Wrangler
-
హృతిక్ రోషన్‌తో ‘జీప్’ ప్రచార కార్యక్రమం
హైదరాబాద్: కార్ల తయారీ సంస్థ ‘జీప్ ఇండియా’ బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్‌తో కలిసి నూతన ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. దీని ద్వారా జీప్ రాంగ్లర్ అత్యుత్తమ ప్రదర్శన, ఆకర్షణీయ ఫీచర్లను కస్టమర్లకు తెలియజేయనుంది.‘వన్‌అండ్‌ఓన్లీ’ ట్యాగ్‌లైన్ తగ్గట్లు సాటిలేని ప్రమాణాలతో వాహనాలను రూపొందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. అత్యుత్తమ స్థాయిని చేరుకోవడమే కాకుండా, ఈ స్థాయిని నిలుపుకునేందుకు నిరంతరం శ్రమిస్తామని జీప్ ఇండియా ప్రకటించింది. హృతిక్ రోషన్‌ను జీప్ సంస్థ ఇటీవలే తమ బ్రాండ్ పార్ట్నర్గా నియమించుకుంది. దీనికి సంబంధించిన వీడియోను హృతిక్ రోషన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. View this post on Instagram A post shared by Hrithik Roshan (@hrithikroshan) -
భారత్‌లోకి ఫియట్ జీప్ బ్రాండ్
జోద్పూర్: ఇటలీకి చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ ‘ఫియట్ క్రిస్లెర్ ఆటోమొబైల్స్’ (ఎఫ్సీఏ) తన జీప్ బ్రాండ్‌ను భారత్‌లోకి ప్రవేశపెట్టింది. కంపెనీ తాజాగా ‘రాంగ్లర్’, ‘గ్రాండ్ చెరోకీ’ అనే రెండు ఎస్యూవీ మోడళ్లను మార్కెట్లో ఆవిష్కరించింది. రాంగ్లర్ ధర రూ.71.59 లక్షలు. ఇక మూడు వేరియంట్లలో లభ్యంకానున్న చెరోకీ ధర రూ.93.64 లక్షలు నుంచి రూ.1.12 కోట్ల మధ్యలో ఉంది. అన్ని ధరలు ఎక్స్‌షోరూమ్ ఢిల్లీవి. అలాగే వచ్చే ఏడాది రెండో త్రైమాసికం నుంచి పుణే ప్లాంటులో తయారీని ప్రారంభిస్తామని కంపెనీ పేర్కొంది. ఈ ఏడాది చివరకు హైదరాబాద్ సహా మరో ఎనిమిది నగరాల్లో జీప్ డెస్టినేషన్ స్టోర్ బ్రాండ్ కింద పది డీలర్‌షిప్స్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపింది.