సాక్షి, హైదరాబాద్: కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలను 2015 సంవత్సరం జూలై 14 నుంచి 25 వరకు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు రమణాచారి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ పుష్కరాలకు భారీ సంఖ్యలో భక్తులు హాజరుకానున్నందున ఎలాంటి లోటుపాట్లు ఎదురుకాకుండా నిర్వహించాలని రాజీవ్ శర్మ పేర్కొన్నారు.
పుష్కర ఘాట్లు, దేవాలయాలకు వెళ్లే రోడ్లను తీర్చి దిద్దాలని. ఈ మొత్తం పనుల కోసం రూ.100 కోట్లు కేటాయించాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. బాసర, భద్రాచలం, ధర్మపురి ఈ మూడు ప్రాంతాల్లో ఒకదానిని ప్రధాన పుష్కర ఘాట్‌గా తీర్చిదిద్దాలని, పుష్కరాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి పేరును సీఎం సిఫారసు చేసినందున దానిపై మరోసారి ఆయనతో చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు.
జూలైలో గోదావరి పుష్కరాలు
Published Thu, Oct 9 2014 2:25 AM | Last Updated on Sat, Sep 2 2017 2:32 PM
Advertisement
Advertisement