రాజ్యంగ పరిరక్షణ సదస్సులో పాల్గొనడానికి నగరానికి వచ్చి తిరిగి ఏయిర్‌పోర్టుకు వెళ్తున్న జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.
హైదరాబాద్: రాజ్యంగ పరిరక్షణ సదస్సులో పాల్గొనడానికి నగరానికి వచ్చి తిరిగి ఏయిర్‌పోర్టుకు వెళ్తున్న జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ఈ సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏజీ కళాశాల ముందు గురువారం చోటుచేసుకుంది.
కన్హయ్య ప్రయాణిస్తున్న కారును చిక్కడపల్లి సీఐ జీపు ఢీకొట్టింది. దీంతో కారు పాక్షీకంగా ధ్వంసం అయింది. అనంతరం కన్హయ్య కుమార్ సురక్షితంగా ఏయిర్‌పోర్టు చేరుకున్నారు.