JNU Student leader
-
‘కశ్మీర్ గాజా కాదు.. ఆ ఘనతంతా ప్రధాని మోదీదే’
కశ్మీర్ గాజా కాదని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ మాజీ విద్యార్థి నాయకురాలు షీహ్లా రషిద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏఎన్ఐ వార్తా సంస్థతో ఆమె మాట్లాడుతూ గతంలో కశ్మీర్లో రాళ్లు రువ్విన ఉద్యమకారులకు మద్దతుగా నిలిచిన ఆమె ఇప్పుడిలా కశ్మీర్ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడటంపై అడిగిన ప్రశ్నకు ఇలా బదులిచ్చారు. ‘అవును అది 2010లో. అప్పుడు ఉద్యమకారులకు మద్దతివ్వడం వాస్తవమే. కానీ ఈ రోజు పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది. కశ్మీర్ గాజా కాదని స్పష్టమైంది’ అని షీహ్లా రషిద్ పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్లో వచ్చిన మార్పులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా విధానాలే కారణమని ప్రశంసించారు. రక్తపాతాలు లేకుండా అక్కడి ఉద్రిక్తతలకు వారు రాజకీయ పరిష్కారాన్ని చూపించారని పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్లో పరిస్థితిని రషీద్ ప్రశంసించడం ఇది మొదటిసారి కాదు. 2019 ఆగస్టు 5న జమ్మూ కశ్మీర్ స్వయంప్రతిపత్తిని రద్దు చేస్తూ మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని, రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడాన్ని తీవ్రంగా విమర్శించిన రషీద్.. ఆ తర్వాత మోదీ ప్రభుత్వాన్ని ప్రశంసించారు. కశ్మీర్లో మానవ హక్కుల పరిస్థితిని మెరుగుపరచడంలో కేంద్ర ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ కృషి చేశారంటూ అభినందించారు. -
ఢిల్లీ అల్లర్ల కేసులో నిర్దోషిగా ఉమర్ ఖలిద్!
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో 2020లో జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించిన రాళ్ల దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జేఎన్‌యూ స్టూడెంట్స్ యూనియన్ మాజీ లీడర్ ఉమర్ ఖలిద్‌ను నిర్దోషిగా తేల్చింది ఢిల్లీ కోర్టు. అతడితో పాటు మరో విద్యార్థి నాయకుడు ఖలిద్ సైఫీపై ఉన్న అభియోగాలను కొట్టివేసింది కర్కార్దూమా కోర్టు. అయితే, చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ) కేసులో బెయిల్ రానందున వారు జుడీషియల్ కస్టడీలోనే కొనసాగనున్నారు. ఈశాన్య ఢిల్లీలో 2020లో జరిగిన అల్లర్లపై ఉమర్ ఖలిద్పై ఖాజురి ఖాస్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఛాంద్బాగ్ ప్రాంతంలో అల్లరి మూకలు చేరిన సమయంలో అక్కడే ఉన్న కానిస్టేబుల్ వాంగ్మూలం మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. ఆ సమయంలో తనను తాను రక్షించుకునేందుకు ఓ షెల్టర్‌లో తలదాచుకున్నట్లు తెలిపాడు కానిస్టేబుల్. స్థానికులపై దాడి చేయటం, వాహనాలకు నిప్పుపెట్టడం వంటి హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారని పేర్కొన్నాడు. ఈ క్రమంలో 2020, సెప్టెంబర్‌లో ఉమర్ ఖలిద్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుపై విచారణ జరిపిన అదనపు సెషన్స్ కోర్టు జడ్జీ పులస్త్యా ప్రమాచల్.. ఈ మేరకు నిర్దోషిగా తేలుస్తూ తీర్పు చెప్పారు. అల్లర్లు జరిగినప్పుడు వారు అందులో పాల్గొన్నట్లు సరైన ఆధారాలు లేనందున వారిపై కేసును కొట్టివేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ వివరాలను ఖలిద్ సైఫీ తరఫు న్యాయవాది రెబ్బెకా జాన్ వెల్లడించారు. కోర్టు తీర్పు పూర్తి స్థాయి ఆదేశాలు అందాల్సి ఉందన్నారు. ఇదీ చదవండి: బెంగాల్లో ముందస్తు ఎన్నికలు.. హింట్ ఇచ్చిన బీజేపీ! -
కాంగ్రెస్ టాలెంట్ హంట్.. యువ నేతలపై వల
న్యూఢిల్లీ: వలసలు, వరుస పరాజయాలతో కుదేలైన కాంగ్రెస్ పార్టీ కొత్త జవసత్వాలు కూడగట్టుకునే పనిలో పడింది. యువ తరమే పార్టీని బలోపేతం చేస్తుందని భావిస్తున్న అధిష్టానం ఆ దిశగా వ్యూహాలు రచిస్తోంది. ఇటీవల కాలంలో జ్యోతిరాదిత్య సింధియా, జితిన్ ప్రసాద, సుస్మితా దేవ్, ప్రియాంక చతుర్వేది వంటి యువనేతలు పార్టీని వీడి వెళ్లిపోవడంతో ఆ లోటుని భర్తీ చేయాలని చూస్తోంది. ఇదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తీవ్రంగా వ్యతిరేకించి ప్రజల్లో తమకంటూ ఒక ఇమేజ్‌ని ఏర్పాటు చేసుకున్న జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ నాయకుడు, సీపీఐ నేత కన్హయ్య కుమార్, గుజరాత్ స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేష్ మేవాని వంటి నాయకుల్ని కాంగ్రెస్ అక్కున చేర్చుకోవాలని చూస్తోంది. మోదీకి ఎదురొడ్డి.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఎదిరించి ప్రజల్లోకి బాగా దూసుకువెళ్లిన నాయకుల్లో కన్హయ్య కుమార్ ఒకరు. విద్యార్థి సంఘం నాయకుడిగా కేంద్రంపై ఆయన సంధించే ఒక్కో మాట తూటాలా పేలేది. ఆయన ప్రసంగాలు యువతలో స్ఫూర్తిని నింపాయి. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు సీపీఐలో చేరిన కన్హయ్య కుమార్ బెగుసరాయ్ స్థానం నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి గిరిరాజ్ సింగ్ చేతిలో ఓడిపోయారు. అప్పట్నుంచి పెద్దగా వార్తల్లోకి రాని ఆయన వచ్చే బిహార్ అసెంబ్లీ ఎన్నికల సమయానికి బలమైన రాజకీయ శక్తిగా ఎదగాలని భావిస్తున్నారు. లెఫ్ట్ పారీ్టలో ఉంటే రాజకీయ భవిష్యత్ ఉండదని అనుకుంటున్న కన్హయ్య కుమార్ కాంగ్రెస్‌లో చేరాలని భావిస్తున్నట్టు ఆయన సన్నిహితులు చెప్పారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాందీని మంగళవారం కన్హయ్య కుమార్ కలుసుకొని చర్చించినట్టుగా పార్టీ వర్గాలు తెలిపాయి. బిహార్ అసెంబ్లీ ఎన్నికలకి ఇంకా సమయం ఉన్నప్పటికీ కన్హయ్య కుమార్ ఎక్కడికి వెళ్లినా జనాన్ని ఆకర్షించే శక్తి ఉన్న నాయకుడు. ఆయన సభలకు యువత భారీగా తరలి వస్తుంది. అందుకే వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కన్హయ్య కుమార్‌ని ప్రచార బరిలో దింపాలని కాంగ్రెస్ భావిస్తున్నట్టు సమాచారం. బిహార్ ఎన్నికల నాటికి ఆయనను కాంగ్రెస్ పారీ్టలో కొత్త శక్తిగా తీర్చిదిద్దాలని అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. గుజరాత్లో నాయకత్వ సమస్య గుజరాత్ స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేష్ మేవాని సైతం కాంగ్రెస్ అధిష్టానంతో టచ్‌లో ఉన్నారు. గత ఎన్నికల్లో జిగ్నేష్ మేవాని పోటీ చేసిన వడ్గమ్ నియోజకవర్గంలో తమ అభ్యర్థిని దింపకుండా ఆయన విజయానికి కాంగ్రెస్ పరోక్షంగా సహకరించింది. వచ్చే ఏడాది గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జిగ్నేష్ మేవాని కాంగ్రెస్‌లో చేరడం వల్ల పార్టీకి బలం చేకూరుతుందనే అభిప్రాయం వినిపిస్తోంది. సీనియర్ నాయకుడు అహ్మద్ పటేల్, యువ నాయకుడు రాజీవ్ సతావ్ మరణానంతరం కాంగ్రెస్ పార్టీ గుజరాత్లో నాయకత్వ సమస్యలను ఎదుర్కొంటోంది. జిగ్నేష్ మేవాని పారీ్టలో చేరితే శక్తిమంతమైన దళిత నాయకుడి అండ పార్టీకి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
ఫైర్ బ్రాండ్ మరో మమత
మమతా బెనర్జీతో ఏ అమ్మాయినీ పోల్చలేం. 15 ఏళ్ల వయసుకే మమత రాజకీయాలోకి వచ్చారు. వచ్చీ రావడంతోనే విజేతగా నిలిచారు! మమత లోపల ఉన్న ఫైర్‌తో మాత్రం ప్రతి అమ్మాయినీ రిలేట్ చెయ్యొచ్చు. ఇంటి దగ్గర మనం రోజూ చూసే అమ్మాయిని, జేఎన్‌యు స్టూడెంట్ లీడర్ ఐషీ ఘోష్‌ని కూడా! 26 ఏళ్ల ఐషీ ఇప్పుడు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతోంది! మే 2 న వెలువడే ఎన్నిక ఫలితాలలో జమూరియా నియోజకవర్గం నుంచి సి.పి.ఐ (ఎం) అభ్యర్థి ఐషీ గెలిచినట్లు వార్త వస్తే కనుక భవిష్యత్తులో ఏనాటికైనా ఒకరోజు దేశ ప్రజలు.. ‘‘పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఐషీ ఘోష్ నేడు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు’’ అనే వార్తనూ వినబోతారు! మరీ టూ మచ్ అనిపిస్తే కనుక.. ఆ నిప్పును కొంచెం తాకి చూస్తే ఐషీ హౌమచ్చో తెలుస్తుంది. జేఎన్యులో ప్రస్తుతం పొలిటికల్ ఫిలాసఫీలో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్న ఐషీలోని ’చప్పున అంటుకునే’ గుణం గల చైతన్యశీలతే ఆమెను రాజకీయాల్లోకి రప్పిస్తోంది! 3ఎనిమిది విడతల్లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికి మూడు విడతలకే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయింది. అయితే ఈ నెలాఖరుకు గానీ నోటిఫికేషన్ విడుదల కాని ఏడో విడత ఎన్నికలపై పశ్చిమ బెంగాల్‌తో పాటు, ఢిల్లీ కూడా ప్రత్యేకంగా దృష్టి సారించింది. అందుకు కారణం ఏడో విడత ఎన్నికల్లో పోలింగ్ జరిగే జమూరియా నియోజకవర్గం నుంచి జేఎన్‌యు విద్యార్థి సంఘం ప్రస్తుత అధ్యక్షురాలు ఐషీ ఘోష్ పోటీకి నిలబడటం! ఆమె సీపీఐ (ఎం) తరఫున పోటీ చేయబోతున్నప్పటికీ, ఏ పార్టీ నుంచి అని కాకుండా, అసలు ఆమె పోటీకి దిగడమే విశేషం అయింది. ‘‘నా మదిలో, నా హృదయంలో జేఎన్ యు ఉంది. పశ్చిమ బెంగాల్ బొగ్గు గనుల కార్మిక ఉద్యమ అనుభవం నన్ను రాజకీయాల్లోకి ప్రేరేపిస్తోంది’’ అంటున్నారు ఘోష్, తన ‘కొత్త’ రాజకీయ రంగ ప్రవేశం గురించి. ఇప్పటికే ఆమె విద్యార్థి రాజకీయాలలో చురుగ్గా ఉన్నారు. గత ఏడాది జనవరి 5 న ఢిల్లీ జవహర్లాల్ యూనివర్సిటీలోని పెరియార్ హాస్టల్లో ఆమెపై ప్రత్యర్థుల దాడి జరగడానికి కూడా ఆ చైతన్యశీలతే కారణం. దాడి అనంతరం కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఢిల్లీ వెళ్లి ఆమెను అభినందించారు. ఆశీస్సులు అందించారు. ఆయనకన్నా ముందు ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పడుకోన్ వెళ్లి ‘వందనం.. అభివందనం’ అన్నారు! ఐషీ ఘోష్ ప్రస్తుతం ఎంఫిల్ రెండో సంవత్సరం చదువుతున్నారు. జేఎన్‌యు లో చదువుతూ ఒక విద్యార్థి అసెంబ్లీకి పోటీ చేయడం యూనివర్సిటీ చరిత్రలోనే ప్రథమం. వర్సిటీలోని ‘స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్’లో ఆమె తన మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నారు. ∙∙ జేఎన్యులో తాము ఎందుకోసం అయితే పోరాడుతున్నామో, అదే ఉద్యమ పోరును తాను దేశ రాజకీయాల్లో కొనసాగించబోతున్నానని ఐషీ అనడంతో ఒక్కసారిగా పశ్చిమ బెంగాల్‌లోని అన్ని పార్టీల దృష్టీ ఆమెపై మళ్లేలా చేసింది. మెరుగైన విద్య, ఉపాధి, మంచి జీవన ప్రమాణాలు ఆమె తొలి ప్రాధాన్యాలు. జమూరియా బరిలో దిగేందుకు ఇప్పటికే ఆమె తన హాస్టల్ గదిలోని సామగ్రి ని సర్దుకుని ఉన్నారు. జమూరియాకు గంటన్నర దూరంలోనే ఆమె స్వస్థలం దుర్గాపూర్. అది వేరొక నియోజకవర్గ పరిధి లో ఉంటుంది. ఆమె తల్లిదండ్రులు దుర్గాపూర్‌లోనే ఉంటున్నారు. తండ్రి దేబశిష్ ఘోష్ దామోదర్ వ్యాలీ కార్పోరేషన్ ఉద్యోగి. కార్మిక నాయకుడు. తల్లి శర్మిష్ఠ ఘోష్ గృహిణి. ఇంట్లో ఐషీనే పెద్ద. చెల్లెలు ఇషిక కూడా ఢిల్లీలోనే అక్కడి శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ కాలేజ్‌లో డిగ్రీ చదువుతోంది. ఐషీ ఘోష్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం పట్ల ఇంట్లో అందరూ సుముఖంగా ఉన్నారు. తండ్రయితే సంతోషంగా ఉన్నారు. గనుల అక్రమ తవ్వకాలకు జమూరియా పేరుమోసిన ప్రాంతం. తన కూతురు గెలిస్తే అక్రమాలు తగ్గుతాయని ఆయన ఆశిస్తున్నారు. ఐషీ వాటిని ఎలాగూ తగ్గిస్తారు. అయితే ఆమె ప్రధాన అజెండా వేరే ఉంది. ‘‘ఉన్నత విద్యల కోసం, పెద్ద జీతాల కోసం, మంచి జీవితం కోసం యువత పరాయి ప్రాంతాలకు వెళ్లిపోవడంతో పశ్చిమ బెంగాల్ వృద్ధాశ్రమంలా మిగిలిపోతోంది. వాళ్లను ఆపడం కోసం ఉపాధి కల్పనపై మొదట నా పని ప్రారంభిస్తాను’’ అంటున్నారు ఐషీ. ఘోష్ దుర్గాపూర్‌లోనే ఇంటర్ వరకు చదివారు. ఢిల్లీలోని దౌలత్ రామ్ కాలేజ్ నుంచి పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీ చేశారు. దుర్గాపూర్‌లో ఉండగా తండ్రితో పాటు స్థానిక బొగ్గు గనుల కార్మిక పోరాటాల్లో పాల్గొన్నారు. ఇరవై ఏళ్ల వయసులో విద్యార్థిగా ఢిల్లీ వచ్చేశారు. ఎన్నికల అభ్యర్థిగా ఇప్పుడు మళ్లీ బెంగాల్ వెళుతున్నారు. ‘‘ఒకవేళ మీరు గెలిస్తే ఎమ్మెల్యేగా జమూరియాను, ఎంఫిల్ విద్యార్థిగా జేఎన్‌యును ఎలా బ్యాలెన్స్ చేసుకోగలరు?’’ అనే ప్రశ్న ఇప్పటికే మొదలైంది. ‘‘బ్యాలెన్స్ చేసుకుంటాను’’ అని ఆత్మవిశ్వాసం తో చెబుతున్నారు ఐషీ ఘోష్. ఆ ఆత్మ విశ్వాసం ఆమెలో ఫైర్ బ్రాండ్ మమతను ప్రతిఫలింపజేస్తోంది. గత ఏడాది ప్రత్యర్థుల దాడిలో గాయపడి, కోలుకుంటున్న సమయంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ఐషీఘోష్. ప్రస్తుతం ఆమె పశ్చిమ బెంగాల్ ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు. -
బెగుసరాయ్ నుంచి కన్హయ్యకుమార్
న్యూఢిల్లీ: బిహార్‌లోని బెగుసరాయ్ స్థానం నుంచి జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ నేత కన్హయ్య కుమార్‌ను పోటీలో ఉంచనున్నట్లు సీపీఐ తెలిపింది. రాష్ట్రంలోని ఆర్జేడీ నేతృత్వంలోని కూటమి నుంచి వైదొలిగిన కొన్ని రోజులకే సీపీఐ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. సీపీఐ నేత డి.రాజా ఆదివారం మీడియాకు ఈ విషయం వెల్లడించారు. ‘మా పార్టీ తరఫున బెగుసరాయ్ లోక్‌సభ స్థానంలో కన్హయ్య కుమార్ పోటీలో ఉంటారు. ఆయనకు సీపీఐ(ఎంఎల్) ఇప్పటికే మద్దతు ప్రకటించింది’ అని వివరించారు. రాష్ట్రంలోని మరో రెండు స్థానాలకు పార్టీ కేంద్ర నాయకత్వం త్వరలోనే అభ్యర్థులను ఖరారు చేస్తుందని తెలిపారు. బెగుసరాయ్‌లో బీజేపీ తరఫున కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ బరిలో ఉన్నారు. కాగా, మహాకూటమి తన అభ్యర్థి పేరును ఇంకా ఖరారు చేయలేదు. -
‘మోదీ హత్యకు గడ్కరీ స్కెచ్’
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్కెచ్ వేశారంటూ ఓ విద్యార్థి నేత చేసిన ట్వీట్ తీవ్ర దుమారం రేపింది. జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ) విద్యార్థిని, ఉద్యమకారిణి అయిన షెహ్లా రషీద్ శనివారం తన ట్విటర్ ఖాతాలో ఓ వివాదాస్పద పోస్టును ఉంచారు. (రాజీవ్ తరహాలోనే మోదీ హత్యకు భారీ కుట్ర!) ‘పరిస్థితులు చూస్తుంటే మోదీని హత్య చేసేందుకు ఆరెస్సెస్/గడ్కరీ ప్రణాళిక వేశారనిపిస్తోంది. ఆపై ముస్లింలను, కమ్యూనిస్టులపై ఆ అభాండం నెట్టేసి వారిని కూడా ఊచకోత కోస్తారేమో!.. #RajivGandhiStyle’ అంటూ ఆమె ఓ ట్వీట్‌ను ఉంచారు. ఈ ట్వీట్‌ను పలువురు రీట్వీట్ చేయగా, అది కాస్త వైరల్ అయ్యింది. గడ్కరీ ఘాటు రిప్లై: షెహ్లా రషీద్‌ను ప్రస్తావించకుండా సదరు పోస్టుపై నితిన్ గడ్కరీ ఘాటుగా స్పందించారు. ‘ఇలా వికృతమైన వ్యాఖ్యలతో చెలరేగే ఆరాచక శక్తులను ఉపేక్షిస్తే మంచిది కాదు. వారిపై న్యాయపరమైన చర్యలకు సిద్ధమవుతున్నా’ అంటూ ఆయన హెచ్చరించారు. అయితే రషీద్ కూడా తిరిగి అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చే యత్నం చేశారు. ‘ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ నేతకు వ్యంగ్య పోస్టుకు స్పందించటం తెలుసు. కానీ, అమాయకుడైన ఓ విద్యార్థి ఉమర్ ఖలీద్‌పై తప్పుడు కథనాలతో ఇబ్బందులకు గురి చేస్తున్న మీడియా ఛానెల్ గురించి తెలీదా? ఆ ఛానెల్ జర్నలిస్టుపై మీరు చర్యలు తీసుకోగలరా?’ అంటూ గడ్కరీకి షెహ్లా సవాల్ విసిరారు. పోలీసులకు ఖలీద్ ఫిర్యాదు... కాగా, జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జేఎన్‌యూ) విద్యార్థి నేత ఉమర్ ఖలీద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరారీలో ఉన్న గ్యాంగ్‌స్టర్ రవి పుజారి నుంచి తనకు ఈ బెదిరింపులు వస్తున్నాయని, తనకు పోలీసు రక్షణ కల్పించాలని ఉమర్ ఖలీద్ ఆ ఫిర్యాదులో పోలీసులను కోరారు. 'రవి పుజారి నుంచి జిగ్నేష్కూ, నాకూ చంపుతామనే బెదిరింపులు వస్తున్నాయి. దీనిపై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశాను. తన హిట్ లిస్ట్‌లో నేను ఉన్నట్టు రవి పూజారి చెప్పాడు. ఇదే వ్యక్తి (పుజారి) 2006 ఫిబ్రవరిలో కూడా నన్ను ఇలాగే బెదిరించాడు' అని ఖలీద్ ఓ ట్వీట్ చేశాడు. (పాపులారిటీ కోసమే మోదీ హత్య వార్త) Rahul Shivshankar, besides being a pirated version of Arnab Goswami, is a habitual shameless liar. @Shehla_Rashid you would remember he had sent me on two imaginary trips to Pakistan two yrs back I also want to ask Mr. @nitin_gadkari whether he will also take action against him? https://t.co/Jh7dwNnk2C — Umar Khalid (@UmarKhalidJNU) June 9, 2018 Looks like RSS/Gadkari is planning to assassinate Modi, and then blame it upon Muslims/Communists and then lynch Muslims #RajivGandhiStyle — Shehla Rashid (@Shehla_Rashid) June 9, 2018 I would be taking legal action on anti-social elements who have made bizzare comments; attributing personal motives to me, regarding the assassination threat to PM @narendramodi — Nitin Gadkari (@nitin_gadkari) June 9, 2018 -
పోలీసుల ఎదుట లొంగిపోయిన రతన్
న్యూఢిల్లీ: సహ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ జేఎన్‌యూ విద్యార్థి సంఘం నాయకుడు అన్మోల్ రతన్(29) పోలీసుల ఎదుట లొంగిపోయాడు. బుధవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో తన న్యాయవాదితో కలిసి పోలీస్ స్టేషన్ కు వచ్చి సరెండయ్యాడు. ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్(ఏఐఎస్ఏ)లో ముఖ్యనేతగా ఉన్న రతన్ ఆదివారం నుంచి కనిపించకుండా పోయాడు. అతడిని పట్టుకునేందుకు ఐదు పోలీసు బృందాలను నియమించారు. అత్యాచారం చేసిన తర్వాత తనను బెదిరించాడని ఎంఫిల్ విద్యార్థిని(28) ఫిర్యాదు చేయడంతో అతడు అదృశ్యమయ్యాడు. హాస్టల్ గదిలో తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు తెలిపింది. ఈ ఘటన జరిగిన రోజు రాత్రి రతన్ 13 సార్లు తనకు ఫోన్ చేసి విషయం ఎవరికీ చెప్పవద్దని బెదిరించినట్టు ఆమె చెప్పింది. క్రిమినల్ కేసు ఎదుర్కొంటున్న రతన్ ను ఏఐఎస్ఏ బహిష్కరించింది. -
ఆ రోజు రాత్రి 13సార్లు ఫోన్ చేశాడు
న్యూఢిల్లీ: ఢిల్లీ జేఎన్‌యూ విద్యార్థి సంఘం నాయకుడు అన్మోల్ రతన్ (29) అత్యాచారం చేసిన తర్వాత తనను బెదిరించాడని బాధితురాలైన పీహెచ్డీ విద్యార్థిని (28) చెప్పింది. బుధవారం ఆమె మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చింది. ఈ ఘటన జరిగిన రోజు రాత్రి రతన్ 13 సార్లు తనకు ఫోన్ చేసి విషయం ఎవరికీ చెప్పవద్దని బెదిరించినట్టు బాధితురాలు చెప్పింది. 'నాకు ఓ సినిమా సీడీ కావాలని ఫేస్బుక్లో పోస్ట్ చేయగా, తన దగ్గర ఉందని రతన్ కాంటాక్ట్ అయ్యాడు. శనివారం సాయంత్రం జేఎన్‌యూ క్యాంపస్‌లోని బ్రహ్మపుత్ర హాస్టల్లో రతన్ రూమ్ వద్దకు వెళ్లా. అతను డ్రింక్ ఆఫర్ చేస్తే తాగాను. డ్రింక్‌లో మత్తుమందు కలపడంతో నేను అపస్మారకస్థితిలో ఉండిపోయా. ఆ సమయంలో రతన్ నాపై లైంగికదాడికి పాల్పడ్డాడు. అపస్మారకస్థితిలో ఉండటంతో అతన్ని అడ్డుకోలేకపోయాను. నాకు కావాల్సన సినిమా సీడీ తన వద్ద లేదని, కావాలనే అబద్ధం చెప్పినట్టు ఆ తర్వాత రతన్ చెప్పాడు. బైకుపై నన్ను హాస్టల్ వద్ద డ్రాప్ చేస్తానని చెప్పాడు. నేను వారించి ఫ్రెండ్ సాయంతో వెళ్లా. ఆ రోజు రాత్రి రతన్ వరుసగా ఫోన్లు చేస్తూ విషయం ఎవరికీ చెప్పవద్దని బెదిరించాడు' అని పీహెచ్డీ విద్యార్థిని వాంగ్మూలం ఇచ్చింది. మరుసటి రోజు బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు. రతన్ పరారీలో ఉన్నాడని, ఫోన్ సిచ్ఛాఫ్ చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. -
కన్హయ్య కుమార్ ఏమైనా ఉగ్రవాదా..?
ఢిల్లీ జేఎన్‌యూ విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ్య కుమార్‌ను మహారాష్ట్ర అసెంబ్లీ విజిటర్స్ గ్యాలరీలోకి అనుమతించకపోవడంపై కాంగ్రెస్ తీవ్రంగా తప్పుపట్టింది. సభలోకి కన్హయ్యను అనుమతించకపోవడానికి అతనేమైనా ఉగ్రవాదా అని కాంగ్రెస్ ఎమ్మెల్యే నదీన్ ఖాన్ విమర్శించారు. బుధవారం మహారాష్ట్ర అసెంబ్లీలో నదీన్ ఖాన్ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. కన్హయ్య ఉగ్రవాది కాదని, ప్రజాస్వామ్యంలో ఎవరైనా సభ కార్యకలాపాలను వీక్షించవచ్చని చెప్పారు. అసెంబ్లీలోకి వచ్చేందుకు కన్హయ్యకు పాస్ ఉందని, అతన్ని అనుమతించకపోవడానికి తగిన కారణంలేదని అన్నారు. అసెంబ్లీ స్పీకర్ బగడే స్పందిస్తూ.. మంగళవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలు తెలుసుకుని పరిశీలిస్తానని చెప్పారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ మాట్లాడుతూ కన్హయ్యను అసెంబ్లీలోకి అనుమతించకపోవడం సిగ్గుమాలిన చర్య అని విరుచుకుపడ్డారు. కన్హయ్యను అడ్డుకున్నవారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిన్న విద్యార్థి సంఘం కార్యక్రమంలో పాల్గొనేందుకు కన్హయ్య ముంబై వచ్చాడు. ఈ విషయంపై కన్హయ్య స్పందిస్తూ.. విధాన సభ కార్యకలాపాలు చూడాలని కోరానని, ప్రత్యేకించి సభలో విదర్భపై జరిగే చర్చ వినాలనుకున్నానని, అయితే తనను అనుమతించలేదని చెప్పాడు. -
కన్హయ్య కుమార్, ఉమర్ ఖలీద్ కు భద్రత పెంపు
న్యూఢిల్లీ : నాగపూర్‌లో దాడి నేపథ్యంలో జేఎన్‌యూ విద్యార్థి నాయకుడు కన్హయ్య కుమార్, ఉమర్ ఖలీద్లకు ప్రభుత్వం భద్రతను పెంచింది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా మహారాష్ట్రలోని నాగపూర్‌లో కన్హయ్య కుమార్, ఉమర్ ఖలీద్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్రసంగిస్తున్న వారిపై చెప్పులు, బూట్లతో ప్రజలు దాడిచేశారు. అంతేకాకుండా కన్హయ్య కుమార్‌కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అలాగే బజరంగ్ దళ్ కార్యకర్తలు కన్హయ్య కుమార్ కారును నాగపూర్ నగరంలో ప్రవేశించకుండా అడ్డుకున్నారు. దాంతో పలువురు బజరంగ్ దళ్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కన్హయ్య, ఉమర్ ఖలీద్లకు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. -
నా పిల్లలకు ‘భారత్ మాతా కీ జై’ పేరు పెడతా: కన్హయ్య
న్యూఢిల్లీ: తన భార్య, పిల్లలకు ‘భారత్ మాతా కీ జై’ అని పేరు పెడతానని జేఎన్‌యూ విద్యార్థినేత కన్హయ్యకుమార్ శనివారం ఢిల్లీలో అన్నారు. తనకు పెళ్లయ్యాక పేరు మార్చుకోమని భార్యకు సూచిస్తానన్నారు. తన పేరు కూడా ఆవిధంగానే మార్చుకుంటానని చెప్పారు. కాగా, సీఆర్పీఎఫ్ అమరుల కార్యక్రమం స్ఫూర్తితో 1973లో తన కొడుక్కి ‘శౌర్య’ పేరు పెట్టానని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చెప్పారు. -
కన్హయ్య వెళ్తున్న కారుకు ప్రమాదం..
హైదరాబాద్: రాజ్యంగ పరిరక్షణ సదస్సులో పాల్గొనడానికి నగరానికి వచ్చి తిరిగి ఏయిర్‌పోర్టుకు వెళ్తున్న జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ఈ సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏజీ కళాశాల ముందు గురువారం చోటుచేసుకుంది. కన్హయ్య ప్రయాణిస్తున్న కారును చిక్కడపల్లి సీఐ జీపు ఢీకొట్టింది. దీంతో కారు పాక్షీకంగా ధ్వంసం అయింది. అనంతరం కన్హయ్య కుమార్ సురక్షితంగా ఏయిర్పోర్టు చేరుకున్నారు. -
దేశంలో మంచిరోజులు కనిపించడంలేదు: కన్హయ్య
విజయవాడ : వేముల రోహిత్ పోరాటాన్ని తాము కొనసాగిస్తామని జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ స్పష్టం చేశారు. విజయవాడ ఐవీ ప్యాలెస్‌లో గురువారం జరిగిన యువజన శంఖారావం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కన్హయ్య కుమార్ మాట్లాడుతూ... ఈ దేశంలో మంచిరోజులు కరువయ్యాయి. దళితులకు రక్షణ లేకుండా పోయింది. చదువు కోసం దళితుడు పోరాటం చేయాల్సి వస్తోంది. రోహిత్ చట్టం కోసం పోరాటం చేస్తాం. దేశాన్ని హిందూ రాజ్యం చేస్తామంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తన మనసులో మాట చెబుతారు కానీ, ప్రజల మనసులో మాట వినరు. ఎన్నికల్లో ఆయన ఇచ్చిన హామీలన్నీ ఏమయ్యాయి. నల్లధనం తెస్తామన్నారు. అది ఏమైంది? ఓ వైపు నిత్యావసర ధరలు మండిపోతుంటే...బుల్లెట్ ట్రయిన్ తెస్తామంటున్నారు. ఇప్పుడు అభివృద్ధిని వదిలేసి మందిర నిర్మాణం అంటున్నారు. పేదల సబ్సిడీలు తగ్గించి పెద్దోళ్లకు రాయితీలు ఇస్తున్నారు. ఉద్యోగుల పీఎఫ్ డబ్బులను దోపిడీ చేసే యత్నం చేశారు. నేతల సొమ్ముతో కాదు.. జేఎన్‌యూ ఈ దేశ ప్రజల డబ్బుతో నడుస్తోంది' అని అన్నారు. -
కన్హయ్య రాక.. బీజేపీ కాక
కృష్ణా : జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ రాకతో ఐవీ ప్యాలెస్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టు చేరుకున్న కన్హయ్య అక్కడ నుంచి నేరుగా ఐవీ ప్యాలెస్ సభస్థలికి చేరుకున్నారు. అయితే దేశ ద్రోహం కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న కన్హయ్య రాకను బీజేపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. సభా ప్రాంగణంలోకి వెళ్లేందుకు పలువురు బీజేపీ నేతలు యత్నించారు. ఈ సందర్భంగా బీజేపీ, సీపీఐ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. కాగా హైదరాబాద్ లో ఈ రోజు(గురువారం) ఉదయం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కన్హయ్య కుమార్ పాల్గొన్న సమావేశం రసాభాసగా మారిన విషయం తెలిసిందే. 'గోరక్షాదళ్'కు చెందిన ఇద్దరు యువకులు ఒక్కసారిగా లేచి.. 'భారత్ మాతాకీ జై' అంటూ చెప్పులు విసిరారు. ఈలోపు హాల్లో ఉన్న ఏఐఎస్ఎఫ్ విద్యార్థులు ఆ ఇద్దరినీ పట్టుకుని చితక్కొట్టారు. ఆ ఇద్దరూ మీడియా ఉన్నవైపు రావడంతో.. మీడియా కెమెరా స్టాండ్లు తీసుకుని వాటితో వాళ్లను కొట్టారు. ఈ ప్రయత్నంలో వీడియో కెమెరాలు కూడా కొన్ని పగిలాయి. ఈలోపు అక్కడే ఉన్న పోలీసులు వచ్చి వాళ్లిద్దరినీ బయటకు తీసుకెళ్లి అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. -
కన్హయ్యపై చెప్పులు విసిరిన యువకులు
సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ సమావేశం రసాభాసగా మారింది. కన్హయ్య తన ప్రసంగం మొదలుపెట్టబోతుండగానే అతడి వ్యతిరేకులలో 'గోరక్షాదళ్'కు చెందిన ఇద్దరు యువకులు ఒక్కసారిగా లేచి.. 'భారత్ మాతాకీ జై' అంటూ కన్హయ్యపై చెప్పులు విసిరారు. ఈలోపు హాల్లో ఉన్న ఏఐఎస్ఎఫ్ విద్యార్థులు ఆ ఇద్దరినీ పట్టుకుని చితక్కొట్టారు. ఆ ఇద్దరూ మీడియా ఉన్నవైపు రావడంతో.. మీడియా కెమెరా స్టాండ్లు తీసుకుని వాటితో వాళ్లను కొట్టారు. ఈ ప్రయత్నంలో వీడియో కెమెరాలు కూడా కొన్ని పగిలాయి. వాళ్లను ఏమీ అనొద్దని, ఊరుకొమ్మని కన్హయ్య కుమార్ చెబుతున్నా పరిస్థితి మాత్రం అదుపులోకి రాలేదు. ఈలోపు అక్కడే ఉన్న పోలీసులు వచ్చి వాళ్లిద్దరినీ బయటకు తీసుకెళ్లి అదుపులోకి తీసుకున్నారు. అయితే, కావాలనే ఈ సమావేశానని రసాభాస చేయాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారని ఏఐఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు ఖాద్రీ అన్నారు. దీనిపై ఆ తర్వాత ప్రసంగించిన కన్హయ్య కూడా స్పందించాడు. కొంతమంది తనను కొట్టి పబ్లిసిటీ తెచ్చుకోవాలనుకుంటున్నారని, కానీ చెప్పులు, రాళ్లు విసిరితే ప్రయోజనం ఉండదని చెప్పాడు. ఈ రోజు తన మీద చెప్పులు విసిరిన వాళ్ల మీద గానీ, నిన్న తనను కొట్టినవాళ్ల మీద గానీ తనకు ఏమాత్రం కోపం లేదని.. వాళ్ల వల్ల తనకు మరింత మేలు జరుగుతుందని అన్నాడు. చివరకు తనను జైలుకు పంపినవారి మీద కూడా ఎలాంటి కోపం లేదని అన్నాడు. రాళ్లు, చెప్పులు మీమీదే వేసుకుంటున్నారని రేపు మీకు అర్థం అవుతుందని తెలిపాడు. -
దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలపై దాడి: కన్హయ్య
దేశవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల మీద ఒక సీరియస్ దాడి జరుగుతోందని జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ అన్నాడు. సుందరయ్య విజ్ఞానకేంద్రంలో గురువారం ఉదయం కన్హయ్య మీడియాతో మాట్లాడాడు. తొలుత హెచ్‌సీయూలో ఘటన జరిగిందని, తర్వాత జేఎన్‌యూలో విద్యార్థులను తప్పుపట్టారని అన్నాడు. పోనీ ఈ రెండింటినీ పక్కన పెడితే అలీగఢ్ యూనివర్సిటీ మైనారిటీ హోదాను తప్పించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించాడు. మొత్తంగా అసలు విద్యార్థుల ఆందోళనను డీలెజిటమేట్ చేసే ప్రయత్నం ఒకటి జరుగుతోందని ఆరోపించాడు. జస్టిస్ ఫర్ రోహిత్ వేముల ఆందోళనను ఢిల్లీలో కొనసాగించాలని తాము ముందుగానే నిర్ణయించుకున్నామని, ఇక్కడ ఘటన జరిగిన తర్వాత తాను ఇక్కడికొచ్చి విద్యార్థి సంఘాల నేతలతో మాట్లాడానని తెలిపాడు. ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్లిన తర్వాత అక్కడ జేఏసీ ప్రారంభించామని, అంబేద్కర్ భవన్ నుంచి ఆర్ఎస్ఎస్ ఆఫీసు వరకు నిరసన ప్రదర్శన నిర్వహించామని, తర్వాత బహిరంగ సభ కూడా నిర్వహించామని తెలిపాడు. రోహిత్ వేముల ఆందోళనకు జేఎన్‌యూలో జరిగిన ఆందోళన కేవలం ఒక కొనసాగింపు మాత్రమేనని వెల్లడించాడు. అయితే ప్రభుత్వం మాత్రం ఈ రెండింటినీ ఒక దానికి ఒకటి పోటీగా చేయాలనుకుందని అన్నాడు. తాను జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా.. తనకు ఆదర్శప్రాయుడు అఫ్జల్ గురు కాదు, రోహిత్ వేములేనని చెప్పానని గుర్తుచేశాడు. తాను హెచ్సీయూకు రావాలని ముందుగానే నిర్ణయించుకున్నామని, కానీ అనుకోకుండా జరిగిందో.. కావాలనే చేశారో గానీ తాను రావడానికి ఒక్కరోజు ముందే అప్పారావు మళ్లీ వీసీగా బాధ్యతలు స్వీకరించారని కన్హయ్యకుమార్ అన్నాడు. ఆయన మద్దతుదారులు దండలతో ఆయనకు స్వాగతం పలికారని, తర్వాత శాంతియుతంగా ప్రదర్శన చేస్తున్న విద్యార్థులను రెచ్చగొట్టడంతో హింసాత్మక ఘటనలు జరిగాయని తెలిపాడు. తనకు ప్రజాస్వామ్యంపై నమ్మకముందని, హింసను ఎట్టి పరిస్థితుల్లో సమర్థించబోనని అన్నాడు. కానీ ఇక్కడ మాత్రం అమ్మాయిలను మగ పోలీసులతో కొట్టించారని, విద్యుత్, వై-ఫై కట్ చేశారని, చివరకు అధ్యాపకులను కూడా కొట్టి, అరెస్టుచేసి జైళ్లలో పెట్టారని చెప్పాడు. పోలీసులు తొలుత తనను యూనివర్సిటీలోకి అనుమతించాలనే అనుకున్నారట గానీ.. తర్వాత అంతర్గత భద్రతా సమస్యల వల్ల పంపలేదని చెప్పారని.. ఆ అంతర్గత భద్రతను భంగపరిచింది ఎవరని ప్రశ్నించాడు. జేఎన్‌యూ - హెచ్‌సీయూలలో ఒకేలాంటి పోలికలు కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించాడు. -
రాహుల్‌తో కన్హయ్య కుమార్ భేటీ
న్యూఢిల్లీ: ఢిల్లీ జేఎన్‌యూ విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ్య కుమార్.. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. మంగళవారం రాహుల్ గాంధీకి నివాసానికి వెళ్లి భేటీ అయ్యారు. బుధవారం హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని కన్హయ్య సందర్శించనున్న నేపథ్యంలో రాహుల్‌తో సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. హెచ్‌సీయూ, జేఎన్‌యూ విద్యార్థులకు రాహుల్ మద్దతు తెలియజేసిన సంగతి తెలిసిందే. రాజద్రోహం కేసులో అరెస్టయి విడుదలైన కన్హయ్య.. రాహుల్‌తో భేటీ కావడం ఇదే తొలిసారి. ఆత్మహత్య చేసుకున్న హెచ్‌సీయూ పీహెచ్డీ విద్యార్థి రోహిత్ వేముల తల్లిని కన్హయ్య పరామర్శించనున్నారు. హెచ్‌సీయూలో రోహిత్ స్నేహితులను కలవనున్నారు. కాగా వర్సిటీలో ప్రవేశానికి కన్హయ్య కుమార్ కు హెచ్‌సీయూ అధికారులు అనుమతి నిరాకరించారు. -
పిచ్చుక మీద బ్రహ్మాస్త్రమా?
పిచ్చుకే కదా అని కన్హయ్యపై దాడి చేస్తే బంతి ఎదురుతిరిగినట్లు ప్రపంచ వ్యాప్తంగా విశ్వవిద్యాల యాల్లో విద్యార్థులు స్పందిస్తున్నారు. మేధావులు పుంఖాను పుంఖాలుగా వ్యాసాలు ఉత్తరాలు రాస్తున్నారు. కాలిఫోర్నియాలాంటి యూనివర్శిటీల్లో సంఘీభావ ప్రదర్శనలు చేస్తున్నారు. నిన్నటి వరకు బాలుడుగా ఉన్న జేఎన్‌యూ కన్హయ్య నేడు మహాబలాఢ్యు డిగా ఎదిగిపోయాడు. పిచ్చుకమీద బ్రహ్మా స్త్రమే తిరిగి మోదీపై తిరగబడింది. ఆ పిల్లా డిని దేశద్రోహం కేసులో ఇరికించి, దాన్ని సమర్థించుకోవడానికి తప్పుడు ఆధారాలు వెతుక్కోవడం మొదలుపెట్టారు. చివరికి రాజకీయరంగంలో, జర్నలిజం రంగంలో సకల అనైతిక చర్యలకు పాల్పడి ప్రభుత్వ యంత్రాంగం ద్వారా ప్రైవేట్ వార్తారంగాన్ని ఆశ్రయించి, సీడీలనే టాంపరింగ్ చేసి ఫిబ్రవరి 9వ తేదీ సభకు 11వ తేదీన జరిగిన సభ సీడీలను కలగాపులగం చేసి కన్హయ్యకు సంబంధంలేని నినాదాలను, కన్హయ్య నోటినుంచి వచ్చేట్టు మిక్స్ చేయించి, విడుదల చేయించారు. ఆజాదీ అంటే విముక్తి. పేదరికం, ఆకలి నుంచి విముక్తి, పెట్టుబడిదారీ వ్యవస్థ నుంచి విముక్తి, మనుస్మృతి నుంచి విముక్తి తదితర నినాదాలిస్తున్న కన్హయ్య హావభావాల్లో జాతి వ్యతిరేక నినాదాలను కల్పించి నీచాతి నీచ ప్రక్రియకు పాల్పడ్డారు. చివరకు ఏ టీవీ అయితే అలాంటి దుర్మార్గానికి పాల్పడిందో అందులో భాగస్వామి అయిన రిపోర్టర్ విశ్వజిత్ ఆత్మవంచన చేసుకోలేక రాజీనామా చేసి బయటకి వచ్చేశారు. కోర్టులలో సైతం కన్హయ్యపై దాడికి పాల్పడ్డారంటే వీరి రాజ్యాంగ ధర్మం ఏపాటిది? పోలీసు కమిషనర్ బస్సీ అక్కడే ఉండి విలేకర్ల సమావేశంలో ఎలాంటి గొడవ జరగలేదని ప్రకటిస్తున్నారు. అదే టీవీలో మరో పక్క లాయర్ యూనిఫాంలో ఉన్న సంఘ్‌పరివార్ సైన్యం దాడులు యథేచ్ఛగా చేస్తూనే ఉన్నారు. ఆ దాడులకు పాల్పడ్డ లాయర్లకు సమన్స్ ఇచ్చాం. వారికోసం ఎదురు చూస్తున్నామని పోలీస్ అధికారి ప్రకటిస్తారు. అనుమా నించిన వెంటనే విద్యార్థులపై దేశద్రోహ కేసు, బహిరంగంగా కోర్టులో దాడి చేసిన ఒక ఎంఎల్ఏకి, ముగ్గురు లాయర్లకు సన్మానాలే కాదు... సమన్స్ ఇచ్చి పోలీసుస్టేషన్‌కు పిలిపించి సకల మర్యా దలతో తేనీరందించి పంపుతారా? ఎన్డీఏ పాలనలో అధికార దుర్వినియోగం ఎలా అమలు పరుస్తున్నారో స్పష్టంగా కనబడుతోంది. అసలా దేశద్రోహ చట్టం బ్రిటిష్ పాలన ఉన్నప్పుడు అమలులోకి వచ్చింది. చివరికి ఆ బ్రిటన్‌లోనే ఈ దుర్మార్గపు చట్టాన్ని రద్దు చేసింది. దేశ భక్తి గురించి చెబుతున్న బీజేపీ ప్రభుత్వం మాత్రం దాన్నే అమలు చేస్తోంది. ఏక బాణం, ఏకపత్ని, ఏక హిందూ రాష్ట్రంగానే ఉండాలనే రహస్య ఎజెండాను ప్రవేశపెట్టడానికి యావత్ ప్రభుత్వ యంత్రాంగాన్ని నిర్భయంగా ఉపయోగించుకుంటోంది. అంతెందుకు.. మోదీ, వెంకయ్య చుట్టూ ఉన్న ఐఏఎస్, ఐపీఎస్ కేడర్ కూడా జేఎన్‌యూ వాళ్లే. దేశాభివృద్ధికి ప్రముఖులను తయారు చేసే ఉన్నత విద్యా సంస్థల్లో అభ్యసించే భావి భారత పౌరులు దేశద్రోహులా? కీలక స్థానాల్లో తమవాళ్లను నియమించుకుంటూ ఆధిపత్యాన్ని చలాయించాలనుకుంటున్న సంఘీయులు అలాంటి తాపత్రయాన్ని విద్యార్థి లోకం నుంచి ప్రారంభించారు. ఏబీవీపీ ఎక్కడ పిటిషన్లు పెడితే అక్కడ దాన్ని ప్రామాణికంగా తీసుకుని మంత్రుల ద్వారా అమలు చేస్తున్నారు. మద్రాస్ ఐఐటీలో పెరియార్ విద్యార్థి సంఘంపై వేటు వేశారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాల యంలో ఏబీవీపీ ఫిర్యాదు మేరకు బండారు దత్తాత్రేయ ద్వారా స్మృతి ఇరానీ అధికారాన్ని ఉపయోగించి ఐదుగురు రిసెర్చి స్కాలర్స్‌ను సస్పెండ్ చేసి, హాస్టల్స్ నుంచి తొలగిస్తే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నారు. జేఎన్‌యూలో లాగా రాజకీయ చైతన్యం కలిగి ఉంటే రోహిత్ ఆ చర్యకు పాల్పడేవాడు కాదు. ఆత్మహత్య రూపంలో రోహిత్‌పై సర్కారీ హత్యకు చరమగీతం పాడాలి. అందుకే రోహిత్ ఆత్మహత్యపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దేశవ్యాప్తంగా రోహిత్ సంఘీభావ ఉద్యమం జరుగుతోంది. జేఎన్‌యూలో ఏబీవీపీ ఫిర్యాదు మేరకు విద్యార్థి సంఘ ఎన్నికలలో గెలిచిన కన్హయ్యపై దేశద్రోహం కేసుపెట్టి జైలుకు పం పారు. ఎక్కడ ఏబీవీపీకి శృంగభంగమయిందో అక్కడంతా ప్రత్య ర్థులపై కఠిన చర్యలకు పాల్పడుతున్నారు. పిచ్చుకే కదా అని కన్హయ్యపై దాడి చేస్తే బంతి ఎదురుతిరిగినట్లు ప్రపంచ వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు స్పందిస్తున్నారు. వేలాదిమంది మేధావులు వ్యాసాలు ఉత్తరాలు రాస్తున్నారు. కాలిఫోర్నియాలాంటి యూనివర్శిటీల్లో సంఘీభావ ప్రదర్శనలు చేస్తున్నారు. మమ్మల్ని వ్యతిరేకించేవారంతా దేశద్రోహులవుతారని ముద్ర వేసి మరీ దాడులు చేస్తున్నారు. కన్హయ్యపై దేశద్రోహ ఆరోపణలను ఖండించిన నారిమన్ లాంటి న్యాయవాదులు, అమర్త్యసేన్ లాంటి ప్రఖ్యాత మేధావులు కూడా దేశద్రోహులేనా? రొమిల్లా థాపర్ వంటి చరిత్రకారులతోపాటు మాజీ న్యాయమూర్తులు కూడా వ్యతిరేకి స్తున్నారు. వీరంతా దేశద్రోహులేనా? ఇద్దరు ప్రధానులు (ఇందిరా గాంధీ, రాజీవ్‌గాంధీ) దేశం కోసం బలైన కుటుంబం కూడా దేశ ద్రోహ కుటుంబమేనా? దేశం కోసం సర్వం త్యాగం చేసి నిర్బంధ జైలు జీవితం అనుభవించిన కమ్యూనిస్టులు కూడా దేశద్రోహులా? స్వాతంత్య్ర పోరాటంలో ఒక్క లాఠీ దెబ్బ, ఒక్క రోజు జైలుకు కూడా వెళ్లకుండా బ్రిటిష్ రాణికి స్వాగతం పలికిన సంఘ్పరివారీ యులు దేశభక్తులా? కశ్మీరులో అఫ్జల్‌గురు ఫొటోలు పెట్టి పూజిస్తూ అతడి మరణాన్ని కీర్తిస్తున్న పీడీఎఫ్‌తో కలిసి కాపురం చేసే వారు దేశ భక్తులా? ఒకప్పుడు ముస్లింలనే దేశద్రోహులనేవారు. ఇప్పుడు హిందువులైన రోహిత్, కన్హయ్య, అపరాజిత వంటి వారిని దేశద్రోహు లంటున్నారు. ‘ఆర్ఎస్ఎస్ అనుకూల విధానాలతో భారత్‌లో ఉండాలి విభేదించేవారు దేశం వదిలి వెళ్లండి లేదా చావండి’ అనే నినాదంతో పాలించే మీకు భిన్నత్వంలో ఏకత్వం సాధించిన భారత సంస్కృతి, ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. కన్హయ్యపై దేశద్రోహం కేసును వ్యతిరేకిస్తూ దాదాపు పదివేల మంది జేఎన్‌యూ, ఢిల్లీ యూనివర్శిటీతోపాటు అన్ని కళాశాలల నుంచి యువతీయువకులు, ఉపాధ్యాయరంగమంతా రంగంలోకి దిగింది. ఇంత నిరసన జరుగుతున్నా ఎన్జీయే ప్రభుత్వం తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి తప్పుమీద తప్పు చేస్తూ పార్లమెం టులో సైతం మొండిగా, కరుగ్గా ఘీంకరిస్తోంది. దీన్ని ఛేదించాలంటే కిందిస్థాయి నుంచి ఢిల్లీ వరకు వామపక్ష, సెక్యులర్ భావాలు కలిగిన అన్ని శక్తులను కూడగట్టుకోవలిసి ఉంది. అబద్ధాలతో రాజ్యమేలు తున్న కేంద్ర ప్రభుత్వ దుర్మార్గాన్ని ఓడించాల్సిన అవసరం ఉంది. (వ్యాసకర్త : నారాయణ సీపీఐ జాతీయ కార్యదర్శి మొబైల్: 94909 52222) -
విజయవాడలో విద్యార్థుల ధర్నా
కృష్ణాజిల్లా: జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్యకుమార్‌ను వెంటనే విడుదల చేయాలని కోరుతూ విజయవాడలో మంగళవారం విద్యార్ధులు ధర్నాకు దిగారు. లెనిన్ సెంటర్ వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో ఏబీవీపీ, బీజేపీ గూండాలను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో మతోన్మాదుల అరాచకాలు అరికట్టాలని, రోహిత్ చట్టాన్ని చేయాలనీ, అతని కుటుంబాన్ని ఆదుకోవాలని విద్యార్ధి నాయకులు కోరారు.