నాలుగు మొండాలు స్వాధీనం..
బెగూసరాయ్ః తలలేని నాలుగు మొండాలను బీహార్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బెగుసరాయ్ జిల్లా సన్హా రైల్వే క్రాసింగ్ దగ్గరలోని ఓ మురిగి కాలువ వద్ద మృత దేహాలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
బీహార్ బెగుసరాయ్ జిల్లాలో తలలేని మొండాలు కనిపించడం కలకలం సృష్టించింది. కాలువవద్ద పశుగ్రాసం కోసేందుకు వెళ్ళిన ఓ మహిళకు ఆ ప్రాంతంలో పడుకోబెట్టి ఉన్న తల లేని మృత దేహాలు కనిపించడంతో ఆమె వెంటనే తమకు సమాచారం అందించినట్లు సాహెబ్పూర్ కమల్ పోలీస్ స్టేషన్ ఇన్ ఛార్జ్ రాజేష్ కుమార్ తెలిపారు. మృతదేహాల్లో ఒక మహిళ, ఇద్దరు మైనర్ బాలికలు, ఓ బాలుడు ఉండగా.. బాడీలను పోస్ట్ మార్టమ్ కు తరలించి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు కుమార్ పేర్కొన్నారు. పోలీసులు త్వరలో మృతులకు సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు.