జీప్ కంపెనీ భారతదేశంలో తన మెరిడియన్ ఫేస్‌లిఫ్ట్‌ను రూ. 24.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ఇది దాని మునుపటి మోడల్ మాదిరిగా కాకుండా అప్డేటెడ్ కాస్మొటిక్ డిజైన్ కలిగి 5 సీటర్, 7 సీటర్ కాన్ఫిగరేషన్‌లలో లభిస్తుంది. కొత్త మెరిడియన్ కోసం బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. డెలివరీలు ఈ నెల చివరలో ప్రారంభమవుతాయి.
అప్డేటెడ్ మెరిడియన్ లాంగిట్యూడ్, లాంగిట్యూడ్ ప్లస్, లిమిటెడ్ (ఓ), ఓవర్‌ల్యాండ్ అనే నాలుగు ట్రిమ్‌లలో అందుబాటులో ఉంటుంది. ఎంట్రీ-లెవల్ లాంగిట్యూడ్ ట్రిమ్ 5-సీటర్‌గా మాత్రమే అందుబాటులో ఉంది. మిగిలిన మూడు ట్రిమ్‌లు 7-సీటర్‌గా మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
జీప్ మెరిడియన్ ఫేస్‌లిఫ్ట్ ఐకానిక్ సెవెన్-స్లాట్ గ్రిల్‌తో హనీకూంబ్ మెష్ క్రోమ్ స్టడ్‌లను పొందుతుంది. ఇది 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. క్యాబిన్ లేఅవుట్ మునుపటి మాదిరిగానే ఉన్నప్పటికీ.. డ్యాష్‌బోర్డ్ కాపర్ స్టిచింగ్‌తో కొత్త స్వెడ్ ఫినిషింగ్‌ని పొందింది. 9 స్పీకర్ ఆల్పైన్ ఆడియో సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు వంటి వాటితో పాటు.. ఈ కారులో 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10.1 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, లెవెల్ 2 ఏడీఏఎస్ వంటివి ఉన్నాయి.
ఇదీ చదవండి: గూగుల్‌లో ఉచిత భోజనం ఎందుకంటే?: సుందర్ పిచాయ్
జీప్ మెరిడియన్ ఫేస్‌లిఫ్ట్ 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 170 హార్స్ పవర్, 350 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 4x2, 4x4 వేరియంట్‌లతో పాటు 6 స్పీడ్ మాన్యువల్ & 9 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది. కాబట్టి ఉత్తమ పనితీరును అందిస్తుందని భావిస్తున్నాము.
Comments
Please login to add a commentAdd a comment