సీతారాం ఏచూరి కన్నుమూత | CPM General Secretary Sitaram Yechury Passes Away At Age Of 72 | Sakshi
Sakshi News home page

Sitaram Yechury Death: సీతారాం ఏచూరి కన్నుమూత

Published Thu, Sep 12 2024 4:04 PM | Last Updated on Thu, Sep 12 2024 7:50 PM

CPM General Secretary Sitaram Yechury passes away at 72

న్యూఢిల్లీ: ప్రముఖ రాజకీయ వేత్త సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూశారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. 

కాగా 72 ఏళ్ల ఏచూరి.. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌తో ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన సంగతి తెలిసిందే. కొద్ది వారాలుగా ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్య పరిస్థితి పలుమార్లు విషమించింది. నేడు ఏచూరి ఆరోగ్యం మరింత క్షీణించి ప్రాణాలు విడిచారు. 

1952 ఆగష్టు 12న చెన్నైలో తెలుగు కుటుంబంలో జన్మించిన ఏచూరి.. బాల్యం మొత్తం హైదరాబాద్‌లో గడిపారు. హైదరాబాద్‌లోని ఆల్‌ సెయింట్స్‌ హైస్కూల్‌లో ప్రాథమిక విద్యను అభ్యసించారు. తండ్రి సర్వేశ్వర సోమయాజి ఏపీఎస్‌ ఆర్టీసీలో ఇంజినీర్‌ ఉద్యోగం, తల్లి కల్పకం ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేశారు. 1969 నాటి తెలంగాణ ఉద్యమంతో ఢిల్లీకి చేరిన ఏచూరి.. ఢిల్లీలోని ప్రెసిడెంట్స్‌ ఎస్టేట్‌ స్కూల్‌లో 12వ తరగతి పూర్తి చేశారు.

ప్రఖ్యాత సెయింట్‌ స్టీఫెన్స్‌ కాలేజీలో ఆర్థికశాస్త్రంలో బీఏ ఆనర్స్‌ చేశారు. జవహార్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీలో ఎమ్‌ఏ ఎకనామిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించారు. 1974లో స్టూడెంట్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో(ఎస్‌ఎఫ్‌ఐ) చేరారు.  1975 ఎమర్జెన్సీ సమయంలో అరెస్ట్‌ కావడంతో చదవుకు ఫుల్‌స్టాఫ్‌ పెట్టారు.

 సీతారాం ఏచూరి  కన్నుమూత
  • 1975లో సీపీఎం ప్రాథమిక సభ్యత్వం తీసుకున్న ఏచూరి

  • ఎమర్జెన్సీ సమయంలో అండర్‌ గ్రౌండ్‌కు వెళ్లిన సీతారాం

  • ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత మూడుసార్లు జేఎన్‌య నాయకుడిగా ఎన్నిక

  • 1992లో సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడిగా నమోదు
  • ఉమ్మడి ఏపీ సీఎస్‌ మోహన్‌ కందాకు ఏచూరి మేనల్లుడు

  • 1984లో సీపీఎం కేంద్ర కమిటీలోకి వెళ్లిన ఏచూరి

  • 1985లో పార్టీ రాజ్యాంగ సవరణలో కీలక పాత్రం

  • ఇంద్రాణి మజుందార్‌తో ఏచూరికి వివాహం

  • కూతురు అఖిలా ఏచూరి, కొడుకు ఆశిష్‌ ఏచూరి

  • జర్నలిస్టు సీమా చిశ్తీని రెండో వివాహం చేసుకున్న ఏచూరి

  • 1992లో జరిగిన 14వ కాంగ్రెస్‌లో పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ప్రమోషన్‌

  • 1996 యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వంలో కీలకపాత్ర

  • 2005 నుంచి 2017 వరకు పశ్చిమ బెంగాల్‌ నుంచి రాజ్యసభ ఎంపీగా ప్రాతినిథ్యం

  • రచయితగా హిందూస్థాన్‌ టైమ్స్‌లో లెఫ్ట్‌ హ్యాండ్‌ డ్రైవ్‌ కాలమ్‌

  • 20 ఏళ్లుగా పార్టీ పత్రిక పీపుల్స్‌ డెమోక్రసీ ఎడిటోరియల్‌ బోర్డు మెంబర్‌

  • 2004లో యూపీఏ సంకీర్ణ ప్రభుత్వ నిర్మాణంలోనూ ముఖ్య పాత్ర

  • 2005 నుంచి 2015 వరకు వరుసగా మూడుసార్లు ప్రధాన కార్యదర్శి

  • 2015, 2018, 2022లో సీపీఎం జనరల్‌ సెక్రటరీగా ఎన్నిక

  • ‘క్యాస్ట్‌ అండ్‌ క్లాస్‌ ఇన్‌ ఇండియన్‌ పాలిటిక్స్‌ టుడే’, ‘సోషలిజం ఇన్‌ ఛేంజింగ్‌ వరల్డ్‌’, ‘మోదీ గవర్నమెంట్‌: న్యూ సర్జ్‌ ఆఫ్‌ కమ్యూనలిజం’, ‘కమ్యూనలిజం వర్సెస్‌ సెక్యులరిజం’ వంటి పుస్తకాలు రాశారు.

  • అనారోగ్యంతో ఆగష్టు 19న ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన ఏచూరి

  • చికిత్స పొందుతూ సెప్టెంబర్‌ 12న కన్నుమూత

  • జీవితంతం లెఫ్ట్‌ బావజాలంతో గడిపిన ఏచూరి
     

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement