భారత్లోకి ఫియట్ జీప్ బ్రాండ్ | Fiat Chrysler drives iconic SUVs Jeep Wrangler, Cherokee into India | Sakshi
Sakshi News home page

భారత్లోకి ఫియట్ జీప్ బ్రాండ్

Published Wed, Aug 31 2016 12:37 AM | Last Updated on Mon, Sep 4 2017 11:35 AM

భారత్లోకి ఫియట్ జీప్ బ్రాండ్

భారత్లోకి ఫియట్ జీప్ బ్రాండ్

జోద్‌పూర్: ఇటలీకి  చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ ‘ఫియట్ క్రిస్లెర్ ఆటోమొబైల్స్’ (ఎఫ్‌సీఏ) తన జీప్ బ్రాండ్‌ను భారత్‌లోకి ప్రవేశపెట్టింది. కంపెనీ తాజాగా ‘రాంగ్లర్’, ‘గ్రాండ్ చెరోకీ’ అనే రెండు ఎస్‌యూవీ మోడళ్లను మార్కెట్‌లో ఆవిష్కరించింది. రాంగ్లర్ ధర రూ.71.59 లక్షలు. ఇక మూడు వేరియంట్లలో లభ్యంకానున్న చెరోకీ ధర రూ.93.64 లక్షలు నుంచి రూ.1.12 కోట్ల మధ్యలో ఉంది. అన్ని ధరలు ఎక్స్‌షోరూమ్ ఢిల్లీవి. అలాగే వచ్చే ఏడాది రెండో త్రైమాసికం నుంచి పుణే ప్లాంటులో తయారీని ప్రారంభిస్తామని కంపెనీ పేర్కొంది. ఈ ఏడాది చివరకు హైదరాబాద్ సహా మరో ఎనిమిది నగరాల్లో జీప్ డెస్టినేషన్ స్టోర్ బ్రాండ్ కింద పది డీలర్‌షిప్స్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement