
సాక్షి, న్యూఢిల్లీ : ఐదుకోట్ల మంది ఆంధ్రులకు అపర సంజీవని వంటి ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అలుపెరుగని పోరాటం కొనసాగుతూనే ఉంది. హోదా కోసం గర్జిస్తూ.. వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు ఢిల్లీలోని ఏపీ భవన్‌లో అంబేద్కర్ విగ్రహం సాక్షిగా చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష రెండోరోజుకు చేరుకుంది. విభజన హామీల విషయంలో కేంద్రంలోని ఎన్డీయే సర్కారు తీరును ఎండగడుతూ ఐదుగురు ఎంపీలు చేపట్టిన దీక్ష హస్తినలో హాట్‌టాపిక్‌గా మారింది. ఏపీ హక్కుల సాధన కోసం ఎంపీల చేపట్టిన ఈ దీక్షకు విశేష స్పందన లభిస్తోంది.
వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు చేపట్టిన దీక్షకు సీపీఎం మద్దతు పలికింది. ఎంపీల దీక్షాశిబిరాన్ని సందర్శించి సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంఘీభావం తెలిపారు. వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలతోపాటు దీక్షలో కూర్చొని.. వారికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనతో సమస్యలు వస్తాయని ముందే చెప్పామని తెలిపారు. ఆనాడు ఏపీకి ఐదేళ్లు కాదు పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని వెంకయ్యనాయుడు చెప్పారని, కానీ బీజేపీ సర్కారు ఆ హామీలను నెరవేర్చలేదని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment