రాహుల్తో కన్హయ్య కుమార్ భేటీ | Kanhaiya Kumar Meets Rahul Gandhi | Sakshi
Sakshi News home page

రాహుల్తో కన్హయ్య కుమార్ భేటీ

Published Tue, Mar 22 2016 3:04 PM | Last Updated on Sun, Sep 3 2017 8:20 PM

రాహుల్తో కన్హయ్య కుమార్ భేటీ

రాహుల్తో కన్హయ్య కుమార్ భేటీ

న్యూఢిల్లీ: ఢిల్లీ జేఎన్యూ విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ్య కుమార్.. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. మంగళవారం రాహుల్ గాంధీకి నివాసానికి వెళ్లి భేటీ అయ్యారు. బుధవారం హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని కన్హయ్య సందర్శించనున్న నేపథ్యంలో రాహుల్తో సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

హెచ్సీయూ, జేఎన్యూ విద్యార్థులకు రాహుల్ మద్దతు తెలియజేసిన సంగతి తెలిసిందే. రాజద్రోహం కేసులో అరెస్టయి విడుదలైన కన్హయ్య.. రాహుల్తో భేటీ కావడం ఇదే తొలిసారి. ఆత్మహత్య చేసుకున్న హెచ్సీయూ పీహెచ్డీ విద్యార్థి రోహిత్ వేముల తల్లిని కన్హయ్య పరామర్శించనున్నారు. హెచ్సీయూలో రోహిత్ స్నేహితులను కలవనున్నారు. కాగా వర్సిటీలో ప్రవేశానికి కన్హయ్య కుమార్ కు హెచ్‌సీయూ అధికారులు అనుమతి నిరాకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement