ప్రధాని పర్యటనకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలి | BJP Leader Somu Veerraju On PM Narendra Modi Visakha Tour | Sakshi
Sakshi News home page

ప్రధాని పర్యటనకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలి

Published Mon, Nov 7 2022 5:50 AM | Last Updated on Mon, Nov 7 2022 6:00 AM

BJP Leader Somu Veerraju On PM Narendra Modi Visakha Tour - Sakshi

ప్రధాని పర్యటన మార్గాన్ని సందర్శిస్తున్న సోము వీర్రాజు, ఎంపీ జీవీఎల్‌ తదితరులు

ఎంవీపీకాలనీ (విశాఖ తూర్పు): విశాఖపట్నంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పిలుపునిచ్చారు.  ఈ నెల 11, 12 తేదీల్లో ప్రధాన మంత్రి పర్యటించనున్న నేపథ్యంలో రెండు రోజులుగా పార్టీ శ్రేణుల సన్నద్ధతపై సమీక్షలు నిర్వహిస్తున్న ఆయన ఆదివారం ప్రధాని పర్యటించే మార్గాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ 11వ తేదీన భారతీయ జనతా పార్టీ శ్రేణులు ప్రధాన మంత్రికి ఘనస్వాగతం పలుకుతాయని తెలిపారు. ఈ సందర్భంగా భారీ రోడ్‌ షో నిర్వహిస్తామని, ఉత్తరాంధ్ర ప్రసిద్ధ సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీ జి.వి.ఎల్‌.నరసింహారావు, ఎమ్మెల్సీ మాధవ్, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్‌రాజు, విశాఖ పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు మేడపాటి రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement