సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్‌కు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు శనివారం లేఖ రాశారు. కేంద్ర నిధులతో రాష్ట్రం చేపట్టే పథకాలలోని ఫ్లెక్సీల్లో ప్రధాని మోదీ ఫోటో పెట్టాలని ఆయన తన లేఖలో కోరారు. ప్రధాని ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వచ్ఛతే సేవ’ డిజైన్లలో నరేంద్ర మోదీ బొమ్మ లేకపోవడం శోచనీయమని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు.
గతంలో కేంద్ర పథకాల్లో కూడా ప్రధాని ఫోటో లేకపోవడాన్ని ఆయన ఈ సందర్భంగా తప్పుబట్టారు. కాగా స్వచ్ఛ భారత్ పథకంలో భాగంగా ఈ నెల 15వ తేదీ నుంచి అక్టోబర్ 2 వరకూ దేశవ్యాప్తంగా 'స్వచ్ఛతే సేవ' పేరిట చేపట్టే కార్యక్రమాల్లో భాగస్వాములవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.