వైఎస్ జగన్ ధర్నాకు ఏచూరి మద్దతు | sitaram yechuri support YSRCP Dharna in Delhi | Sakshi
Sakshi News home page

వైఎస్ జగన్ ధర్నాకు ఏచూరి మద్దతు

Published Mon, Aug 10 2015 3:16 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

వైఎస్ జగన్ ధర్నాకు ఏచూరి మద్దతు - Sakshi

వైఎస్ జగన్ ధర్నాకు ఏచూరి మద్దతు

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తాము పూర్తిగా మద్దతు ఇస్తున్నామని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు. జంతరం మంతర్ వద్ద ధర్నా చేస్తున్న వైఎస్ జగన్ ను స్వయంగా కలిసి ఆయన మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఏచూరి మాట్లాడుతూ...

మీరు ప్రస్తావించిన డిమాండ్లతో పాటు మార్క్సిస్టు పార్టీ నుంచి, నా వ్యక్తిగతంగా కూడా మద్దతు ఇస్తున్నాం
రాష్ట్ర విభజనను మా పార్టీ మాత్రమే వ్యతిరేకించింది.
మీరు ఏ విధంగా అయితే ఈ విభజన చేస్తున్నారో, దీనివల్ల కొత్త సమస్యలు వస్తున్నాయి
వాటిని పరిష్కరించకుండా విభజన చేయడం సరికాదని వాదించాం
అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ నాయకులు.. కచ్చితంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని అన్నారు
ఏడాది దాటినా స్పెషల్ స్టేటస్ గానీ, ఇతర సమస్యలను గానీ పరిష్కరించడానికి కేంద్రం జోక్యం చేసుకోవట్లేదు దాన్ని ఖండిస్తున్నాం, పార్లమెంటులో కూడా ఖండిస్తాం
ప్రత్యేక హోదా కోసం మీ అందరితో కలిసి పార్లమెంటులోను, బయట రోడ్ల మీద పోరాడుతాం
ఈ ఉద్యమం మనది.. పార్లమెంటులో మాట్లాడేటప్పుడే చెప్పా.. దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని గురజాడ చెప్పారని అన్నాను
బ్రదర్ జగన్కి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ విషయంలో మా మద్దతు పూర్తిగా ఉంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement