కమిషనర్ వీసీ సజ్జనార్
సాక్షి, సిటీబ్యూరో : నగర శివార్లతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో మిళితమై ఉన్న సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు కమిషనర్ వీసీ సజ్జనార్ పేర్కొన్నారు. ఎన్నికలు సాఫీగా జరిగేందుకు అమలుచేస్తున్న చర్యల పై ‘సాక్షి’కి ఆయన వివరించారు. చేవేళ్ల, మల్కాజిగిరితో పాటు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి కొన్ని ప్రాంతాలు వచ్చే హైదరాబాద్, సికింద్రాబాద్, మహబూబ్‌నగర్, మెదక్ లోక్‌సభ స్థానాల్లో ప్రశాంత పోలింగ్ కోసం చర్యలు తీసుకుంటున్నామన్నారు.
భారీ భద్రత నీడలో..
కమిషనరేట్ పరిధిలోని 4,500 మంది విధుల్లో నిమగ్నమవుతున్నారు. 10 కంపెనీల పారామిలిటరీ బలగాల సేవల్నీ వినియోగిస్తున్నాం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికో ఏసీపీని ఇన్‌చార్జిగా నియమిం చాం. ఎన్నికల సమయంలో జిల్లా ఎన్నికల అధికారులతో సమన్వ యం చేసుకోవల్సిన బాధ్యతను అప్పగించాం. ప్రజల్లో ఆత్మవిశ్వా సం నింపేందుకు కీలక ప్రాంతాల్లో ఫ్లాగ్‌మార్చ్ నిర్వహిస్తున్నాం. భద్ర త పరంగా ఎలాంటి ఆందోళన లేకుండా ఓటర్లు పోలింగ్‌లో పాల్గొనవచ్చు.
నిరంతర నిఘా..
వివిధ ప్రాంతాల్లో 11 తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేసి నిరంతర నిఘా ఉంచాం. అక్రమంగా తరలిస్తు న్న నగదుపై దృష్టి సారించాం. మద్యం తరలిం పుపై నిఘా ఉంచాం. వీటికితోడు స్టాటిక్ సర్వైలైన్స్ బృందాలు, సంచార తనిఖీ బృందాలు, క్వి క్ రెస్పాన్స్ టీమ్‌లు, స్ట్రైకింగ్ ఫోర్స్ బృం దా లు పనిచేస్తున్నాయి. కమిషనరేట్ పరిధి లోని రౌడీషీటర్ల బైండోవర్లపై ఆయా ఠాణాల పోలీసులు దృష్టి సారించారు. లైసెన్స్ గన్‌లు కలిగిన వారు తమ ఆయుధాలను ఇప్పటికే ఆయా పోలీసు స్టేషన్‌లలో డిపాజి ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment