీ పునరుజ్జీవనానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా చర్చించనున్నారు. ప్రజాస్వామ్య, లౌకిక శక్తులను కూడగట్టాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా పలువురు నేతలు నొక్కి చెప్పారు. అలాగే, పార్టీకి దూరమైన కార్మిక, కర్షక, నిరుపేద వర్గాలను తిరిగి పార్టీలోకి తీసుకువచ్చే కార్యక్రమం చేపట్టాలన్నారు. ‘బీజేపీ దేశం మొత్తం మతతత్వ విషం చిమ్ముతోంది. టీఎంసీ పశ్చిమబెంగాల్‌ను నాశనం చేస్తోంది. కేంద్రంలో బీజేపీని, రాష్ట్రంలో తృణమూల్‌ను గద్దె దించాల్సిందిగా పిలుపునిస్తున్నాం’ అని పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ ర్యాలీనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ప్రధాని మోదీ తాజాగా చేసిన పాక్ పర్యటనను ఎద్దేవా చేస్తూ.. ‘నాయకుల మధ్య పైపై చర్చలు భారత్-పాక్ సంబంధాలను మెరుగుపర్చవ’ని తేల్చిచెప్పారు. ‘ఉగ్రవాదానికి ఊతమివ్వడం ఆపే వరకు పాక్‌తో చర్చలుండవన్నారు. ఇప్పుడు మళ్లీ చర్చలంటున్నారు. మరోవైపు, మీరు పాక్ ఘజల్ గాయకుడిని ముంబైలో పాడనివ్వరు. పాక్ క్రికెట్ టీం భారత్‌లో పర్యటించవద్దంటారు’ అని వ్యాఖ్యానించారు. పాక్‌తో చర్చలు అవసరమే. వాటిని మేం స్వాగతిస్తామని స్పష్టం చేశారు. ‘బీజేపీ, ఆరెస్సెస్ శక్తులకు బెంగాల్లో అంగుళం కూడా వదలబోం’ అని పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకారత్ పేర్కొన్నారు. ‘అసహనంపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతుంటే టీఎంసీ ఎంపీలు ఎక్కడా కనిపించరు. బహుశా శారద చిట్‌ఫండ్ స్కామ్‌లో జైళ్లోనో, బెయిల్పైననో వారంతా ఉండి ఉంటారు’ అంటూ ఎద్దేవా చేశారు. ‘బెంగాల్లో పరిస్థితి దారుణంగా.. కుప్పకూలడానికి సిద్ధంగా ఉంది. రాష్ట్రంలో అవినీతిపరులు, నేరస్తుల ప్రభుత్వం ఉంది. పారిశ్రామికీకరణ నిస్తేజంగా ఉంది’ అంటూ పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య.. మమత బెనర్జీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. అవినీతిమయమైన ఈ ప్రభుత్వాన్ని తొలగించి, రాష్ట్రాన్ని కాపాడాల్సి ఉందన్నారు. ఇందుకు గట్టి పోరాటమే చేయాల్సి ఉందన్నారు. 2016 అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 2011లో అధికారం కోల్పోయిన తరువాత పశ్చిమబెంగాల్లో సీపీఎం బాగా బలహీనపడిన నేపథ్యంలో.. పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం తీసుకురావడానికి చేపట్టాల్సిన చర్యలపై ఈ ప్లీనంలో చర్చించనున్నారు. ‘పార్టీకి దూరమైన వర్గాలను మళ్లీ కలుపుకోవాలి. అందుకు ప్రతీ కార్యకర్త రోజుకు ఒక్కరైనా కొత్త వ్యక్తిని కలవాలి. బీజేపీ, టీఎంసీ, కాంగ్రెస్ల్లోని అణగారిన వర్గాలకు చెందిన కార్యకర్తలకు కూడా దగ్గరవ్వాలి. దీన్నో సవాలుగా తీసుకోవాలి’ అని పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, పొలిట్బ్యూరొ సభ్యుడు సూర్యకాంత మిశ్రా పేర్కొన్నారు. సీపీఎంలో నెలకొన్న విభేదాలను అన్యాపదేశంగా ప్రస్తావిస్తూ.. ‘కొంతమంది పార్టీని వీడితేనే మంచిది’ అని అన్నారు. ‘వారు కొద్దిమందే.. వారు బయటికెళ్తేనే మంచింది. పార్టీలో ఉండాల్సిన చాలామంది.. పార్టీకి వెలుపలు ఉన్నారు. వారిని పార్టీలోకి తీసుకురావాలి’ అన్నారు. అయితే, ఆయన ఎవరి పేరునూ ప్రత్యేకంగా పేర్కొనలేదు. స్పష్టమైన ప్రత్యామ్నాయ విధానాలున్న వామపక్ష పార్టీలు దేశవ్యాప్తంగా బలోపేతం కావాల్సిన అవసరం ఉందని పలువురు మార్కిస్ట్ నేతలు అభిప్రాయపడ్డారు. బలమైన వామపక్ష ప్రజాస్వామ్య ప్రత్యామ్నాయాన్ని రూపొందించడంలో బెంగాల్ కీలక భూమిక పోషించాలని త్రిపుర సీఎం మాణిక్ సర్కార్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా వామపక్ష శక్తులు బలోపేతం కావాల్సి ఉందన్నారు. -
వైఎస్ జగన్ ధర్నాకు ఏచూరి మద్దతు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తాము పూర్తిగా మద్దతు ఇస్తున్నామని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు. జంతరం మంతర్ వద్ద ధర్నా చేస్తున్న వైఎస్ జగన్ ను స్వయంగా కలిసి ఆయన మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఏచూరి మాట్లాడుతూ... * మీరు ప్రస్తావించిన డిమాండ్లతో పాటు మార్క్సిస్టు పార్టీ నుంచి, నా వ్యక్తిగతంగా కూడా మద్దతు ఇస్తున్నాం * రాష్ట్ర విభజనను మా పార్టీ మాత్రమే వ్యతిరేకించింది. * మీరు ఏ విధంగా అయితే ఈ విభజన చేస్తున్నారో, దీనివల్ల కొత్త సమస్యలు వస్తున్నాయి * వాటిని పరిష్కరించకుండా విభజన చేయడం సరికాదని వాదించాం * అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ నాయకులు.. కచ్చితంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని అన్నారు * ఏడాది దాటినా స్పెషల్ స్టేటస్ గానీ, ఇతర సమస్యలను గానీ పరిష్కరించడానికి కేంద్రం జోక్యం చేసుకోవట్లేదు దాన్ని ఖండిస్తున్నాం, పార్లమెంటులో కూడా ఖండిస్తాం * ప్రత్యేక హోదా కోసం మీ అందరితో కలిసి పార్లమెంటులోను, బయట రోడ్ల మీద పోరాడుతాం * ఈ ఉద్యమం మనది.. పార్లమెంటులో మాట్లాడేటప్పుడే చెప్పా.. దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని గురజాడ చెప్పారని అన్నాను * బ్రదర్ జగన్‌కి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ విషయంలో మా మద్దతు పూర్తిగా ఉంది