Begusarai Bihar
-
కాలుష్య రాజధానిగా ఢిల్లీ
న్యూఢిల్లీ: ‘అత్యంత కాలుష్య దేశ రాజధాని’ అప్రతిష్ట కిరీటాన్ని ఢిల్లీ మరోసారి తన నెత్తిన పెట్టుకుంది. స్విట్జర్లాండ్‌కు చెందిన ఐక్యూఎయిర్ సంస్థ ప్రపంచ వాయు నాణ్యతా నివేదిక–2023లో పలు అంశాలను ప్రస్తావించింది. నివేదికలో వెల్లడైన వివరాల ప్రకారం.. ప్రపంచంలోనే అత్యంత కాలుష్యంతో నిండిన మెట్రోపాలిటన్ ప్రాంతంగా బిహార్‌లోని బెగుసరాయ్ నిలిచింది. ఘనపు మీటర్‌కు 54.4 మైక్రోగ్రామ్‌ల చొప్పున వార్షిక సూక్ష్మధూళికణాల(పీఎం 2.5) గాఢత ఉన్న దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలో నిలిచింది. 79.9 మైక్రోగ్రామ్‌లతో బంగ్లాదేశ్ తొలిస్థానంలో, 73.7 మైక్రోగ్రామ్‌లతో పాకిస్థాన్ రెండోస్తానంలో నిలిచింది. గత ఏడాది ఘనపు మీటర్‌కు కేవలం 53.4 మైక్రోగ్రామ్‌ల వార్షిక సూక్ష్మధూళి కణాల(పీఎం 2.5)గాఢతతో భారత్ ఎనిమిదో స్థానంలో ఉండగా ఇటీవలికాలంలో దేశంలో కాలుష్యం విపరీతంగా కమ్ముకుని భారత స్థానం దారుణంగా మూడో స్థానానికి ఎగబాకడం ఆందోళనకరం. ఇక బిహార్‌లోని బెగుసరాయ్ గత ఏడాది కాలుష్యప్రాంతాల జాబితాలోనే లేదు. కానీ ఈ ఏడాది ఘనపు మీటర్‌కు 118.9 మైక్రోగ్రామ్‌ల పీఎం2.5 గాఢతతో ప్రపంచంలోనే అతి కాలుష్య మెట్రోపాలిటన్ పట్టణంగా అప్రతిష్టను మూటగట్టుకుంది. ఆ తర్వాతి స్థానాలో గువాహటి, ఢిల్లీ, పంజాబ్‌లోని ముల్లాన్‌పూర్ నిలిచాయి. నాలుగుసార్లు టాప్ ర్యాంక్ ఢిల్లీ పీఎం2.5 గాఢత గత ఏడాది 89.1 మైక్రోగ్రాములు ఉంటే ఈసారి మరికాస్త పెరిగి 92.7 మైక్రోగ్రాములకు చేరుకుంది. దీంతో విపరీతమై కాలుష్యం కారణంగా 2018 ఏడాది నుంచి చూస్తే నాలుగుసార్లు మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్ సిటీ కిరీటాన్ని ఢిల్లీకే కట్టబెట్టారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం ఒక ఘనపు మీటర్‌కు 5 మైక్రోగ్రాములకు మించి సూక్ష్మధూళి కణాలు ఉండకూడదు. కానీ భారత్‌లోని 136 కోట్ల ప్రజలు అధిక వాయుకాలుష్యం బారిన పడ్డారని తాజా నివేదిక ఘోషిస్తోంది. దేశ జనాభాలో 96 శాతం మంది అంటే 133 కోట్ల మంది డబ్ల్యూహెచ్‌వో పరిమితికి ఏడు రెట్లు మించి కాలుష్యమయ వాతావరణంలో జీవిస్తున్నారు. భారత్‌లోని 66 శాతం నగరాలు సగటున ఘనపు మీటర్‌కు 35 మైక్రోగ్రామ్‌ల ధూళికణాలున్న వాయుకాలుష్యం బారిన పడ్డాయి. విభిన్న మార్గాల్లో, విస్తృతస్థాయి డేటా ప్రపంచవ్యాప్తంగా 134 దేశాల్లో ఏర్పాటుచేసిన 30,000 వాయునాణ్యతా ప్రమాణాల స్టేషన్లు, సెన్సార్లు సేకరించిన డేటాను క్రోడీకరించి ఈ నివేదికను తయారుచేసినట్లు ఐక్యూఎయిర్ తెలిపింది. అధ్యయన సంస్థలు, ప్రభుత్వ విభాగాలు, విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు, ప్రభుత్వేతర లాభాపేక్షలేని సంస్థలు, ప్రైవేటు కంపెనీలు, పౌర శాస్త్రవేత్తల నుంచి తీసుకున్న డేటాను ఈ నివేదిక కోసం వినియోగించినట్లు సంస్థ పేర్కొంది. ఆసియా ‘100’లో 83 భారత్‌లోనే ప్రపంచవ్యాప్తంగా కాలుష్యానికి కేరాఫ్ అడ్రస్‌గా భారత్ పేరుమోస్తోంది. ఆసియాలో అత్యంత కాలుష్యమయ 100 నగరాల జాబితా ప్రకటించగా అందులో 83 నగరాలు భారత్‌లో ఉండటం దారుణ పరిస్థితికి దర్పణం పడుతోంది. కొన్ని నగరాల్లో కాలుష్యం డబ్ల్యూహెచ్‌వో పరిమితిని పది రెట్లు దాటేయడం గమ నార్హం. కాలుష్యానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా 7,800 నగరాలను పరిశీలిస్తే అందులో డబ్ల్యూహెచ్‌వో పరిమితికి లోబడి కేవలం 9 శాతం నగరాలు ఉండటం చూస్తే పరిస్థితి చేయిదాటిపోయిందని అర్ధమవుతోంది. ‘ ఫిన్లాండ్, ఎస్తోనియా, ప్యూర్టోరీకో, ఆస్ట్రేలి యా, న్యూజిలాండ్, బెర్ముడా, గ్రెనెడా, ఐస్‌ల్యాండ్, మారిషస్, ప్రెంచ్ పాలినేసియా దేశాల్లో మాత్రం వాయు నాణ్యత బాగుంది. -
రైల్లో ఉన్నవారికి ఆహారం అందిస్తోన్న బీహార్‌వాసులు
-
కన్హయ్య.. ఆ నినాదం ఇచ్చావా.. చెప్పు?
పట్నా : జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు, సీపీఐ యువనేత కన్హయ్య కుమార్ కాన్వయ్‌ని బేగూసరాయి స్థానికులు అడ్డుకున్నారు. ‘భారత్‌కే తుక్డే..తుక్డే’ అంటూ ఇచ్చిన నినాదంపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అతన్ని ఘోరవ్ చేశారు. 2016లో జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఉన్న కన్హయ్య కుమార్.. దేశ సమగ్రతను దెబ్బతినే విధంగా నినాదాలు చేశారన్న ఆరోపణలతో అతనిపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో కన్హయ్య వీటిని గట్టిగా ఖండించారు. వామపక్ష సిద్ధాంతాలను, దళితులకు అంబేడ్కర్ కల్పించిన రక్షణ కవచాన్ని కలగలిపి ‘లాల్.. నీల్’ అనే ఒక కొత్త రాజకీయ అస్త్రాన్ని సంధించి అందరి దృష్టిని ఆకర్షించిన కన్హయ్య కుమార్.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బేగూసరాయి నుంచి పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించగా స్థానికులు కొంతమంది అడ్డుకున్నారు. ఏరకమైన స్వేచ్ఛ కావాలంటూ నిలదీశారు. రిజర్వేషన్లను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని, భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేసినట్లు వచ్చిన ఆరోపణల సంగతేంటని ప్రశ్నించారు. దీనికి సమాధానం చెప్పని కన్హయ్య కుమార్.. బీజేపీ మద్దతుదారులా అంటూ ఎదురు ప్రశ్నించారని స్థానికులు మీడియాతో వాపోయారు. -
లాల్, నీల్.. కన్హయ్య
సాక్షి, సెంట్రల్ డెస్క్ : ప్రజా సమస్యలే పోరాట పంథాగా, జనం గొంతుక వినిపించే కమ్యూనిస్టు పార్టీల ఉనికి ప్రశ్నార్థకమవుతున్న తరుణంలో మూడేళ్ల క్రితం ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో (జేఎన్‌యూ) పీహెచ్డీ విద్యార్థి కన్హయ్య కుమార్ రూపంలో ఒక నవగళం దేశవ్యాప్తంగా మారుమోగింది. ఇప్పుడా గళమే మన రాజకీయ వ్యవస్థలో మార్పు కోసం నినదిస్తోంది. ఏళ్లకి ఏళ్లు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న రాజకీయాలకే అలవాటుపడిపోయిన ప్రజలకి వామపక్ష సిద్ధాంతాలను, దళితులకు అంబేడ్కర్ కల్పించిన రక్షణ కవచాన్ని కలగలిపి ‘లాల్.. నీల్’ అనే ఒక కొత్త రాజకీయ అస్త్రాన్ని సంధించి, అందరి దృష్టిని ఆకర్షించినవాడు కన్హయ్య కుమార్. ఇంటింటి ఉద్యమ కెరటం చిన్నతనం నుంచే వామపక్ష భావజాలం, అందరినీ మంత్రముగ్ధుల్ని చేసే వాగ్ధాటి ఉండడంతో జేఎన్‌యూలో అంతగా పట్టులేని లెఫ్ట్ పార్టీ విద్యార్థి విభాగం ఏఐఎస్ఎఫ్ నుంచి పోటీచేసి విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు కన్హయ్యకుమార్. విద్యార్థులకు పీహెచ్డీ భృతి తగ్గించడంతో ‘ఆక్యుపై యూజీసీ’ పేరుతో వీధులకెక్కి పోరాడినప్పుడు తొలిసారి ఆయన పేరు అందరికీ తెలిసింది. జేఎన్‌యూలో జాతివ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న ఆరోపణలతో దేశద్రోహం నేరం కింద అరెస్టయి బయటకి వచ్చాక కన్హయ్యకుమార్ తోటి విద్యార్థుల్ని ఉద్దేశించి చేసిన ప్రసంగంతో ఆయన పేరు ఊరూవాడా మారుమోగింది. ఆ ప్రసంగమే రాజకీయ జీవితానికి పునాది వేసింది. చట్టసభల్లో కొత్త గొంతుకనవుతా.. రాజ్యాంగాన్ని కచ్చితంగా అమలు చేసినప్పుడు సమ సమాజం ఆవిష్కృతమవుతుందని నమ్ముతారు కన్హయ్య కుమార్. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే నడిరోడ్డుపై నిల్చోబెట్టి ప్రశ్నించాలని అంటారు. అందుకే చట్టసభల్లో కొత్త గొంతుకనవుతానని ఎలుగెత్తి చాటుతున్నారు. 2018 ఏప్రిల్‌లో సీపీఐ జాతీయ సమితిలో చేరారు. అప్పట్నుంచి జనసంవాద్ కార్యక్రమం ద్వారా 100కిపైగా సమావేశాలు నిర్వహించి జనంలోకి చొచ్చుకెళ్లారు. ఇప్పుడు బిహార్‌లోని బేగూసరాయి నియోజకవర్గం నుంచి వామపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఉద్యమ నేపథ్య కుటుంబం.. బిహార్‌లోని బేగూసరాయిలో అగ్రవర్ణానికి చెందిన భూమిహార్ కుటుంబం నుంచి వచ్చారు కన్హయ్యకుమార్. తండ్రి జయశంకర్ సింగ్ చాలా ఏళ్లుగా పక్షవాతంతో మంచానికే పరిమితమయ్యారు. తల్లి మీనాదేవి అంగన్వాడీ కార్యకర్త. ఒకప్పుడు తల్లిదండ్రులిద్దరూ రైతు హక్కుల కోసం పోరాటాలు చేశారు. ఉద్యమమే ఊపిరిగా బతికిన కుటుంబం కావడంతో చిన్నప్పట్నుంచి కన్హయ్యకుమార్ ఆలోచనలన్నీ అణగారిన బతుకుల చుట్టూ తిరుగుతుండేవి. వామపక్ష భావజాలానికి ఓట్లు రాల్చే సత్తా లేదని భావించిన కన్హయ్య కుమార్ దేశంలోని దళితులు, వామపక్షాలు కలిస్తేనే సరికొత్త విప్లవం పుట్టుకొస్తుందని ప్రతిపాదిస్తున్నారు. ‘లాల్, నీల్’ నినాదంతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. కన్హయ్యకుమార్ విజేతగా నిలుస్తారా ? ఒక ప్రశ్నించే గళం, ఆగ్రహావేశాలు రగిలించే ప్రసంగం నవయువకుల్లో స్ఫూర్తి నింపుతోంది. నేటి తరం ఆయన ప్రసంగాల్ని ఆసక్తిగా వింటున్నారు. ‘‘ కన్హయ్యకుమార్ యువతకి ఆదర్శప్రాయుడు, ఒక హీరో. మోదీనే ఎదురిస్తున్న ధీరుడు. అందులో సందేహం లేదు. కానీ నడి వయసులో వారిని,వయసు మళ్లిన వారిని కన్హయ్య కుమార్ ప్రసంగాలు ఆకట్టుకోలేకపోతున్నాయి‘‘అని బీహార్‌కు చెందిన జర్నలిస్టు ఒకరు వ్యాఖ్యానించారు. బీజేపీ నుంచి వివాదాస్పదుడైన కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ బరిలో ఉంటే, మహాగఠ్ బంధన్‌లో భాగస్వామి అయినప్పటికీ ఆర్జేడీ తన్వీర్ హసన్‌ను పోటీలో నిలిపింది. కన్హయ్య కుమార్ భావజాలం జనసామాన్యంలోకి వెళ్లలేదనే భావనతో ఉన్న ఆర్జేడీ ఎన్నికల గోదాలోకి దిగింది. మహాగఠ్‌బంధన్ కన్హయ్యకుమార్కు మద్దతుగా నిల్చొని ఉంటే ఆయన విజయం నల్లేరు మీద బండి నడకే. కానీ త్రిముఖ పోటీలో ఓట్లు చీలి ఎవరికి లాభం చేకూరుతుందో ఇప్పట్నుంచే చెప్పలేని స్థితి. కన్హయ్య కుమార్ పక్కా లోకల్ కావడం ఆయనకి కలిసొచ్చే అంశం.. కొత్త గొంతుకల మద్దతు ప్రజాస్వామ్యంలో కొత్త ఉద్యమ కెరటాలైన హార్దిక్ పటేల్, జిగ్నేష్ మేవాని వంటివారు కన్హయ్యకు మద్దతుగా ప్రచారానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా రాజకీయం రంగు మార్చుకుంది. గత ఏడాది గుజరాత్లో బీహార్, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులపై దాడులు జరిపి, వారిని రాష్ట్రం నుంచి తరిమేసిన విషయం తెలిసిందే. దీనినే కేంద్రమంత్రి, బీజేపీ అభ్యర్థి గిరిరాజ్ సింగ్ ఒక ఆయుధంగా తీసుకున్నారు. జిగ్నేష్ మేవానీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘బెంగుసరాయిలో మీకేం పని ? బిహారీలను తరిమి కొట్టారు. అలా దాడులు చేసిన వారి వెనక ఉండి మీరే ప్రోత్సహించారు. అప్పటి ఉద్రిక్తతలకి మీదే బాధ్యత‘ అంటూ ట్వీట్ చేశారు. దీనికి మేవానీ గట్టిగానే బదులిచ్చారు.. ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్టుగా గుజరాత్లో బీజేపీ అధికారంలో ఉంటే, తనను నిందించడం ఏమిటని సూటిగా ప్రశ్నించారు. గిరిరాజ్‌సింగ్‌పై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఒక మహా కవి చెప్పినట్టుగా కన్హయ్య కుమార్‌కు కెరటమే ఆదర్శం. పడినందుకు కాదు, పడినా లేచినందుకు. కన్హయ్య ఎన్నికల్లో గెలిచారా, ఓడారా అన్నది కాదు ముఖ్యం. ఒక కొత్త తరహా రాజకీయాలకు దారి చూపించిన యువకుడిగా ఆయన చరిత్ర సృష్టిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. -
బెగుసరాయ్ నుంచి కన్హయ్యకుమార్
న్యూఢిల్లీ: బిహార్‌లోని బెగుసరాయ్ స్థానం నుంచి జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ నేత కన్హయ్య కుమార్‌ను పోటీలో ఉంచనున్నట్లు సీపీఐ తెలిపింది. రాష్ట్రంలోని ఆర్జేడీ నేతృత్వంలోని కూటమి నుంచి వైదొలిగిన కొన్ని రోజులకే సీపీఐ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. సీపీఐ నేత డి.రాజా ఆదివారం మీడియాకు ఈ విషయం వెల్లడించారు. ‘మా పార్టీ తరఫున బెగుసరాయ్ లోక్‌సభ స్థానంలో కన్హయ్య కుమార్ పోటీలో ఉంటారు. ఆయనకు సీపీఐ(ఎంఎల్) ఇప్పటికే మద్దతు ప్రకటించింది’ అని వివరించారు. రాష్ట్రంలోని మరో రెండు స్థానాలకు పార్టీ కేంద్ర నాయకత్వం త్వరలోనే అభ్యర్థులను ఖరారు చేస్తుందని తెలిపారు. బెగుసరాయ్‌లో బీజేపీ తరఫున కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ బరిలో ఉన్నారు. కాగా, మహాకూటమి తన అభ్యర్థి పేరును ఇంకా ఖరారు చేయలేదు. -
నాలుగు మొండాలు స్వాధీనం..
బెగూసరాయ్ః తలలేని నాలుగు మొండాలను బీహార్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బెగుసరాయ్ జిల్లా సన్హా రైల్వే క్రాసింగ్ దగ్గరలోని ఓ మురిగి కాలువ వద్ద మృత దేహాలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. బీహార్ బెగుసరాయ్ జిల్లాలో తలలేని మొండాలు కనిపించడం కలకలం సృష్టించింది. కాలువవద్ద పశుగ్రాసం కోసేందుకు వెళ్ళిన ఓ మహిళకు ఆ ప్రాంతంలో పడుకోబెట్టి ఉన్న తల లేని మృత దేహాలు కనిపించడంతో ఆమె వెంటనే తమకు సమాచారం అందించినట్లు సాహెబ్‌పూర్ కమల్ పోలీస్ స్టేషన్ ఇన్ ఛార్జ్ రాజేష్ కుమార్ తెలిపారు. మృతదేహాల్లో ఒక మహిళ, ఇద్దరు మైనర్ బాలికలు, ఓ బాలుడు ఉండగా.. బాడీలను పోస్ట్ మార్టమ్ కు తరలించి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు కుమార్ పేర్కొన్నారు. పోలీసులు త్వరలో మృతులకు సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు.