
సాక్షి, అమరావతి: అసెంబ్లీ ప్రివిలేజెస్ కమిటీ చైర్మన్‌గా ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి నియమితులయ్యారు. పలు అసెంబ్లీ కమిటీలు, జాయింట్ కమిటీలను ఏర్పాటు చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి సోమవారం రెండు బులెటిన్లు విడుదల చేశారు. ప్రివిలేజెస్ కమిటీ చైర్మన్‌గా ఉన్న కాకాణి గోవర్ధన్‌రెడ్డి మంత్రివర్గంలో చేరడంతో ఆయన స్థానంలో కరుణాకర్‌రెడ్డిని నియమించారు. సభ్యులుగా ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మి, కోన రఘుపతి, అబ్బయ్యచౌదరి, సుధాకర్‌బాబు, వెంకట చినఅప్పలనాయుడు, అనగాని సత్యప్రసాద్‌ను నియమించారు.
రూల్స్ కమిటీ చైర్మన్‌గా స్పీకర్ తమ్మినేని సీతారాం, పిటిషన్స్ కమిటీ చైర్మన్‌గా డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, హామీల కమిటీ చైర్మన్‌గా కైలే అనిల్‌కుమార్, ఎథిక్స్ కమిటీ చైర్మన్‌గా శిల్పా చక్రపాణిరెడ్డిని నియమించారు. అసెంబ్లీ, కౌన్సిల్‌కు పలు జాయింట్ కమిటీలను కూడా నియమించారు.
ఎమినిటీస్, వన్యప్రాణి–పర్యావరణ పరిరక్షణ కమిటీల చైర్మన్‌గా తమ్మినేని, ఎస్సీల సంక్షేమ కమిటీ చైర్మన్‌గా గొల్ల బాబూరావు, ఎస్టీల సంక్షేమ కమిటీ చైర్మన్‌గా బాలరాజు, మైనారిటీల సంక్షేమ కమిటీ చైర్మన్‌గా ముస్తఫా, మహిళ, శిశు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ కమిటీ చైర్‌పర్సన్‌గా జొన్నలగడ్డ పద్మావతి, సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్మన్‌గా మర్రి రాజశేఖర్, బీసీల సంక్షేమ కమిటీ చైర్మన్‌గా రమే‹Ùయాదవ్, లైబ్రరీ కమిటీ చైర్మన్‌గా పి.రామసుబ్బారెడ్డిని నియమించారు.