న్యూఢిల్లీ: బిహార్‌లోని బెగుసరాయ్ స్థానం నుంచి జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ నేత కన్హయ్య కుమార్‌ను పోటీలో ఉంచనున్నట్లు సీపీఐ తెలిపింది. రాష్ట్రంలోని ఆర్‌జేడీ నేతృత్వంలోని కూటమి నుంచి వైదొలిగిన కొన్ని రోజులకే సీపీఐ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. సీపీఐ నేత డి.రాజా ఆదివారం మీడియాకు ఈ విషయం వెల్లడించారు. ‘మా పార్టీ తరఫున బెగుసరాయ్ లోక్‌సభ స్థానంలో కన్హయ్య కుమార్ పోటీలో ఉంటారు. ఆయనకు సీపీఐ(ఎంఎల్) ఇప్పటికే మద్దతు ప్రకటించింది’ అని వివరించారు. రాష్ట్రంలోని మరో రెండు స్థానాలకు పార్టీ కేంద్ర నాయకత్వం త్వరలోనే అభ్యర్థులను ఖరారు చేస్తుందని తెలిపారు. బెగుసరాయ్‌లో బీజేపీ తరఫున కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ బరిలో ఉన్నారు. కాగా, మహాకూటమి తన అభ్యర్థి పేరును ఇంకా ఖరారు చేయలేదు.
Comments
Please login to add a commentAdd a comment