హైదరాబాద్: గంట అదనంగా పని చేయాలన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఆదేశాలు సచివాలయంలోనే అమలు కాలేదు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మృతికి సంతాపంగా మంగళవారం నాడు గంట అదనంగా పని చేయాలని ఆదేశించింది. అయితే తమకు సమాచారం అందలేదంటూ ఉద్యోగులు గంట ముందుగానే వెళ్లిపోయారు. దిగువ స్థాయి సిబ్బందికి సర్క్యులర్ చేరలేదని ఉద్యోగులు అన్నారు. అందుకే ముందుగానే వెళ్లినట్టు వారు వివరించారు.