సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలు తీసుకోవాలని, దేశంలోని ప్రతిష్టాత్మక ఉన్నత విద్యా సంస్థల్లో సీట్లు లభించేలా బోధన జరగాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి ఆదేశించారు. అర్హులైన ప్రతి విద్యార్థికి రెసిడెన్షియల్ పాఠశాలల్లో ప్రవేశం దక్కేలా చూడాలన్నారు. గురువారం సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సంక్షేమ హాస్టళ్లు, కళాశాలలు, పాఠశాలలకు గ్రేడింగ్ విధానం రూపొందించాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి నిధుల వ్యయం పెంచాలని, స్టడీ సర్కిళ్ల ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువత ఉద్యోగాలు పొందేలా శిక్షణ ఇవ్వాలన్నారు. భూ పంపణీ పథకం లబ్ధిదారులు వ్యవసాయం చేసేలా సహకారం అందించాలని సూచించారు. వ్యవ సాయానికి 24 గంటల విద్యుత్ ఇస్తున్నందున ఈ వేసవిలో 17 వేల మెగావాట్ల డిమాండ్ వచ్చినా తట్టుకునేలా విద్యుత్ అధికారులు ఆ మేరకు చర్యలు తీసుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment