
ప్రివిలేజ్ కమిటీ ఎదుట ఎమ్మెల్యే రోజా
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కె రోజా బుధవారం సభా హక్కుల కమిటీ ఎదుట హాజరయ్యారు. టీడీపీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత ఫిర్యాదు నేపథ్యంలో ప్రివిలేజ్ కమిటీ రోజాకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. అనిత చేసిన ఫిర్యాదులపై రోజా వివరణ ఇవ్వనున్నారు.
కాగా ప్రివిలేజ్ కమిటీ గతంలో ఇదే అంశంపై ఎమ్మెల్యే రోజాకు రెండుసార్లు నోటీసు ఇచ్చింది. అయితే వివిధ కారణాల వల్ల విచారణఖు హాజరు కాలేకపోతున్నట్లు ఆమె లేఖ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రివిలేజ్ కమిటీ మరోసారి రోజాకు నోటీసులు ఇవ్వటంతో ఇవాళ ఆమె విచారణకు హాజరయ్యారు.