రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ప్రకాశం జిల్లాలో దత్తత తీసుకున్న గ్రామానికి ఒంగోలు పార్లమెంటు సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి తన ఎంపీ కోటా కింద నిధులు విడుదల చేశారు.
ఒంగోలు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ప్రకాశం జిల్లాలో దత్తత తీసుకున్న గ్రామానికి ఒంగోలు పార్లమెంటు సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి తన ఎంపీ కోటా కింద నిధులు విడుదల చేశారు. తన స్వగ్రామమైన పొన్నలూరు మండలం చౌటపాలెం గ్రామాన్ని సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు దత్తత తీసుకున్న విషయం విదితమే.
ఈ నేపథ్యంలో ఈ గ్రామంలో సామాజిక భవన నిర్మాణానికి ఎంపీ నిధులు విడుదల చేయాలని జిల్లా కలెక్టర్ సుజాతశర్మ ఇటీవల ఎంపీని కోరారు. సామాజిక భవన నిర్మాణానికి రూ.4.5 లక్షలను విడుదల చేస్తూ అంగీకార పత్రాన్ని మంగళవారం ప్రకాశం భవనంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి.. కలెక్టర్‌కు అందజేశారు.