భారతదేశంలో జీప్ కంపెనీ తన ఎనిమిదవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 'కంపాస్ స్పెషల్ ఎడిషన్' లాంచ్ చేసింది. దీని ధర రూ. 25.26 లక్షలు. ఇది దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా చాలా అద్భుతమైన డిజైన్ పొందుతుంది. కొత్త కాస్మొటిక్ డిజైన్స్ అన్నీ కూడా దీనిని స్పెషల్ ఎడిషన్ కారుగా గుర్తించడానికి సహకరిస్తాయి.
కొత్త జీప్ కంపాస్ స్పెషల్ ఎడిషన్ బానెట్‌పై డ్యూయల్-టోన్ డికాల్‌తో పాటు ఆరవ గ్రిల్ స్లాట్‌పై వెల్వెట్ రెడ్ కలర్ ఉండటం చూడవచ్చు. లోపలి భాగంలో కూడా ఎక్కువ భాగం ఎరుపు రంగులోనే ఉండటం చూడవచ్చు. ఈ కొత్త ఎడిషన్ స్టాండర్డ్ మోడల్ కంటే కూడా రూ. 43000 ఎక్కువ ధర వద్ద లభిస్తోంది.
ఇదీ చదవండి: టీవీఎస్ జుపీటర్ 125 Vs హోండా యాక్టివా 125: ఏది బెస్ట్?
కొత్త జీప్ స్పెషల్ ఎడిషన్ కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ తప్పా.. ఫీచర్స్, ఇంజిన్ వంటి వాటిలో ఎలాంటి అప్డేట్ పొందలేదు. కాబట్టి కంపాస్ యానివర్సరీ ఎడిషన్ 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజిన్ కలిగి 350 న్యూటన్ మీటర్ టార్క్, 170 హార్స్ పవర్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్, 9 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ పొందుతుంది. కాబట్టి పర్ఫామెన్స్ కూడా మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment