Kanhaya
-
భావప్రకటనా స్వేచ్ఛ మీకేనా?: నారాయణ
సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటనా స్వేచ్ఛ బీజేపీకో, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడికో పరిమితం కాదని సీపీఐ కేంద్ర కార్యదర్శివర్గ సభ్యుడు కె.నారాయణ ధ్వజమెత్తారు. వర్సిటీల ప్రాంగణాల్లో రాజకీయం వద్దని చెబుతున్న వెంకయ్య తన గతాన్ని ఓసారి గుర్తుకు తెచ్చుకోవాలని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతల వ్యాఖ్యలు చూస్తుంటే భావప్రకటన అంటే ‘అదేదో వారి గుత్తసొత్తు’గా ఉన్నట్టు అర్థమవుతుందని విమర్శించారు. కన్హయ్యను చూస్తే బెదురెందుకు?: రామకృష్ణ సాక్షి, విజయవాడ బ్యూరో: కేంద్రంలో అధికారం ఉందని విర్రవీగుతున్న బీజేపీకి జేఎన్‌యూ విద్యార్థి నేత కన్హయ్యను చూస్తే భయమెందుకని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడిని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రశ్నించారు. కమ్యూనిజంలో నిజాలు లేవని, వారి గురించి మాట్లాడడం అనవసరమని రెండు రోజుల క్రితం విజయవాడ సభలో వెంకయ్య వ్యాఖ్యానించడాన్ని రామకృష్ణ ఆదివారం ఒక ప్రకటనలో తప్పుబట్టారు. కన్హయ్యకుమార్ సభలను చూసి జడిసి, సిద్ధార్థ అకాడమీలో సభకు అనుమతిని వెంకయ్య రద్దు చేయించారన్నారు. -
కన్హయ్యకుమార్పై బూట్ల దాడి
సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఓ సదస్సులో ఘటన {పసంగం ప్రారంభంలో బూట్లు విసిరిన వ్యక్తి అడ్డుకుని చితకబాదిన వామపక్షాల కార్యకర్తలు, విద్యార్థులు.. ఇద్దరి అరెస్టు హైదరాబాద్: జేఎన్‌యూ విద్యార్థి నేత కన్హయ్య కుమార్‌పై ఓ వ్యక్తి బూట్లు విసిరి దాడికి యత్నించాడు. దేశద్రోహి కన్హయ్యకు మాట్లాడే హక్కులేదంటూ నినాదాలు చేశాడు. అతను విసిరిన బూట్లు కన్హయ్య మీద కాకుండా.. అక్కడే ఉన్న వీడియో జర్నలిస్టుల మీద పడ్డాయి. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గురువారం రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సదస్సులో కన్హయ్య ప్రసంగం ప్రారంభించిన కొద్దిసేపటికే ఈ ఘటన చోటుచేసుకుంది. దాడికి పాల్పడిన వ్యక్తిని గోరక్షాదళ్ రాష్ట్ర అధ్యక్షుడిగా చెప్పుకొం టున్న అంతారం నరేశ్ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. అతడిని, అతడితోపాటు వచ్చిన పవన్‌రెడ్డి అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ‘‘మిత్రులారా క్షమించండి. నాకు తెలుగు రాదు. తెలుగులో ‘గారు’ పదం ఒక్కటే తెలుసు. మీరందరూ నాకు గారు..’’ అంటూ కన్హయ్య హిందీలో ప్రసంగం ప్రారంభించారు. ఇంతలోనే ప్రేక్షకుల్లోంచి లేచిన నరేశ్ ఆయన వైపు రెండు బూట్లు విసిరాడు. దీంతో సదస్సులో కలకలం రేగింది. సమీపంలో కూర్చున్న కొందరు వ్యక్తులు నరేశ్‌ను అడ్డుకుని ప్రతిదాడికి దిగారు. ఆగ్రహంతో పిడిగుద్దులు కురిపించారు. అతడికి ఎలాంటి హానీ చేయకుండా వదిలేయాలని కన్హయ్య కోరారు. నరేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐదు నిమిషాల అనంతరం సదస్సు తిరిగి ప్రారంభమైంది. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టు మల్లేపల్లి లక్ష్మయ్య అక్కడున్న వారిని శాంతింపజేశారు. అల్లరి చేయడానికి ప్రయత్నిస్తారని, ఇంకా ఎవరైనా ఉంటే వారినీ లేచి, మాట్లాడనీయాలన్నారు. తమకు సమాధానం చెప్పే సత్తా, దమ్ము, ధైర్యం ఉన్నాయని.. ఎవరినీ ఏమీ అనవద్దంటూ వామపక్షాల కార్యకర్తలు,విద్యార్థులను శాంతింపజేశారు. గాడ్సే దేశంగా ఎప్పటికీ మారదు: కన్హయ్య అంతరాయం అనంతరం కన్హయ్యకుమార్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఇది గాంధీ పుట్టిన దేశమని, గాడ్సే మందిరంగా ఎప్పటికీ మారదన్నారు. ఎవరు భయపెట్టినా భయపడనని, వంగదీస్తే వంగిపోనని వ్యాఖ్యానించారు. ‘‘వర్సిటీలో వెళ్లకుండా అడ్డుకుంటే రోహిత్ మాట ఎత్తనని అనుకుంటున్నారు. సదస్సులో చెప్పులతో కొడితే మాట్లాడకుండా ఉంటానని అనుకుంటున్నారు. భాయ్ సాబ్.. భయపడే వాళ్లం కాదు. ఏమైనా చేసుకోండి. మాట్లాడే స్వేచ్ఛ కోసం సంఘర్షిస్తున్నాం. మీరేమైనా చేస్తే అది మాకు ప్రచారాన్ని తెచ్చిపెడుతుంది. ఇందుకు ప్రధాని మోదీకి, పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా...’’ అని పేర్కొన్నారు. అగ్రకులాల వాళ్లు ఇళ్లు ఇవ్వకపోవడంతో అంబేడ్కర్ అబద్ధమాడి ఇళ్లు తీసుకునేవారని, దళితుడని తెలిసిన తర్వాత వారు ఆయన సామాన్లను బయటకి విసిరేసేవారని కన్హయ్య చెప్పారు. అయినా అంబేడ్కర్ ఆగ్రహానికి గురయ్యేవారు కాదని, అరవడం, కొట్టడం వంటివి చేసేవారు కాదని... అంబేడ్కర్‌ను నమ్మేవారైతే అరవడం, కొట్టడం చేయకూడదని పేర్కొన్నారు. సహనాన్ని కోల్పోవద్దని సూచించారు. హెచ్‌సీయూ వద్ద రాయి విసిరినా, జేఎన్‌యూలో చెంపదెబ్బ కొట్టినా, ఇప్పుడు బూట్లు విసిరినా సదరు వ్యక్తులతో తనకు బాధేమీ కలగలేదని పేర్కొన్నారు. -
స్మృతి.. తప్పుకోవాలి
కన్హయ్య డిమాండ్.. ఢిల్లీలో జేఎన్‌యూ భారీ ర్యాలీ న్యూఢిల్లీ: రాజద్రోహం కేసులో అరెస్టయిన విద్యార్థులు ఖాలిద్, అనిర్బన్‌ల విడుదల కోరుతూ.. జేఎన్‌యూ విద్యార్థులు ఢిల్లీలో భారీ ర్యాలీ నిర్వహించారు. తర్వాత జంతర్‌మంతర్ వద్ద సభను ఏర్పాటు చేశారు. ‘విద్యాసంస్థలను లక్ష్యంగా చేసుకుంటున్న కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ రాజీనామా చేయాలి. మీవి మొసలి కన్నీళ్లు, మీ నవ్వు, ఏడుపు అన్నీ అబద్ధాలే’ అని ఈ సందర్భంగా కన్హయ్య అన్నారు. కాగా, వేదిక సమీపంలో నలుగురు యువకులు కన్హయ్యపై దాడికి ప్రయత్నించగా పోలీసులు వీరిని అరెస్టు చేశారు. కాగా, రాజద్రోహం కేసులో బెయిల్‌పై వచ్చిన కన్హయ్య.. నిబంధలనకు విరుద్ధంగా విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన బెయిల్ రద్దుచేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. బుధవారం ఈ కేసును విచారించనుంది. కాగా, దేశ వ్యతిరేక నినాదాల విషయంలో జేఎన్‌యూ నుంచి కన్హయ్య, ఖాలిద్, అనిర్బన్‌తోపాటు 21మంది విద్యార్థులను బహిష్కరించటంపై వారినుంచి సమాధానం వచ్చాకే నిర్ణయం తీసుకుంటామని యూనివర్సిటీ ఏర్పాటుచేసిన అత్యున్నత స్థాయి కమిటీ తేల్చింది. ఖాలిద్, అనిర్బన్ వర్సిటీలో సామరస్య వాతావరణం చెడిపోయేందుకు కారణమయ్యారని స్పష్టం చేసింది. అయితే.. నోటీసులందుకున్న విద్యార్థులందరూ చర్చించాకే.. నోటీసులకు సమాధానం ఇవ్వాలా వద్దా అనే అంశాన్ని నిర్ణయిస్తామని విద్యార్థులు తెలిపారు. మరోవైపు, రాజద్రోహం కేసులో బెయిల్ ఇవ్వాలంటూ.. ఖాలిద్, అనిర్బన్ పెట్టుకున్న పిటిషన్‌ను బుధవారం ఢిల్లీ కోర్టు విచారించనుంది. ఈ ఇద్దరి జ్యుడీషియల్ రిమాండును మార్చి 29 వరకు పొడిగించింది. -
కన్హయ్యపై సరూర్‌నగర్‌లో పీఎస్‌లో కేసు నమోదు
దేశ వ్యతిరేక నినాదాలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న జేఎన్‌యూ విద్యార్థులపై నగరంలోని సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రు యూనివర్సిటీ విద్యార్థి కన్హయ్య, ఉమర్‌ఖలీద్ సహా తొమ్మిది మంది విద్యార్థులపై సరూర్‌నగర్ పోలీసులు 124, 124ఏ, 156, 3సీఆర్పీసీ కింద ఆదివారం కేసు నమోదు చేశారు. ఎల్బీనగర్ కోర్టులో జనార్ధన్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటీషన్ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
రేపు మహాధర్నా
కన్హయ్య విడుదల కోరుతూ వామపక్షాలు, ప్రజా, విద్యార్థి సంఘాల పిలుపు సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగ హక్కులను పరిరక్షించాలని, జేఎన్‌యూ విద్యార్థిసంఘం నేత కన్హయ్యకుమార్పై పెట్టిన దేశద్రోహం కేసును ఉపసంహరించి ఆయన్ను బేషరతుగా విడుదల చేయాలని వామపక్షాలు, ప్రజా, విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశా రు. పటియాలా కోర్టులో జర్నలిస్టులు, విద్యార్థులు, లాయర్లపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, వర్సిటీ ల్లో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఎలాంటి జోక్యం చేసుకోవద్దని, హెచ్‌సీయూ స్కాలర్ రోహిత్ ఆత్మహత్య ఉదంతంలో వీసీని తొలగించాలని కోరారు. కన్హయ్యను విడుదల చేయాలని, రాజ్యాంగ హక్కులను పరిరక్షించాలనే డిమాండ్లతో గురువారం ఇందిరాపార్కు వద్ద పది వామపక్షాలు, వివిధ ప్రజా, విద్యార్థి సంఘా లు తలపెట్టిన మహా ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మంగళవారం మఖ్దూం భవన్లో మహాధర్నా పోస్టర్‌ను తమ్మినేని వీరభద్రం, జి.రాములు(సీపీఎం), చాడ వెంకటరెడ్డి, సుధాకర్(సీపీఐ), వేములపల్లి వెంకటరామయ్య, ఝాన్సీ(న్యూడెమొక్రసీ-రాయల), జానకిరాములు, గోవింద్ (రెవల్యూషనరీ సోషలిస్టు పార్టీ), మురహరి(ఎస్‌యూసీఐ), నరేందర, శ్రీనివాస్ (ఫార్వర్డ్‌బ్లాక్),కిరణ్, అనురాధ(ఐఎఫ్‌టీ యూ), ప్రదీప్(పీడీఎస్‌యూ),హన్మేష్(పీవైఎల్),రచయిత కాలువ మల్లయ్యలు విడుదల చేశారు. ఈ సంద ర్భంగా తమ్మినేని, చాడ మాట్లాడుతూ... బీజేపీ, సంఘ్‌పరివార్ శక్తుల దాడులకు వ్యతిరేకంగా మేధావులు, కవులు, కళాకారులు కలసి వచ్చి ధర్నాను విజయవంతం చేయాలని కోరా రు. ఛాందస, అభివృద్ధి నిరోధక ఆలోచనలు విస్తృతంగా ప్రచారంలోకి తేవడానికి బీజేపీ భావజాలం గట్టిగా పనిచేస్తుండగా, టీఆర్ఎస్, సీఎం కేసీఆర్ దానికి మద్దతునిస్తున్నారన్నారు. బీజేపీతో అవగాహన కుదుర్చుకుని, కేంద్రం కేబినెట్లో చేరేందుకు టీఆర్ఎస్ ఉవ్విళ్లూరుతోందన్నారు. అందుకే జేఎన్‌యూ పరిణామాలపై ప్రభుత్వం నోరు మెదపలేదన్నారు.