సాక్షి,న్యూఢిల్లీ: వివాదాస్పద బీజేపీ నేత కపిల్ మిశ్రా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసులో జేఎన్‌యూ విద్యార్థి నేత, ఉమర్ ఖలీద్‌ను పోలీసులు అరెస్ట్ చేయడంపై ఢిల్లీ పోలీసులను అభినందిస్తూ సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాదు ఉమర్, తాహిర్ హుస్సేన్ వంటి నేరస్థులను ఉరితీయడం ఖాయమని తాను పూర్తిగా నమ్ముతున్నానంటూ వ్యాఖ్యానించారు. ఈ మేరకు కపిల్ మిశ్రా వీడియో మెసేజ్ సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. (ఢిల్లీ అల్లర్లు : అరెస్టుల ప్రక్రియ షూరూ)
ఫిబ్రవరి 2020 లో ఢిల్లీలో జరిగిన హింస ముంబై 26/11ఉగ్రవాద దాడికి సమానమని మిశ్రా పేర్కొన్నారు. ఢిల్లీలో ఒక పథకం ప్రకారం జరిగిన పెద్ద కుట్ర అని, హింసాత్మకు అల్లర్లకు, దాడులకు ఉమర్, తాహిర్, తదితరులు ప్రయత్నించారనీ, దుకాణాలను తగుల బెట్టి, ప్రజలను మట్టుపెట్టేందుకు చూశారని ఆరోపించారు. ఇలాంటి ఉగ్రవాదులను జీవిత ఖైదు చేసి, ఉరితీస్తారన్నారు. ఢిల్లీ పౌరులు న్యాయం కోసం ఎదురుచూస్తున్నారని వ్యాఖ్యానించారు. కాగా పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా నిరసనోద్యమం సందర్భంగా చోటుచేసుకున్న అల్లర్ల కేసులో ఉమర్ ఖలీద్‌ను ఉపా చట్టం కింద ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇతనిపై గతంలోనే ఎఫ్ఐఆర్ నమోదైంది. (ఢిల్లీ అల్లర్లు : చార్జిషీట్‌లో పలువురు ప్రముఖులు)
#JUSTIN: BJP leader Kapil Mishra’s reaction on the arrest of former JNU student leader #UmarKhalid. @IndianExpress, @ieDelhi pic.twitter.com/EYomJaER6t
— Mahender Singh Manral (@mahendermanral) September 14, 2020
Comments
Please login to add a commentAdd a comment