
తెలంగాణ నూతన సీఎస్ ఎస్‌కే జోషి
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా శైలేంద్ర కుమార్ జోషి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన... సీఎస్‌గా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధిలో దూసుకు వెళుతోందన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇస్తానని, సీఎం కేసీఆర్ ఆదేశాలతో పని చేస్తానని ఎస్‌కే జోషి తెలిపారు. మరోవైపు నూతన సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎస్‌కే జోషిని డీజీపీ మహేందర్ రెడ్డి, పలువురు అధికారులు సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. నూతన సీఎస్గా శైలేంద్ర కుమార్ జోషిని నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment