సకల హంగులతో కూడిన దేశరాజధాని ఢిల్లీ కూడా లక్ష ఎకరాలు లేదని, టీడీపీ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన ఏపీ నూతన రాజధాని వ్యవహారమంతా రియల్ ఎస్టేట్ ప్రయోజనాలకోసమేనని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు సీతారం ఏచూరి అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో రైతులు చేస్తున్న పోరాటానికి పూర్తి మద్దతు తెలుపుతామని బుధవారం తనను కలిసిన ఏపీ రాజధాని ప్రాంత రైతులు, కూలీల పరిరక్షణ కమిటీ నాయకులు అంబటి రాంబాబు, లక్ష్మణరెడ్డికి హామీ ఇచ్చారు.
ఏపీ రాజధాని కోసం భూసేకరణ పూర్తిగా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుగుణంగా సాగుతోందని ఏచూరి అభిప్రాయపడ్డారు. బీజేపీ మినహా దేశంలోని పార్టీలన్నీ భూ సేకరణ ఆర్డినెన్స్ ను వ్యతిరేకిస్తున్నాయన్నారు.
లక్ష ఎకరాల రాజధాని దేశానికే లేదు!
Published Wed, Feb 25 2015 6:53 PM | Last Updated on Thu, Mar 28 2019 5:32 PM
Advertisement
Advertisement