'కేంద్రం ముష్టి వేస్తే చంద్రబాబు స్వాగతిస్తారా' | Ysrcp mlas fire on chandrababu over special status issue | Sakshi
Sakshi News home page

'కేంద్రం ముష్టి వేస్తే చంద్రబాబు స్వాగతిస్తారా'

Published Fri, Sep 9 2016 12:11 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

Ysrcp mlas fire on chandrababu over special status issue

హైదరాబాద్‌: కేంద్రం ముష్టి వేస్తే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్వాగతిస్తారా అని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి మండిపడ్డారు. చంద్రబాబు తీరుపై యువకులు రగిలిపోతున్నారని ఆయన అన్నారు. యువకులు, ఏపీ ప్రజల పక్షాన నిలబడి తాము పోరాడుతున్నామని రఘుపతి తెలిపారు. అసెంబ్లీ 15 నిమిషాల వాయిదా అనంతరం వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు శాసనసభ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు.

మార్షల్స్ను పెట్టి ప్రతిపక్షాన్ని బుల్డోజ్‌ చేస్తారా అని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు ధ్వజమెత్తారు. అధికారపక్షం ఎన్నికుట్రలు చేసినా ప్రత్యేక హోదా పై తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా వస్తేనే నిరుద్యోగులకు మేలు జరుగుతుందని తెలిపారు.

మార్షల్స్‌ను ముందే మోహరించడంలో అంతరార్ధమేమిటని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ముస్తఫా అన్నారు. ఏదో ఒకరకంగా సభను అడ్డుకోవాలనేది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement