kapil misra
-
‘ఉమర్ ఖలీద్‌ను ఉరి తీయడం ఖాయం’
సాక్షి,న్యూఢిల్లీ: వివాదాస్పద బీజేపీ నేత కపిల్ మిశ్రా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసులో జేఎన్‌యూ విద్యార్థి నేత, ఉమర్ ఖలీద్‌ను పోలీసులు అరెస్ట్ చేయడంపై ఢిల్లీ పోలీసులను అభినందిస్తూ సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాదు ఉమర్, తాహిర్ హుస్సేన్ వంటి నేరస్థులను ఉరితీయడం ఖాయమని తాను పూర్తిగా నమ్ముతున్నానంటూ వ్యాఖ్యానించారు. ఈ మేరకు కపిల్ మిశ్రా వీడియో మెసేజ్ సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. (ఢిల్లీ అల్లర్లు : అరెస్టుల ప్రక్రియ షూరూ) ఫిబ్రవరి 2020 లో ఢిల్లీలో జరిగిన హింస ముంబై 26/11ఉగ్రవాద దాడికి సమానమని మిశ్రా పేర్కొన్నారు. ఢిల్లీలో ఒక పథకం ప్రకారం జరిగిన పెద్ద కుట్ర అని, హింసాత్మకు అల్లర్లకు, దాడులకు ఉమర్, తాహిర్, తదితరులు ప్రయత్నించారనీ, దుకాణాలను తగుల బెట్టి, ప్రజలను మట్టుపెట్టేందుకు చూశారని ఆరోపించారు. ఇలాంటి ఉగ్రవాదులను జీవిత ఖైదు చేసి, ఉరితీస్తారన్నారు. ఢిల్లీ పౌరులు న్యాయం కోసం ఎదురుచూస్తున్నారని వ్యాఖ్యానించారు. కాగా పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా నిరసనోద్యమం సందర్భంగా చోటుచేసుకున్న అల్లర్ల కేసులో ఉమర్ ఖలీద్‌ను ఉపా చట్టం కింద ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇతనిపై గతంలోనే ఎఫ్ఐఆర్ నమోదైంది. (ఢిల్లీ అల్లర్లు : చార్జిషీట్లో పలువురు ప్రముఖులు) #JUSTIN: BJP leader Kapil Mishra’s reaction on the arrest of former JNU student leader #UmarKhalid. @IndianExpress, @ieDelhi pic.twitter.com/EYomJaER6t — Mahender Singh Manral (@mahendermanral) September 14, 2020 -
‘సీఎం నివాసాన్నీ ఖాళీ చేయిస్తారు’
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలోని షహీన్‌బాగ్‌లో సీఏఏ వ్యతిరేక ఆందోళనల వెనుక పాలక ఆప్ ప్రమేయం ఉందని బీజేపీ నేత కపిల్ మిశ్రా ఆరోపించారు. ఆప్ సర్కార్ గత ఐదేళ్లలో ఆస్పత్రులు, ఫ్లైఓవర్లు, కాలేజీలు, రోడ్లు నిర్మిస్తే షహీన్‌బాగ్‌ను నిర్మించే అవసరం లేకపోయేదని వ్యాఖ్యానించారు. ఆప్ షహీన్‌బాగ్‌ను ప్రేరేపిస్తే ఢిల్లీ ప్రజలు షహీన్‌బాగ్‌తో పాటు సీఎం నివాసాన్నీ ఖాళీ చేయిస్తారని మిశ్రా ట్వీట్ చేశారు. కాగా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీ ఫిబ్రవరి 8న ఇండియా, పాకిస్తాన్ల పోరును తలపిస్తుందని కపిల్ మిశ్రా చేసిన వ్యాఖ్యలను ఈసీ తీవ్రంగా పరిగణించింది. మిశ్రాను 48 గంటల పాటు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని ఆదేశించింది. ఫిబ్రవరి 8న జరిగే ఢిల్లీ ఎన్నికల్లో ఆప్, బీజేపీ, కాంగ్రెస్‌లు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఆప్, బీజేపీల మధ్య ప్రధాన పోటీ నెలకొనడంతో ఇరు పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. చదవండి : కపిల్ మిశ్రాపై 48 గంటల నిషేధం -
కపిల్ మిశ్రా స్టుపిడ్: సునీత కేజ్రీవాల్
న్యూఢిల్లీ: మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురైన కపిల్ మిశ్రాపై ఆప్ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీత కూడా విమర్శలు ఎక్కుపెట్టారు. మిశ్రా ‘స్టుపిడ్’ అని సంభోదించిన ఆమె... తన మరది ఇక లేరంటూ వ్యాఖ్యానించారు. ఈ మేరకు సునీత కేజ్రీవాల్ ట్విట్ చేశారు. కాగా అరవింద్ కేజ్రీవాల్ తన కళ్లముందు మంత్రి సత్యేంద్రజైన్ నుంచి రూ.2 కోట్లు తీసుకున్నారంటూ కపిల్ మిశ్రా ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కేజ్రీవాల్ బంధువుల భూవివాదాన్ని రూ. 50 కోట్లకు సెటిల్ చేసినట్లు సత్యేంద్రజైన్ వ్యక్తిగతంగా తనకు చెప్పారంటూ కపిల్ మిశ్రా బాంబు పేల్చారు. ఈ నేపథ్యంలో సునీత కేజ్రీవాల్ స్పందిస్తూ ‘కపిల్ కు తలకాయ లేదు. ఆయన రాసిన స్క్రిప్ట్ చదువుతున్నారు. మంత్రి వర్గం నుంచి తొలగించారన్న అక్కసుతోనే మిశ్రా అర్థం లేని విమర్శలు చేస్తున్నారు. సుప్టిడ్ మెన్’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు. My brother in law is no more n this stupid man is speaking all written script without any mind. — Sunita Kejriwal (@KejriwalSunita) 8 May 2017 కాగా కేజ్రీవాల్ సొంత బావమరిది సురేంద్ర కుమార్ బన్సల్ నకిలీ బిల్లులు, ఇన్వాయిస్లు సమర్పించి ప్రజాపనుల శాఖ నుంచి భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సీట్ల కేటాయింపులోనూ ఆయన డబ్బులు డిమాండ్ చేసినట్లు విమర్శలు వెల్లువెత్తాయి. అయితే సురేంద్ర కుమార్ షుగర్ లెవల్స్ పెరగడంతో గుర్గావ్ ఆస్పత్రిలో మృతి చెందిన విషయం తెలిసిందే.