ఖమ్మం లీగల్, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును లోక్‌సభలో ఆమోదించడంతో జిల్లా కోర్టులో సంబురాలు మిన్నంటాయి. న్యాయవాదులు వేడుక లు చేసుకున్నారు. డప్పులతో నృత్యాలు చేస్తూ రంగులు చల్లుకున్నారు. కక్షిదారులు కూడా వారితో జతకట్టి నృత్యాలు చేశారు. మహిళ న్యాయవాదులు, న్యాయవాద గుమస్తాలు కూడా ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు. ఈ విజయం తెలంగాణ అమరవీరులకు అంకితమంటూ ‘జై తెలంగాణ..జైజై తెలంగాణ’ అని నినాదాలు చేశారు.
తెలంగాణ గీతాన్ని కూడా న్యాయవాదులు ఆలపిం చారు. కోర్టులో తెలంగాణ గీతాలాపన మొదలై మంగళవారంతో 1533 రోజులు కావడం గమనార్హం. కాంగ్రెస్ లీగల్‌సెల్ న్యాయవాదులు జిల్లా కోర్టు ఎదుట సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కోర్టు ప్రాంగణంలో ఉన్న తెలంగాణ తల్లి, తెలంగాణ సైద్ధాంతిక కర్త ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటాలకు పూల మాలలు వేసి, పాలాభిషేకం చేశారు.
ఈ వేడుకల్లో జేఏసీ న్యాయవాదుల కన్వీనర్ బి.తిరుమలరావు, కో కన్వీనర్ కొండపల్లి జగన్‌మెహన్‌రావు, కాంగ్రెస్ లీగల్‌సెల్ న్యాయవాదులు కొత్త వెంకటేశ్వరరావు, మామూనూరి మురళీధర్‌రావు, వెల్లంపల్లి నరేంద్రస్వరూప్, మద్ది శ్రీనివాసరెడ్డి, వెక్కిరాల రాంబాబు, శరత్‌కుమార్‌రెడ్డి, జేఏసీ న్యాయవాదులు వేపచేదు మధు, రానేరు కిరణ్‌కుమార్, కర్లపూడి శ్రీనివాసరావు, వల్లపు లింగయ్య, కమర్తపు రమేష్, జి.శేషగిరిరావు, పులి నరసింహారావు,ఆమనిగంటి వెంకటరమణ, మహిళ న్యాయవాదులు హైమవతి, పోలిశెట్టి పద్మావతి, విజయశాంత పాల్గొన్నారు.
న్యాయవాదుల సంబురాలు
Published Wed, Feb 19 2014 1:54 AM | Last Updated on Wed, Oct 3 2018 6:55 PM
Advertisement