హృతిక్‌ రోషన్‌తో ‘జీప్‌’ ప్రచార కార్యక్రమం | Jeep partners with Hrithik Roshan for Wrangler Rubicon SUV | Sakshi
Sakshi News home page

హృతిక్‌ రోషన్‌తో ‘జీప్‌’ ప్రచార కార్యక్రమం

Published Wed, Jul 17 2024 4:07 PM | Last Updated on Wed, Jul 17 2024 4:27 PM

Jeep partners with Hrithik Roshan for Wrangler Rubicon SUV

హైదరాబాద్‌: కార్ల తయారీ సంస్థ ‘జీప్‌ ఇండియా’ బాలీవుడ్‌ నటుడు హృతిక్‌ రోషన్‌తో కలిసి నూతన ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. దీని ద్వారా జీప్‌ రాంగ్లర్‌ అత్యుత్తమ ప్రదర్శన, ఆకర్షణీయ ఫీచర్లను కస్టమర్లకు తెలియజేయనుంది.

‘వన్‌అండ్‌ఓన్లీ’ ట్యాగ్‌లైన్‌ తగ్గట్లు సాటిలేని ప్రమాణాలతో వాహనాలను రూపొందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. అత్యుత్తమ స్థాయిని చేరుకోవడమే కాకుండా, ఈ స్థాయిని నిలుపుకునేందుకు నిరంతరం శ్రమిస్తామని జీప్‌ ఇండియా ప్రకటించింది.  

హృతిక్‌ రోషన్‌ను జీప్‌ సంస్థ ఇటీవలే తమ బ్రాండ్‌ పార్ట్‌నర్‌గా నియమించుకుంది. దీనికి సంబంధించిన వీడియోను హృతిక్ రోషన్ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement