Jeep brand
-
జీప్ స్పీడ్‌కు ఫియట్ క్రిస్లర్ సై
న్యూఢిల్లీ, సాక్షి: దేశీయంగా ప్యాసింజర్ కార్ల మార్కెట్లో పట్టు సాధించేందుకు 25 కోట్ల డాలర్లను(సుమారు రూ. 1,850 కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్లు గ్లోబల్ ఆటో దిగ్గజం ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్ తాజాగా వెల్లడించింది. దీనిలో భాగంగా రానున్న రెండేళ్లలో నాలుగు కొత్త స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలను(ఎస్‌యూవీలు) ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొంది. పెట్టుబడులను స్థానిక తయారీ కోసం వెచ్చించనున్నట్లు తెలియజేసింది. తద్వారా ఎస్‌యూవీలలో మధ్యస్థాయి, మూడు వరుసల వాహనాలను రూపొందించనున్నట్లు తెలియజేసింది. వీటితోపాటు జీప్ ర్యాంగ్యులర్, జీప్ చెరొకీ వాహనాల అసెంబ్లింగ్‌ను చేపట్టనున్నట్లు వివరించింది. ఈ బాటలో జీప్ కంపాస్ ఎస్యూవీ కొత్త వెర్షన్‌ను ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొంది. (కొత్త కెమెరా ఫీచర్స్‌తో స్మార్ట్ ఫోన్ల సందడి) 1 శాతమే ప్రస్తుతం దేశీ ప్యాసింజర్ కార్ల మార్కెట్లో ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్(ఎఫ్సీఏ) వాటా 1 శాతానికంటే తక్కువగానే ఉన్నట్లు ఆటో రంగ నిపుణులు పేర్కొన్నారు. పోర్ట్‌ఫోలియోలో కొత్త వాహనాలను జత చేసుకోవడం ద్వారా వాటాను పెంచుకునే ప్రణాళికల్లో కంపెనీ ఉన్నట్లు తెలియజేశారు. అంతేకాకుండా స్థానికంగా విడిభాగాలను సమకూర్చుకోవడం ద్వారా ఆర్థికంగానూ పటిష్టపడే యోచనలో ఉన్నట్లు వివరించారు. వెరసి వ్యయాలు తగ్గించుకుంటూ అమ్మకాలు పెంచుకునే బాటలో కంపెనీ సాగనున్నట్లు తెలియజేశారు. 25 కోట్ల డాలర్ల కొత్త పెట్టుబడుల కారణంగా పలు విభాగాలలో బలాన్ని పెంచుకోనున్నట్లు ఎఫ్సీఏ ఇండియా ఎండీ పార్ధ దత్తా చెప్పారు. తమ వాహనాలకు విడిభాగాలను స్థానికంగానే సమకూర్చుకునేందుకు సంసిద్ధమై ఉన్నట్లు వెల్లడించారు. (బ్యాంకింగ్ వ్యవస్థలోకి పోస్టాఫీస్ బ్యాంక్) టాప్ గేర్‌లో నిజానికి కోవిడ్-19 నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఆటో రంగ దిగ్గజాలు పెట్టుబడులకు వెనకడుగు వేస్తున్నట్లు పరిశ్రమ విశ్లేషకులు తెలియజేశారు. దేశీయంగానూ 2019 నుంచీ ఆటో రంగం నెమ్మదించినట్లు ప్రస్తావించారు. దీంతో జపనీస్ దిగ్గజం హోండా మోటార్ రెండు ప్లాంట్లలో ఒకదానిని మూసివేసేందుకు నిర్ణయించినట్లు తెలియజేశారు. ఇదేవిధంగా 2017లోనే దేశీయంగా కార్ల విక్రయాలను నిలిపివేసిన జనరల్ మోటార్స్ ఎగుమతుల కోసం చేపడుతున్న కార్ల ఉత్పత్తికి సైతం మంగళం పాడుతున్నట్లు గత నెలలో వెల్లడించింది. అయితే మరోవైపు గత రెండేళ్లలో దక్షిణ కొరియా కంపెనీ కియా మోటార్స్, చైనా దిగ్గజం ఎస్ఏఐసీ మోటార్ కార్ప్ దేశీ మార్కెట్లలో ప్రవేశించిన విషయం విదితమే. తయారీ ఇలా పశ్చిమ భారతంలో దేశీ దిగ్గజం టాటా మోటార్స్‌తో సంయుక్తంగా ఏర్పాటు చేసిన ప్లాంటులో కొత్త ఎస్‌యూవీలను తయారు చేయనున్నట్లు ఎఫ్సీఏ వెల్లడించింది. కంపెనీ విడుదల చేయనున్న మూడు వరుసల ఎస్యూవీ ప్రధానంగా ఫోర్డ్ మోటార్ తయారీ ఎండీవర్, టయోటా తయారీ ఫార్చూనర్లతో పోటీ పడే వీలున్నట్లు ఆటో రంగ నిపుణులు భావిస్తున్నారు. తాజా పెట్టుబడులతో దేశీయంగా ఎఫ్సీఏ మొత్తం ఇన్వెస్ట్మెంట్స్ 70 కోట్ల డాలర్లకు(దాదాపు రూ. 5,200 కోట్లు) చేరనున్నట్లు తెలియజేశారు. వీటిలో గ్లోబల్ టెక్ సెంటర్‌కు కేటాయించిన15 కోట్ల డాలర్లు కలసి ఉన్నట్లు చెప్పారు. -
భారత్‌లోకి ఫియట్ జీప్ బ్రాండ్
జోద్పూర్: ఇటలీకి చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ ‘ఫియట్ క్రిస్లెర్ ఆటోమొబైల్స్’ (ఎఫ్సీఏ) తన జీప్ బ్రాండ్‌ను భారత్‌లోకి ప్రవేశపెట్టింది. కంపెనీ తాజాగా ‘రాంగ్లర్’, ‘గ్రాండ్ చెరోకీ’ అనే రెండు ఎస్యూవీ మోడళ్లను మార్కెట్లో ఆవిష్కరించింది. రాంగ్లర్ ధర రూ.71.59 లక్షలు. ఇక మూడు వేరియంట్లలో లభ్యంకానున్న చెరోకీ ధర రూ.93.64 లక్షలు నుంచి రూ.1.12 కోట్ల మధ్యలో ఉంది. అన్ని ధరలు ఎక్స్‌షోరూమ్ ఢిల్లీవి. అలాగే వచ్చే ఏడాది రెండో త్రైమాసికం నుంచి పుణే ప్లాంటులో తయారీని ప్రారంభిస్తామని కంపెనీ పేర్కొంది. ఈ ఏడాది చివరకు హైదరాబాద్ సహా మరో ఎనిమిది నగరాల్లో జీప్ డెస్టినేషన్ స్టోర్ బ్రాండ్ కింద పది డీలర్‌షిప్స్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపింది. -
మార్కెట్లోకి ఫియట్ అవెంచురా
ధర రూ. 5.99 - రూ. 8.17 లక్షలు న్యూఢిల్లీ: కార్ల తయారీ దిగ్గజం ఫియట్ గ్రూప్ ఆటోమొబైల్స్ ఇండియా మంగళవారం భారత మార్కెట్లో స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం (ఎస్యూవీ) అవెంచురాను ఆవిష్కరించింది. దీని ధర రూ. 5.99- రూ. 8.17 లక్షల శ్రేణిలో (ఢిల్లీ ఎక్స్‌షోరూం) ఉంటుంది. ఇది పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లభిస్తుందని కంపెనీ తెలిపింది. పెట్రోల్ వేరియంట్ రేటు రూ. 5.99-రూ. 7.05 లక్షల శ్రేణిలో, డీజిల్ వేరియంట్ ధర రూ. 6.89- రూ. 8.17 లక్షల శ్రేణిలో ఉంటుందని వివరించింది. మహారాష్ట్రలోని రంజన్‌గావ్ ప్లాంటులో అవెంచురాను ఉత్పత్తి చేస్తామని, ప్రాథమికంగా దేశీ మార్కెట్లోనే విక్రయిస్తామని సంస్థ భారత విభాగం ఎండీ నగేశ్ బసవనహళ్లి తెలిపారు. ఇప్పటిదాకా 500 ప్రీ-లాంచ్ బుకింగ్స్ జరిగాయని.. 15,000 పైచిలుకు ఎంక్వైరీలు వచ్చాయని నగేశ్ వివరించారు. ఈ ఏడాది మొత్తం అయిదు మోడల్స్‌ను ప్రవేశపెట్టాలని నిర్దేశించుకున్న ఫియట్... త్వరలో లగ్జరీ కారు అబార్త్ 500ను అందుబాటులోకి తేవాలని యోచిస్తోంది. ఇక, రాబోయే అయిదేళ్లలో 12 మోడల్స్‌ను ఆవిష్కరించాలని, 2015 నాటికి జీప్ బ్రాండ్ వాహనాలను భారత్‌లో ఉత్పత్తి చేయాలని సంస్థ భావిస్తోంది. ప్రస్తుతం కంపెనీ వార్షిక వాహన ఉత్పత్తి సామర్థ్యం 1,35,000గా ఉంది. దీన్ని 2018 నాటికల్లా 2,45,000 యూనిట్లకు పెంచుకోవాలని ఫియట్ నిర్దేశించుకుంది.