
కన్నయ్య కుమార్ (ఫైల్ ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో దేశ వ్యతిరేక నినాదాలు చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు కన్నయ్య కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టనుంది. తమపై ఆరోపణలు చేస్తూ యూనివర్సిటీ ఉన్నత స్థాయి కమిటీ చేసిన సిఫారసులను, తమకు విధించిన జరిమానాను రద్దు చేయాలని కోరుతూ కన్నయ్య కుమార్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సిద్ధార్ధ ముద్రుల్ విచారించనున్నారు.
సీపీఐ విద్యార్థి విభాగానికి చెందిన కన్నయ్య కుమార్, యూనివర్సిటీ విద్యార్థులు ఉమర్ ఖలీద్, బట్టాచార్యలు 2016లో దేశ సమగ్రత దెబ్బతినే విధంగా నినాదాలు చేశారన్న ఆరోపణలపై యూనివర్సిటీ క్రమశిక్షణ ఉల్లంఘనపై వారికి జరిమానా విధించిన విషయం తెలిసిందే. దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని ఆరోపణలతో వారిని పోలీసులు అరెస్ట్ చేయగా.. బెయిల్‌పై బయట వచ్చారు. 1860లో రూపొందించిన చట్టాలతో యూనివర్సిటీ విద్యార్థులను వేధింపులకు గురి చేయడం సరికాదని, విద్యార్థి సంఘాల నేతలు కన్నయ్య కుమార్‌కు మద్దతు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment