ఎన్టీఆర్ భవన్లా నడిపిస్తున్నారు... | Clash between YSRCP MLAs and marshals in Andhra Pradesh Assembly | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్ భవన్లా నడిపిస్తున్నారు...

Published Fri, Sep 9 2016 11:51 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

ఎన్టీఆర్ భవన్లా నడిపిస్తున్నారు... - Sakshi

ఎన్టీఆర్ భవన్లా నడిపిస్తున్నారు...

హైదరాబాద్ : శాసనసభను ఎన్టీఆర్ భవన్లా నడిపిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ అన్నారు. అసెంబ్లీ 15 నిమిషాల వాయిదా అనంతరం ఆయన శాసనసభ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. టీడీపీకి నచ్చినట్లుగా సభను నడుపుతూ, సమావేశాలను వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారన్నారు.

మార్షల్స్ స్పీకర్ను చుట్టుముట్టి కనిపించకుండా చేస్తున్నారన్నారు. మార్షల్స్తో తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఎమ్మెల్యే సురేష్ అన్నారు. పోలవరం ప్రాజెక్ట్పై చంద్రబాబు చెప్పినవన్నీ అబద్ధాలే అని, వాస్తవాన్ని మసి పూసి మారేడుకాయ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

*ప్రత్యేక హోదాపై చర్చకు ప్రభుత్వం ఎందుకు భయపడుతుందని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ప్రశ్నించారు. చర్చ జరగకుండా ఎందుకు కుట్ర పన్నుతోందని ఆమె అన్నారు.

*ఎమ‍్మెల్యేలని కూడా చూడకుండా మార్షల్స్ దురుసుగా వ్యవహరిస్తున్నారి ఎమ‍్మెల్యే పుష్పవాణి అన్నారు. తమ పట్ల మార్షల్స్ ప్రవర్తించిన తీరు దారుణమన్నారు.

*ఎమ్మెల్యేలను ఏదో ఒకరకంగా బయటకు తోసేయాలనేది ప్రభుత్వ లక్ష్యమని, అందుకే మార్షల్స్తో సభను నడిపిస్తున్నారని మేకా ప్రతాప్ అప్పారావు ధ్వజమెత్తారు.

*ప్రజలను మోసం చేయడం చంద్రబాబుకు అలవాటు అని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. హోదాపై చర్చ అంటేనే ప్రభుత్వం పారిపోతోందని, మార్షల్స్ తో సభ నడపాలని చూడటం దుర్మార్గమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement