సచివాలయానికి పోలీసులు భద్రత పెంచారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో సచివాలయలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు.
హైదరాబాద్ : సచివాలయానికి పోలీసులు భద్రత పెంచారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో సచివాలయలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. సచివాలయంలో ర్యాలీలు, నిరసన ప్రదర్శనలపై పోలీసులు దృష్టి సారించారు. విధులకు ఆటంకం కలిగించేలా ఉన్న నిరసన కార్యక్రమాలను అడ్డుకోవాలని పోలీసులు నిర్ణయించారు. ఈ మేరకే పోలీసులు సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత ఉద్యోగులకు సూచనలు చేశారు.
రాష్ట్ర విభజన ప్రకటన అనంతరం సచివాలయంలో ఇరుప్రాంతల ఉద్యోగులు నిరసనలు, ర్యాలీలు, ఆందోళనలు చేపడుతున్న విషయం తెలిసిందే. మరోవైపు సచివాలయంలోకి ప్రభుత్వ వాహనాలు తప్ప ప్రయివేటు వాహనాలను అనుమతించలేదు. సచివాలయ ఉద్యోగులను సైతం క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతనే అనుమతిస్తున్నారు. ఉద్యోగులను తప్పా ఇతరులను అనుమతించటం లేదు.