దేశ వ్యతిరేక నినాదాలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న జేఎన్‌యూ విద్యార్థులపై నగరంలోని సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
దేశ వ్యతిరేక నినాదాలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న జేఎన్‌యూ విద్యార్థులపై నగరంలోని సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రు యూనివర్సిటీ విద్యార్థి కన్హయ్య, ఉమర్‌ఖలీద్ సహా తొమ్మిది మంది విద్యార్థులపై సరూర్‌నగర్ పోలీసులు 124, 124ఏ, 156, 3సీఆర్పీసీ కింద ఆదివారం కేసు నమోదు చేశారు. ఎల్బీనగర్ కోర్టులో జనార్ధన్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటీషన్ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.